Apple iPhone 14 Deals : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, విజయ్ సేల్స్‌లో ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డీల్స్.. ఇందులో ఏది బెటర్ డీల్ అంటే?
iPhone 14 Deals : కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, విజయ్ సేల్స్ ఐఫోన్లపై అదిరే డీల్స్ అందిస్తోంది.

iPhone 14 deals on Amazon vs Flipkart vs Vijay Sales compared, know where to buy it from
Apple iPhone 14 Deals : మీరు ఆపిల్ ఐఫోన్ 14 కొనేందుకు ప్లాన్ చేస్తుంటే.. ఇదే సరైన సమయం. ఈ సిరీస్‌లో అత్యంత చౌకైన ఫోన్ ఐఫోన్ 14, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు విజయ్ సేల్స్‌లో భారీ తగ్గింపు ధరకు విక్రయిస్తోంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు ఆపిల్ ఐఫోన్ 14పై డీల్‌లు, డిస్కౌంట్‌లను అందిస్తున్నాయి. ఆపిల్ ఐపోన్ 14లో ఎవరు మెరుగైన డీల్‌ను అందిస్తున్నారో ఇప్పుడు చూద్దాం..
అమెజాన్ (Amazon) :
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో (Amazon) ఆపిల్ ఐఫోన్ 14, 128GB వేరియంట్‌కు అసలు ధర రూ.79,900, అమెజాన్‌లో రూ.66,900కి విక్రయిస్తోంది. అంతేకాదు.. ICICI బ్యాంక్ కార్డ్ హోల్డర్లు డివైజ్‌పై 10 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. ఈ డీల్‌ను మరింత తగ్గించాచలంటే.. మీ పాత ఫోన్‌ని ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. రూ. 19,950 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ (Flipkart) :
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో 128GB వేరియంట్ డివైజ్ ధర రూ.67,999గా ఉంటుంది. అయితే, మీరు SBI క్రెడిట్ కార్డ్ కలిగి ఉంటే.. ఈ డివైజ్‌పై రూ.1250 తగ్గింపు పొందవచ్చు. ధరను మరింత తగ్గించాలంటే.. పాత ఫోన్‌ని ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. ఆపిల్ ఐఫోన్ 14పై రూ. 29వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. మీ పాత ఫోన్ కండిషన్, తయారైన సంవత్సరంపై ఆధారపడి ఉంటుంది.
విజయ్ సేల్స్ (Vijay Sales) :
విజయ్ సేల్స్‌లో ఆపిల్ ఐఫోన్ 14 మోడల్ అసలు ధర రూ. 79,900గా ఉంది. ఇప్పుడు ఈ డీల్ ధర రూ. 70,990 నుంచి అందుబాటులో ఉంది. అదనంగా, (HDFC) బ్యాంక్ కార్డ్ హోల్డర్‌లు రూ. 4,000 క్యాష్‌బ్యాక్‌ని పొందవచ్చు. మీ ప్రస్తుత స్మార్ట్‌ఫోన్‌లో కనీస ఎక్స్ఛేంజ్ వాల్యూ రూ.5వేలతో ట్రేడ్ చేయొచ్చు. అప్పుడు అదనంగా రూ.3వేలు తగ్గింపు పొందవచ్చు. విజయ్ సేల్స్ మొత్తంగా, రూ. 20,910 వరకు తగ్గింపులను పొందవచ్చు. ఐఫోన్ 14 తుది ధర రూ.58,990లకు సొంతం చేసుకోవచ్చు.

Apple iPhone 14 Deals on Amazon vs Flipkart vs Vijay Sales compared, know where to buy it from
ఐఫోన్ 14 స్పెసిఫికేషన్‌లు :
ఆపిల్ iPhone 14 మోడల్ 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED ప్యానెల్‌ను సన్నని బెజెల్స్‌తో, విస్తృత కలర్ ఆప్షన్లతో వచ్చింది. ఈ ఫోన్ డిస్ప్లే HDRకి సపోర్టు ఇస్తుంది. 1200-నిట్స్ బ్రైట్‌నెస్, ఫేస్ ID సెన్సార్‌లతో వస్తుంది. 60Hz ప్రామాణిక రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఆపిల్ ఐఫోన్ 14ను A15 బయోనిక్ చిప్, 16-కోర్ NPU, 5-కోర్ గ్రాఫిక్స్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ గరిష్టంగా 4GB RAM, మూడు స్టోరేజీ ఆప్షన్లతో వచ్చింది.
ఆపిల్ ఐఫోన్ 14 లేటెస్ట్ స్టేబుల్ iOS 16 వెర్షన్‌తో రన్ అవుతుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ 5G, Wi-Fi, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, GPS ఛార్జింగ్ లైట్నింగ్ పోర్ట్‌కు సపోర్టుతో వస్తుంది. కెమెరా విషయానికొస్తే.. ఐఫోన్ 14 డ్యూయల్ రియర్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో పెద్ద f/1.5 ఎపర్చరు, సెన్సార్-షిఫ్ట్ OIS, సెకండరీ 12MP అల్ట్రా-వైడ్ యాంగిల్ షూటర్‌తో కూడిన ప్రైమరీ 12MP వైడ్ యాంగిల్ సెన్సార్ ఉన్నాయి. వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే.. డాల్బీ విజన్‌కు సపోర్టు అందిస్తుంది.