iPhone 13 Users : ఐఫోన్ 13 యూజర్లకు ఆపిల్ మాజీ ఉద్యోగి వార్నింగ్.. iOS 17 అప్‌డేట్ అసలు డౌన్‌లోడ్ చేసుకోవద్దు..!

iPhone 13 Users : ఆపిల్ ఐఫోన్ 13 యూజర్లకు హెచ్చరిక.. ఐఫోన్ 13 డివైజ్‌ల్లో (iOS 17 Update) అప్‌డేట్ చేయొద్దని మాజీ ఆపిల్ ఉద్యోగి హెచ్చరించాడు.

iPhone 13 Users : ఐఫోన్ 13 యూజర్లకు ఆపిల్ మాజీ ఉద్యోగి వార్నింగ్.. iOS 17 అప్‌డేట్ అసలు డౌన్‌లోడ్ చేసుకోవద్దు..!

iPhone 13 Users should not download iOS 17, warns former Apple employee

iPhone 13 Users : మీరు ఐఫోన్ 13 వాడుతున్నారా? అయితే, మీకు ఐఓఎస్ 13 అప్‌డేట్ డౌన్‌లోడ్ అందుబాటులో ఉందా? అయితే, ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ (iOS 17 Update) అప్‌డేట్ డౌన్‌లోడ్ చేసుకోవద్దు.. ఎందుకంటే.. మీ iOS 17కి అప్‌డేట్ చేసిన తర్వాత తలెత్తే సమస్యల గురించి పాత ఐఫోన్ యూజర్లను ఆపిల్ మాజీ ఉద్యోగి హెచ్చరించాడు.

ఇటీవల వైరల్ అయిన (TikTok) వీడియోలో ఆపిల్ మాజీ సేల్స్ స్పెషలిస్ట్, టైలర్ మోర్గాన్, ఐఫోన్ 13, పాత మోడల్ వినియోగదారులకు వార్నింగ్ మెసేజ్ జారీ చేశారు. ఈ ఐఫోన్ డివైజ్‌లను లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ iOS 17కి అప్‌డేట్ చేయరాదని అతను సూచించాడు.

TikTokలో @hitomidocameraroll హ్యాండిల్‌ను ఫాలో అయ్యే మోర్గాన్, iOS 17 అప్‌డేట్ పాత ఐఫోన్ మోడల్‌లలో అనేక సాంకేతిక సమస్యలకు దారితీసిందని పేర్కొన్నారు. యాప్ క్రాష్‌లు, టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ వంటి మీడియా యాప్‌లలో లాగ్‌లు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లు అతను నివేదించాడు. Wi-Fi సమస్యలతో సహా కనెక్టివిటీ సమస్యలు కూడా ఉన్నాయని తెలిపాడు. మోర్గాన్ ప్రకారం.. ఈ సమస్యలు ఆపిల్ కొత్త ఐఓఎస్ అప్‌డేట్ కారణంగా జరిగిందని అనిపిస్తుంది.

Read Also : iPhone 13 Discount : అమెజాన్ దీపావళి సేల్.. ఐఫోన్ 13పై భారీ తగ్గింపు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి..!

ఐఫోన్ 14 పర్వాలేదు.. పాత ఐఫోన్లలో బగ్ సమస్యలు :

iOS 17 నేమ్‌డ్రాప్, స్టాండ్‌బై మోడ్ వంటి కొత్త ఫీచర్‌లతో వస్తుందని, పాత ఐఫోన్‌లను గణనీయంగా నెమ్మదిస్తుందని మాజీ ఆపిల్ ఉద్యోగి వివరించారు. iOS 17 ప్రధానంగా (iPhone 15) కోసం రూపొందించినట్టు ఆయన అభిప్రాయపడ్డారు. ఐఫోన్ 14లో ఈ కొత్త ఐఓఎస్ అప్‌డేట్ పని చేస్తున్నప్పటికీ, ఐఫోన్ 13, పాత మోడల్‌ల వినియోగదారులు పనితీరు సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పారు.

వినియోగదారులు తమ డివైజ్‌లను క్రమం తప్పకుండా అప్‌డేట్ చేసుకోవాలని ఆపిల్ ప్రోత్సహిస్తున్నప్పటికీ, పాత ఐఫోన్‌లకు iOS 17 అప్‌డేట్ కచ్చితంగా అవసరం లేదని మోర్గాన్ చెప్పారు. కొత్త మోడల్‌ల కోసం అప్‌టిమైజ్ చేసే ఈ పద్ధతి ఐఫోన్ 4 నుంచి కొనసాగుతోందని ఆయన సూచిస్తున్నారు.

iPhone 13 Users should not download iOS 17, warns former Apple employee

iPhone 13 Users should not download iOS 17

రోజుకు 4 సార్లు ఛార్జ్ చేయొచ్చు :
న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. ఆపిల్ నుంచి ఎలాంటి స్పందన లేదు. iOS 17 పాత ఐఫోన్‌లకు పూర్తిగా సపోర్టు చేయడం లేదని మోర్గాన్ స్పష్టం చేశారు. బ్యాటరీ లైఫ్‌పై ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. పాత ఐఫోన్ యూజర్లు తమ డివైజ్‌లను రోజుకు 3 నుంచి 4 సార్లు ఛార్జ్ చేయవచ్చని పేర్కొన్నారు.

ఐఫోన్ 13 యూజర్లు తమ డివైజ్ అప్‌డేట్ చేసే ముందు మొత్తం ఫోన్ ఎక్స్‌పీరియన్స్పరిగణలోకి తీసుకోవాలని టైలర్ మోర్గాన్ సలహా ఇస్తున్నారు. ప్రస్తుత ఐఓఎస్ వెర్షన్‌తో సంతృప్తి చెందితే.. అదే ఉంచుకోవాలని సూచించారు. కొత్త iOS అప్‌డేట్‌లు పాత మోడల్‌లో పనిచేయవని ఆయన అభిప్రాయపడ్డారు. కొంతమంది టిక్‌టాక్ యూజర్లు పాత మోడళ్లలో iOS 17ను వినియోగంపై ఎలాంటి సమస్యలు లేవని నివేదించారు.

Read Also : Apple iPhone 13 Sale : కొత్త ఐఫోన్ కావాలా? ఆపిల్ ఐఫోన్ 13పై భారీ తగ్గింపు.. రూ.40వేల లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు!