Infinix Note 40 Pro 5G : భారత్‌కు ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. వచ్చే ఏప్రిల్‌లోనే లాంచ్..!

Infinix Note 40 Pro 5G : వచ్చే ఏప్రిల్‌లో ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ ఫోన్‌కు సంబంధించి ధర, ఫీచర్లు వివరాలను ఫ్లిప్‌కార్ట్ రివీల్ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Infinix Note 40 Pro 5G : భారత్‌కు ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. వచ్చే ఏప్రిల్‌లోనే లాంచ్..!

Infinix Note 40 Pro 5G series to launch in India in April, Flipkart reveals

Infinix Note 40 Pro 5G : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? వచ్చే ఏప్రిల్ నెలలో ఇన్ఫినిక్స్ నుంచి సరికొత్త 5జీ ఫోన్ భారత మార్కెట్లో అరంగేట్రం చేయనుంది. అదే.. ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ సిరీస్.. ఈ ఫోన్‌‌కు సంబంధించిన వివరాలను ఫ్లిప్‌కార్ట్‌లో టీజర్ వెల్లడించింది. ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో ప్లస్ 5జీ, ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ ఫోన్ ఇటీవలి గ్లోబల్ లాంచ్‌ తర్వాత భారత్‌లో రెండూ ఫోన్లు లాంచ్ కానున్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ఎస్ఓసీని కలిగి ఉన్నాయి. అయితే, కంపెనీ ఇంకా కచ్చితమైన లాంచ్ తేదీని వెల్లడించలేదు.

Read Also : Apple iPhone 15 Discount : ఆపిల్ ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ.10,901 తగ్గింపు.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!

ఈ డివైజ్ త్వరలో లాంచ్ కానుంది. ఇన్ఫినిక్స్ నోట్ 40ప్రో ప్లస్ 5జీ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెబ్‌సైట్‌లో కనిపించింది. లాంచ్ ఈవెంట్ అతి దగ్గరలోనే ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ కొత్త ఇన్ఫినిక్స్ ఫోన్ భారత మార్కెట్లో ధర ఎంత ఉంటుందో లీక్‌లు ఇంకా సూచించలేదు. కానీ, గ్లోబల్ లాంచ్ డేటా ప్రకారం.. ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో ప్లస్ 5జీ ధర 309 డాలర్లు (సుమారు రూ. 25వేలు) నుంచి ప్రారంభం కానుంది. అయితే, ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ ఫోన్ 289 డాలర్లు (సుమారు రూ. 24వేల) నుంచి ప్రారంభమవుతుంది.

ఇన్ఫినిక్స్ నోట్ 40 సిరీస్ స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో ప్లస్ 5జీ ఫోన్, ఇన్ఫినిక్స్ నోట్ 40ప్రో 5జీ రెండూ ఫోన్లు 6.78-అంగుళాల ఫుల్-హెచ్‌డీ ప్లస్ కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తాయి. ఈ ప్యానెల్ 120హెచ్‌జెడ్ వద్ద రిఫ్రెష్ అవుతుంది. ఈ డివైజ్‌లను ఆక్టా-కోర్ 6ఎన్ఎమ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ఎస్ఓసీని అందిస్తుంది. సరికొత్త ఆండ్రాయిడ్ 14-ఆధారిత ఎక్స్ఓఎస్ 14 ఓఎస్‌లో రన్ అవుతాయి. ఆప్టిక్స్ వారీగా 2 మోడల్‌లు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 3ఎక్స్ జూమ్ సామర్థ్యాలతో 108ఎంపీ మెయిన్ సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉన్నాయి. ఈ ప్రైమరీ సెన్సార్‌తో పాటు 2ఎంపీ డెప్త్ సెన్సార్, 2ఎంపీ మాక్రో కెమెరా ఉన్నాయి.

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందిస్తోంది. ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ హుడ్ కింద కొంచెం భారీ 5,000ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది. కంపెనీ 45డబ్ల్యూ వైర్డు ఛార్జింగ్, 20డబ్ల్యూ వైర్‌లెస్ మ్యాగ్‌ఛార్జ్‌కి సపోర్టు అందిస్తుంది. ఇన్ఫినిక్స్ నోట్ 40ప్రో ప్లస్ 5జీ ఇన్ఫినిక్స్ చీతా ఎక్స్1 చిప్‌తో ప్రత్యేకంగా నిలుస్తుంది. 4,600ఎంఎహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ డివైజ్ 100డబ్ల్యూ వైర్డు ఛార్జింగ్, 20డబ్ల్యూ వైర్‌లెస్ మ్యాగ్‌ఛార్జ్ టెక్నాలజీకి సపోర్టు ఇస్తుంది.

Read Also : itel Smartwatch Launch : కొత్త వాచ్ కొంటున్నారా? అతిపెద్ద డిస్‌ప్లేతో ఐటెల్ స్మార్ట్‌వాచ్ వచ్చేసింది.. ధర రూ.2వేలు లోపు మాత్రమే!