Instagram Desktop Feature : ఇన్‌స్టాలో డెస్క్‌టాప్ ఫీచర్.. డైరెక్ట్‌గా ఫొటోలు, వీడియోలు అప్‌లోడ్!
ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు గుడ్ న్యూస్.. ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్, తమ సొంత యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఆప్షన్ ప్రవేశపెడుతోంది. ఇకపై ఇన్ స్టాలో ఫోటోలను, వీడియోలను పోస్ట్ చేయాలంటే స్మార్ట్ ఫోన్లు మాత్రమే కాదు..

Instagram Desktop Feature (1)
Instagram Desktop Feature : ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు గుడ్ న్యూస్.. ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్, తమ సొంత యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఆప్షన్ ప్రవేశపెడుతోంది. ఇకపై ఇన్ స్టాలో ఫోటోలను, వీడియోలను పోస్ట్ చేయాలంటే స్మార్ట్ ఫోన్లు మాత్రమే కాదు.. డెస్క్ టాప్ ద్వారా కూడా పోస్టు చేసుకోవచ్చు. ఇప్పటివరకూ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్లనుంచి అప్‌లోడ్ చేసేందుకు వీలుంది.
ఇకపై అలా కాదు.. డెస్క్ టాప్ లో కూడా ఈజీగా అప్ లోడ్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో ఇకపై డెస్క్‌టాప్ బ్రౌజర్ నుంచి నేరుగా ఫోటోలను, వీడియోలను పోస్ట్ చేసుకునేలా ఆప్షన్ తీసుకొస్తోంది ఫేస్ బుక్.. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉందట.. ఈ ఫీచర్‌తో నేరుగా డెస్క్‌టాప్ నుంచి ఫోటోలకు ఫిల్టర్‌లు, ఎడిటింగ్, క్రాప్ ఆప్షన్ ఎంచుకోవచ్చు.
డెస్క్‌టాప్ బ్రౌజర్‌తో డైరెక్టుగా ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసే ఫీచర్ రాబోతుందంటూ కొన్ని రోజుల క్రితమే ఆన్‌లైన్‌లో లీక్ అయింది. అయితే ఈ ఫీచర్ త్వరలోనే ప్రవేశపెట్టనున్నట్టు ఫేస్‌బుక్ క్లారిటీ ఇచ్చింది. కంప్యూటర్ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌ను యాక్సెస్ చేస్తున్నారు.
NEW! @Instagram lets you create + publish posts via desktop! pic.twitter.com/JWzwKg1kyO
— Matt Navarra (@MattNavarra) June 24, 2021
డెస్క్‌టాప్ ఇన్‌స్టాగ్రామ్ ఎక్స్ పీరియన్స్ కోసం.. మొబైల్ యాప్‌లో మాదిరిగా అన్ని ఫీచర్లను డెస్క్‌టాప్ బ్రౌజర్‌తో యాక్సస్ చేసుకునే ఆప్షన్ తీసుకొస్తామని ఫేస్ బుక్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.