Apple iPhone 13 Sale : ఆపిల్ ఐఫోన్ 13పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. ఈ పాత మోడల్ కొనాలా వద్దా?
iPhone 13 Sale Offers : ఆపిల్ ఐఫోన్ 13 మోడల్ లేటెస్ట్ ఐఫోన్లతో పోల్చితే.. మెరుగైన కెమెరా, స్పీడ్ ప్రాసెసింగ్ వంటి కొత్త మోడళ్లలో అందుబాటులో ఉన్న కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్లను కలిగి ఉంది.

iPhone 13 available for Rs 42k during Amazon Sale
iPhone 13 Sale Offers : పండుగ సీజన్ సేల్ కొనసాగుతోంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల్లో అనేక స్మార్ట్ఫోన్లపై భారీ డీల్స్ అందిస్తున్నాయి. ఆపిల్ 2021లో లాంచ్ చేసిన ఐఫోన్ 13తో సహా అనేక టెక్ గాడ్జెట్లపై అద్భుతమైన డిస్కౌంట్లను కూడా పొందవచ్చు.
అమెజాన్ సేల్ సమయంలో 128జీబీ స్టోరేజీతో ఐఫోన్ 13 అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్లు, తగ్గింపుతో రూ. 41,749కు పొందవచ్చు. అయితే, 2022 లాంచ్‌తో సహా కొత్త జెన్ ఐఫోన్లను లాంచ్ చేసిన తర్వాత ఆపిల్ ఇప్పటికే ఐఫోన్ 13 ధరలను తగ్గించింది. ఐఫోన్ 14, ఐఫోన్ 15, లేటెస్ట్ ఐఫోన్ 16 సిరీస్‌లను లాంచ్ చేసింది. ఈ ఐఫోన్ మోడల్‌ను కొనుగోలు చేయాలా? వద్దా? లేదా కొత్త ఐఫోన్ మోడల్స్ కొనుగోలు చేస్తే మంచిదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఐఫోన్ 13 కొత్త ఓఎస్, సెక్యూరిటీ అప్గ్రేడ్లతో మరో ఏడాది లేదా 2 ఏళ్ల పాటు అప్డేట్స్ అందుకుంటుంది. ఐఫోన్ 13 ఎ15 బయోనిక్ చిప్‌తో వస్తుంది. బ్రౌజింగ్, గేమింగ్, మీడియా వినియోగానికి బాగుంటుంది. ఈ ఐఫోన్ 12ఎంపీ వెడల్పు, అల్ట్రా-వైడ్ లెన్స్, 4కె డాల్బీ విజన్ హెచ్డీఆర్ రికార్డింగ్, నైట్ మోడ్, మెరుగైన ఫోటోగ్రఫీకి స్మార్ట్ హెచ్డీఆర్ 4తో డ్యూయల్-కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది.
వీడియోల విషయానికి వస్తే.. ఐఫోన్ 13 సినిమాటిక్ మోడ్ మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. ఫోకస్‌ని ఆటోమేటిక్‌గా మార్చేందుకు అనుమతిస్తుంది. 12ఎంపీ ఫ్రంట్ కెమెరా నైట్ మోడ్, 4కె డాల్బీ విజన్ హెచ్డీఆర్ రికార్డింగ్, సెల్ఫీలు, వీడియో కాల్స్ చేసేందుకు సపోర్ట్ చేస్తుంది.
ఐఫోన్ 13 మోడల్ లేటెస్ట్ ఐఫోన్లతో పోల్చితే.. మెరుగైన కెమెరా, స్పీడ్ ప్రాసెసింగ్ వంటి కొత్త మోడళ్లలో అందుబాటులో ఉన్న కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఐఫోన్ 13 కొంచెం పాతది అయినప్పటికీ ఆపిల్ ఇంటెలిజెన్స్‌తో ఎ18 చిప్, ఏఐ ఫీచర్లు ప్రస్తుతం ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 16 సిరీస్‌లకు ప్రత్యేకమైనవిగా చెప్పవచ్చు. ప్రాసెసింగ్ స్పీడ్ కూడా చాలా వేగంగా ఉండటం గమనించవచ్చు.
ప్రత్యేకించి లేటెస్ట్ సపోర్టు చేసే కొత్త యాప్స్, ఫీచర్లను పొందాలంటే ఐఫోన్ 13 సరైనదిగా కాదు. ఐఫోన్ 13 కూడా లేటెస్ట్ జనరేషన్ ఐఫోన్ల కన్నా ముందుగా కొత్త అప్డేట్లను అందుకోదని గమనించాలి. బ్యాటరీ లైఫ్ కూడా పరిశీలిస్తే.. ఐఫోన్ 13 బ్యాటరీ లైఫ్ పర్వాలేదనిపించినా.. కొత్త ఐఫోన్ మోడల్‌లు ఛార్జింగ్ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. ఐఫోన్ యూజర్లు ఎక్కువ కాలం బ్యాటరీ లైఫ్ కొరుకుంటే.. మీరు కొత్త ఐఫోన్ మోడల్ కొనడమే బెటర్.
త్వరలో ఐఫోన్ ఎస్ఈ 4 లాంచ్ :
ఆపిల్ సరసమైన ఐఫోన్ ఎస్ఈ మోడల్ త్వరలో లాంచ్ చేయనుంది. మీరు ఐఫోన్‌ను కొనుగోలు చేయాలని చూస్తుంటే.. కొత్త జనరేషన్ ఐఫోన్ ఎస్ఈ 4 మీ బడ్జెట్లో ఉన్నట్లు అనిపిస్తే.. ఐఫోన్ ఎస్ఈ 4 కోసం వేచి ఉండవచ్చు. 2025 ప్రారంభంలో ఈ ఐఫోన్ ఎస్ఈ 4 లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఐఫోన్ ఎస్ఈ 4 మోడల్ ఎ18 సిరీస్ చిప్, ఆపిల్ ఇంటెలిజెన్స్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంటుంది.
ఐపోన్ 15, ఐఫోన్ 16లలో కనిపించే ఇతర అడ్వాన్స్డ్ ఫీచర్లు కూడా ఉంటాయి. ఐఫోన్ ఎస్ఈ సిరీస్ ఆపిల్ బడ్జెట్-ఫ్రెండ్లీ లైన్ పాత డిజైన్ కలిగి ఉంది. తక్కువ ధర వద్ద ఫ్లాగ్షిప్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఐఫోన్ ఎస్ఈ 4 ధర సుమారు రూ. 43వేల నుంచి రూ. 45వేల వరకు ఉండవచ్చు. ఐఫోన్ 13 కన్నా మరిన్ని అప్‌గ్రేడ్స్‌తో వస్తుంది. ఐఫోన్ ఎస్ఈ 4 పర్ఫార్మెన్స్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ పరంగా లాంగ్ లైఫ్ సపోర్టును అందిస్తుంది.