Apple iPhone 16 Leak : ఆపిల్ ఐఫోన్ 16 ఫీచర్లు లీక్.. కొత్త డిస్‌ప్లే, చిప్‌సెట్, కెమెరా వివరాలివే..!

Apple iPhone 16 Leak : ఆపిల్ ఐఫోన్ 16 లాంచ్ ఇప్పట్లో లేనేలేదు. దాదాపు ఏడాది సమయం ఉంది. రాబోయే జనరేషన్ ఐఫోన్‌ల గురించి అనేక లీక్‌లు గత కొంతకాలంగా బయటకు వస్తున్నాయి. ఐఫోన్ 16 ఫీచర్ల వివరాలు కూడా లీకయ్యాయి.

Apple iPhone 16 Leak : ఆపిల్ ఐఫోన్ 16 ఫీచర్లు లీక్.. కొత్త డిస్‌ప్లే, చిప్‌సెట్, కెమెరా వివరాలివే..!

iPhone 16 leaks so far _ New display, chipset, camera and other changes

Apple iPhone 16 Leak : ఆపిల్ నుంచి సరికొత్త మోడల్ ఐఫోన్ 16 రాబోతోంది. ఈ ఐఫోన్ 16 సిరీస్ లాంచ్‌కు ఏడాది సమయం ఉంది. అయితే, నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్‌ల గురించి లీక్‌లు బయటకు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు, ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్‌కు సంబంధించి కీలక ఫీచర్లు లీకయినట్టు తెలుస్తోంది. ఐఫోన్ 16 ఫీచర్లలో పెద్ద డిస్‌ప్లేలు, మెరుగైన డిజైన్, మెరుగైన కెమెరా, కొత్త చిప్‌సెట్ వంటి మరిన్నింటితో రానుందని నివేదికలు సూచిస్తున్నాయి.

2024 ఐఫోన్‌లకు సంబంధించి ఇప్పటివరకు లీక్‌లు సూచించిన అన్ని ఫీచర్ల వివరాలు అందుబాటులో ఉన్నాయి. అందులో ఐఫోన్ 16 సిరీస్ ఫీచర్లలో ఇప్పటివరకు కొత్త డిస్‌ప్లే, చిప్‌సెట్, కెమెరా వంటి ఫీచర్లను సూచిస్తున్నాయి. అవేంటో ఓసారి పరిశీలిద్దాం.

Read Also : Apple iPhone 16 : అద్భుతమైన ఫీచర్లతో ఆపిల్ ఐఫోన్ 16 వచ్చేస్తోంది.. కొత్త లీక్ డేటా ఇదిగో..!

డిస్‌ప్లే :
ఐఫోన్ 16 ప్రో 6.3-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుందని అంచనా. ఖరీదైన కౌంటర్ ఐఫోన్ 16 ప్రో మాక్స్ 6.9-అంగుళాల స్క్రీన్‌తో రానుంది. అయినప్పటికీ, ప్రామాణిక ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్‌లలో పరిమాణం పెరగనుంది. వినియోగదారులు ఈ మోడల్‌లు వాటి గత వెర్షన్ల మాదిరిగా అదే స్క్రీన్ కొలతలతో రావచ్చు. వరుసగా 6.1-అంగుళాలు, 6.7-అంగుళాల స్క్రీన్‌లు ఉండవచ్చు.

రాబోయే ఐఫోన్‌లు శాంసంగ్ అందించే ఓఎల్ఈడీ మెటీరియల్‌కి మారవచ్చని పుకార్లు సూచిస్తున్నాయి. బ్లూ ఫాస్ఫోరోసెన్స్‌తో బ్లూ ఫ్లోరోసెంట్ టెక్నాలజీని కలిగి ఉండవచ్చు. మైక్రో ఎల్ఈడీ డిస్‌ప్లే టెక్నాలజీని అందిస్తుందని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పవర్ ఆదా చేసే సమయంలో మెరుగైన ప్రకాశం, ఆకర్షణీయమైన రంగులను కలిగి ఉండవచ్చు.

డిజైన్ :
లీక్‌ల ప్రకారం.. వచ్చే ఏడాది ఐఫోన్ మోడల్‌లలో సాలిడ్-స్టేట్ బటన్‌లను చూడవచ్చు. ఆపిల ఐఫోన్ 16 ప్రో మోడల్‌లలో ‘క్యాప్చర్ బటన్’గా సూచించవచ్చు. సాంప్రదాయ మెకానికల్ కన్నా కెపాసిటివ్ బటన్‌లుగా ఉండవచ్చు. ఒత్తిడి, స్పర్శను గుర్తించేలా ఉంటాయి. ఐఫోన్ ఎస్ఈ సిరీస్ హోమ్ బటన్‌ను పోలి ఉండే ఇంటర్నల్ హాప్టిక్ ఇంజిన్‌ల ద్వారా అందిస్తాయి.

iPhone 16 leaks so far _ New display, chipset, camera and other changes

iPhone 16 leaks so far 

చిప్‌సెట్ :
ప్రామాణిక ఐఫోన్ 16లోని చిప్‌సెట్‌కు సంబంధించిన వివరాలు అస్పష్టంగానే ఉన్నాయి. ఐఫోన్ 15 ప్రో మోడల్‌ల నుంచి ఎ17 ప్రో చిప్‌తో రావచ్చునని నివేదికలు చెబుతున్నాయి. అయితే, 2024 స్టాండర్డ్ ఐఫోన్‌ల కోసం 3-నానోమీటర్ ఎ18 చిప్‌ను అందించాలని ఆపిల్ నిర్ణయించవచ్చని పుకార్లు కూడా సూచిస్తున్నాయి. ఐఫోన్ 16 ప్రో మోడల్స్ అదే చిప్‌తో మరింత శక్తివంతమైన వెర్షన్‌ను పొందవచ్చు. రాబోయే సంవత్సరంలో ఐఫోన్ 16 చిప్‌సెట్‌పై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

కెమెరా :
ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్‌లు ‘టెట్రా-ప్రిజం’ టెలిఫోటో కెమెరాను కలిగి ఉన్నాయని పుకారు ఉంది. అద్భుతమైన ఫొటోల కోసం ఆప్టికల్ జూమ్ 3ఎక్స్ నుంచి 5ఎక్స్ వరకు పెరిగే అవకాశం ఉంది. సాంకేతిక విశ్లేషకుడు జెఫ్ పు నివేదిక ప్రకారం.. ఐఫోన్ 16 ప్రో సిరీస్ 48ఎంపీ అల్ట్రావైడ్ కెమెరాను సూచిస్తున్నాయి. తక్కువ-కాంతిలోనూ అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందించగలదు. లైట్ క్యాప్చర్‌ను మెరుగుపరచడమే కాకుండా డైనమిక్ పరిధిని విస్తరించడం, నైట్ మోడ్ సామర్థ్యాలను పెంచేందుకు ఐఫోన్ ప్రో మోడల్‌ మాదిరిగా డిజైన్‌ను అందించనుంది.

Read Also : Apple iPhone 14 : ఆపిల్ ఐఫోన్ 14పై అదిరే ఆఫర్.. కేవలం రూ.27,499కే సొంతం చేసుకోవచ్చు!