iOS 17 for iPhones : ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. iOS 17 అప్‌డేట్ ఇదిగో.. టాప్ ఫీచర్లు, ఏయే డివైజ్‌ల్లో అందుబాటులో ఉందంటే?

iOS 17 for iPhones : iPhone SE (2వ జనరేషన్), iPhone XR అంతకంటే ఎక్కువ వాటిలో అందుబాటులో ఉంటుంది. ఐఫోన్ యూజర్లు సెట్టింగ్స్ ద్వారా iOS 17 లభ్యతను చెక్ చేయవచ్చు.

iOS 17 for iPhones : ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. iOS 17 అప్‌డేట్ ఇదిగో.. టాప్ ఫీచర్లు, ఏయే డివైజ్‌ల్లో అందుబాటులో ఉందంటే?

iOS 17 for iPhones to rollout today_ India timing, eligible devices, top features and more

iOS 17 for iPhones : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) సెప్టెంబర్ 18న ఐఫోన్ కోసం iOS 17ను లాంచ్ చేయడం ప్రారంభించింది. మొబైల్ యూజర్ల కోసం కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ జూన్‌లో (WWDC 2023)లో ఆవిష్కరించింది. గత కొన్ని వారాలుగా బీటా రూపంలో అందుబాటులో ఉంది.

ఇప్పుడు, నెలల టెస్టుల తర్వాత ఆపిల్ చివరకు కాలిఫోర్నియా PDT టైమ్ జోన్‌ను అనుసరించి ప్రపంచవ్యాప్తంగా కొత్త OSని లాంచ్ చేయడానికి రెడీగా ఉంది. కొత్త UI స్టాండ్‌బై మోడ్, నేమ్ డ్రాప్ వంటి లేటెస్ట్ అప్‌డేట్స్ అందిస్తుంది. ప్రత్యేకంగా iPhone XS, కొత్త మోడల్ iOS 17 కోసం అర్హత ఉన్న డివైజ్‌ల లిస్టు, టాప్ ఫీచర్లు, ఆపిల్ ఐఫోన్ల కోసం కొత్త మొబైల్ అప్‌డేట్స్ గురించి నిశితంగా పరిశీలిద్దాం.

భారత్‌లో iOS 17 రోల్ అవుట్ టైమ్ ఇదే :
iOS 17 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ప్రారంభమైంది. ఆపిల్ నిర్దిష్ట సమయాన్ని షేర్ చేయలేదు. భారతీయ కస్టమర్‌లకు ఈ రాత్రి 10 గంటలు లేదా రేపు ఉదయం ప్రారంభంలో అందుబాటులోకి వస్తుందని ఆశించవచ్చు. అమెరికాలోని కాలిఫోర్నియాలోని PDT టైమ్ జోన్‌లో రిలీజ్ అవుతుందని అంచనా.

Read Also :  Tecno Phantom V Flip 5G : టెక్నో ఫాంటమ్ V ఫ్లిప్ 5G మడతబెట్టే ఫోన్ వచ్చేస్తోంది.. దిమ్మతిరిగే ఫీచర్లు, డిజైన్ ఇదిగో..!

iOS 17 సపోర్టు ఉన్న ఐఫోన్లు :
కొత్త iOS 17 A12 బయోనిక్ చిప్ లేదా కొత్త వెర్షన్‌తో కూడిన ఐఫోన్లకు సపోర్టు ఇస్తుంది. 2017లో విడుదలైన iPhone X, iPhone 8, iPhone 8 Plusలకు ఈ ఏడాది అప్‌డేట్‌కు అర్హత ఉండదు. అందువల్ల Apple iPhone SE (2వ జనరేషన్ లేదా ఆపై), iPhone XRపై డివైజ్‌లకు కొత్త iOS 17ను రిలీజ్ చేస్తుంది.

మీ ఐఫోన్‌లో iOS 17 లభ్యతను ఎలా చెక్ చేయాలి :
ఐఫోన్లలో కొత్త iOS అప్‌డేట్ అందుబాటులో ఉన్నప్పుడు ఆపిల్ సాధారణంగా యూజర్లకు అందుబాటులో ఉంది. అయితే, మీరు Settings > General> Software Update వెళ్లడం ద్వారా మాన్యువల్‌గా కూడా అప్‌డేట్స్ కోసం చెక్ చేయవచ్చు.

iOS 17 for iPhones to rollout today_ India timing, eligible devices, top features and more

iOS 17 for iPhones to rollout today_ India timing, eligible devices, top features and more

iOS 17 టాప్ కొత్త ఫీచర్లు :
iOS 17లో స్టాండ్‌బై మోడ్ : స్టాండ్‌బై అనేది కొత్త ఫుల్-స్క్రీన్ వ్యూ, గడియారం, క్యాలెండర్, ఫొటోలు, వాతావరణం, మ్యూజిక్ ప్లేబ్యాక్ కంట్రోల్స్, విడ్జెట్‌లతో సహా ఛార్జింగ్ ఐఫోన్‌లో డేటాను చూపిస్తుంది.

iOS 17లో కాంటాక్టు పోస్టర్‌లు : iOS 17 ఫోన్ యాప్‌కి కస్టమైజడ్ చేసిన కాంటాక్ట్ పోస్టర్‌లను అందిస్తుంది. యూజర్లకు కాల్ చేసినప్పుడు వారి కాంటాక్టులను చూసే వాటిని ఎంచుకోవచ్చు. లైవ్ వాయిస్‌మెయిల్, గుర్తుతెలియని కాలర్లను సైలంట్ చేసే కూడా ఆప్షన్ చూడవచ్చు.

నేమ్‌డ్రాప్ : నేమ్‌డ్రాప్ రెండు ఐఫోన్లను దగ్గరగా తీసుకురావడం ద్వారా కాంటాక్టు డేటాను మరొకరితో షేర్ చేసుకునేందుకు వినియోగదారులను అనుమతిస్తుంది.

కొత్త విడ్జెట్‌లు : iOS 17 యూజర్లు తమ లాక్ స్క్రీన్, హోమ్ స్క్రీన్‌తో ఇంటరాక్ట్ చేయగల విడ్జెట్‌లను యాడ్ చేసేందుకు అనుమతిస్తుంది. ఈ విడ్జెట్‌లు ఆపిల్, థర్డ్-పార్టీ యాప్‌లతో పని చేస్తాయి.

FaceTime యాప్‌కి అప్‌డేట్స్
: iOS 17 (FaceTime)కి ఆడియో/వీడియో మెసేజ్, 3D వీడియో ఎఫెక్ట్‌లు, Apple TVలో FaceTime కాల్‌లను ప్రారంభించే సామర్థ్యం వంటి కొత్త ఫీచర్‌లను అందిస్తుంది.

Read Also : Honor 90 5G Sale : హానర్ 90 5G ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. ధర, స్పెషిఫికేషన్లు, లాంచ్ ఆఫర్లు ఇవే..!