Infinix GT 10 Pro Pre order : ఆగస్టు 3 నుంచే ఇన్ఫినిక్స్ GT 10 ప్రో ఫోన్ ప్రీ-ఆర్డర్.. కీలక ఫీచర్లు అదుర్స్, ధర ఎంతో తెలుసా?
Infinix GT 10 Pro Pre-order : ఆగస్ట్ 3, 2023న ఇన్ఫినిక్స్ (Infinix GT 10 Pro) సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. ఈ ఫోన్ కీలకమైన ఫీచర్లు, ధర వివరాలను వెల్లడించింది.

Infinix GT 10 Pro Pre-order Starts from August 3 : Offers , Specifications, Price Range Revealed
Infinix GT 10 Pro Pre order : ప్రముఖ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ (Infinix) వచ్చే వారం భారత మార్కెట్లో సరికొత్త సిరీస్ ఫోన్‌లను లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఆగస్ట్ 3న ఇండియాలో Infinix GT 10 Pro సిరీస్‌ని లాంచ్ చేయనుంది. ఈ సిరీస్‌లో Infinix 10 Pro+ ఫోన్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ టీజర్ భారతీయ యూజర్లను చాలా మందిని ఆకర్షించింది.
ఎందుకంటే.. ఫోన్ వెనుక డిజైన్ పరంగా నథింగ్ ఫోన్ మాదిరిగా ఉంటుంది. రాబోయే Infinix GT 10 Pro మోడల్ సైబర్ మెచా డిజైన్‌ను ట్రాన్స్‌పరెన్సీ ఫొటో క్రోమాటిక్ బ్యాక్ ప్యానెల్ డిజైన్‌తో కలిగి ఉంటుంది. నథింగ్ ఫోన్‌ను పోలి ఉండే అడాప్టివ్ LED ఇంటర్‌ఫేస్ కూడా ఉంది. భారత మార్కెట్లో GT 10 ప్రో సిరీస్ లాంచ్‌కు ముందు ఫ్లిప్‌కార్ట్ లాంచ్ ఆఫర్‌లను డివైజ్ కొన్ని స్పెసిఫికేషన్‌లను కూడా వెల్లడించింది.
ఫ్లిప్‌కార్ట్‌లో ఇన్ఫినిక్స్ GT 10 Pro ప్రీ-ఆర్డర్ ఆఫర్లు :
ఇన్ఫినిక్స్ GT 10 Pro ప్రీ-ఆర్డర్ ద్వారా ఆగస్ట్ 3, 2023న భారత మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ లాంచ్ రోజు ప్రీ-ఆర్డర్ చేసిన యూజర్ల కోసం కంపెనీ ఫోన్‌పై కొన్ని అద్భుతమైన ఆఫర్‌లను అందిస్తోంది. ప్రీ-ఆర్డర్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. ఫస్ట్ 5వేల మంది కస్టమర్‌లు ప్రో గేమింగ్ కిట్ (యూనివర్సల్ షోల్డర్ ట్రిగ్గర్స్, గేమింగ్ ఫింగర్ స్లీవ్‌లు, కార్బన్ బాక్స్) పొందుతారు. కస్టమర్‌లు రూ. 2,000 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ లేదా ఎక్స్‌ఛేంజ్‌లో అదనంగా రూ. 2,000 డిస్కౌంట్పొందవచ్చు. అన్ని బ్యాంకుల్లో నో కాస్ట్ EMI, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ యూజర్లకు 6 నెలల వరకు పొందవచ్చు.
ఇన్ఫినిక్స్ GT 10 Pro ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు :
ఫ్లిప్‌కార్ట్‌లో డివైజ్ కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లను ధృవీకరించింది. ఇన్ఫినిక్స్ GT 10 Pro సిరీస్ 8GB LPDDR4X RAM, 8GB వర్చువల్ ర్యామ్‌తో వస్తుంది. ఈ ఫోన్ 256GB UFS 3.1 స్టోరేజీని కలిగి ఉంటుంది. హుడ్ కింద Infinix డివైజ్ డైమెన్సిటీ 8050 ప్రాసెసర్ ద్వారా పవర్ అందిస్తుంది. విజువల్స్ పరంగా ఫోన్ 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌తో పెద్ద 6.67-అంగుళాల 10-బిట్ AMOLED స్క్రీన్‌లో వస్తుంది.

Infinix GT 10 Pro Pre-order Starts from August 3 : Offers , Specifications, Price Range Revealed
ఇతర ఫీచర్లలో Hi-Res ఆడియో, dts ఆడియో, గేమ్ ఇంజిన్ ఉన్నాయి. ఇంకా, ఫోన్ బ్లోట్-ఫ్రీ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్ కలిగి ఉంటుందని కంపెనీ ధృవీకరించింది. డివైజ్ బ్యాక్ సైడ్ సెమీ-పారదర్శక డిజైన్‌ను కలిగి ఉంటుంది. నథింగ్ ఫోన్ 2 మాదిరిగానే మినీ LED కూడా కలిగి ఉంటుంది.
ఇన్పినిక్స్ GT 10 సిరీస్ స్పెసిఫికేషన్‌లు (అంచనా) :
Display : 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, ఫుల్ HD+ రిజల్యూషన్, పంచ్-హోల్ కటౌట్.
Processor : ఆక్టా-కోర్ డైమెన్సిటీ 1300 SoC (Infinix GT 10 Pro), డైమెన్సిటీ 8050 SoC (Infinix GT 10 Pro+)
RAM, Storage : 8GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజీ
వెనుకవైపు కెమెరా : 108MP + 8MP + 8MP
ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా : 32MP
Battery : 5,000mAh
Colours : సైబర్ బ్లాక్, మిరాజ్ సిల్వర్