iPhone 16 Pro Launch : ఆపిల్ ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 16ప్రో వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

iPhone 16 Pro Launch : ఆపిల్ ఐఓఎస్ 18తో ఐఫోన్ 16 సిరీస్‌ రానుందని, ప్రో మోడల్‌లు ఏఐ ఫీచర్ల సూట్ ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌ను కూడా పొందవచ్చని భావిస్తున్నారు.

iPhone 16 Pro Launch : ఆపిల్ ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 16ప్రో వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

iPhone 16 Pro launch just weeks away ( Image Source : Google )

iPhone 16 Pro Launch : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ వార్షిక డెవలపర్ల కాన్ఫరెన్స్ (WWDC 2024) ఇటీవలే ముగిసింది. అతి త్వరలో ఆపిల్ నుంచి ఐఫోన్ 16 సిరీస్‌ రాబోతోంది. 2024 ఏడాదిలో జూలై తర్వాత వస్తుందని అంచనా. నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్‌లు గత వెర్షన్ల కన్నా ముఖ్యంగా ప్రో వేరియంట్‌ల కన్నా ముఖ్యమైన అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంటాయని పుకారు ఉంది.

ఆపిల్ ఐఓఎస్ 18తో ఐఫోన్ 16 సిరీస్‌ రానుందని, ప్రో మోడల్‌లు ఏఐ ఫీచర్ల సూట్ ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌ను కూడా పొందవచ్చని భావిస్తున్నారు. ఐఓఎస్18, ఏఐ కాకుండా, ఆపిల్ ఫ్లాగ్‌షిప్ లైనప్ డిజైన్ కూడా తీసుకురానుంది. ఎప్పటిలాగే, ఆపిల్ నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్ గురించి అనే పుకార్లు వినిపిస్తున్నాయి.

ఐఫోన్ 16 ప్రో లాంచ్ తేదీ, ధర వివరాలివే :
ఆపిల్ హిస్టారికల్ లాంచ్ ప్యాట్రన్‌ల ఆధారంగా ఐఫోన్ 16ప్రో వచ్చే సెప్టెంబరు ప్రారంభంలో 3 నుంచి 11 సెప్టెంబర్ మధ్య అమ్మకాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఐఫోన్ 16 ప్రో ధర అమెరికాలో సుమారు 999 డాలర్ల నుంచి ప్రారంభమవుతుందని అంచనా. ముఖ్యంగా, భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్‌ను రూ. 1,34,900 ప్రారంభ ధరతో లాంచ్ చేసింది.

ఐఫోన్ 16ప్రో డిజైన్ :
ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మోడల్ ముందు వెర్షన్ 6.1-అంగుళాల స్క్రీన్ నుంచి కొంచెం పెద్ద 6.3-అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉండవచ్చు. ఈ డిస్‌ప్లే మునుపటి 19.5:9తో పోలిస్తే.. 19.6:9 యాస్పెక్ట్ రేషియోతో పొడవుగా ఉంటుందని భావిస్తున్నారు. ఆపిల్ ఈ మోడల్ కోసం కొత్త మైక్రో-లెన్స్ అర్రే (MLA) ఓఎల్ఈడీ టెక్నాలజీని కూడా ఉపయోగిస్తోంది. ఫలితంగా స్క్రీన్ 20 శాతం ప్రకాశవంతంగా ఉంటుంది.

డిజైన్ పరంగా, ఐఫోన్ 16 ప్రో ఐఫోన్ 15 ప్రో మాదిరిగా టైటానియం ఫ్రేమ్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. అయితే, చిన్న 1.2 మిమీ బెజెల్స్‌ కలిగి ఉంటుంది. ఫేస్ ఐడీ భాగాలు డిస్‌ప్లే కింద హైడ్ చేసి ఉండవచ్చు. అదనంగా, ఐఫోన్ 15 ప్రో సెట్ చేసిన ట్రెండ్‌ను కొనసాగిస్తూ.. ఐఫోన్ 16 ప్రో టైటానియం ఫ్రేమ్, యూఎస్‌బీ-సి పోర్ట్‌ను కూడా ఉంచనుంది. అయితే, వాల్యూమ్, పవర్, కెమెరా ఫంక్షన్‌లకు కొత్త “క్యాప్చర్” బటన్ కెపాసిటివ్ బటన్‌లను కలిగి ఉండనుంది. ప్రత్యేకమైన యూజర్ ఇంటర్‌ఫేస్‌ను అందిస్తాయి.

ఐఫోన్16 ప్రో కెమెరా అప్‌గ్రేడ్‌లు (అంచనా) :
కెమెరా అప్‌గ్రేడ్‌లు ఎల్లప్పుడూ కొత్త ఐఫోన్‌లకు కేంద్ర బిందువుగా ఉంటాయి. ఐఫోన్ 16ప్రో మినహాయింపు కాదు. ప్రైమరీ కెమెరా 48ఎంపీ సెన్సార్‌గా ఉంటుందని అంచనా. అయితే, అల్ట్రా-వైడ్ కెమెరా 12ఎంపీ నుంచి 48ఎంపీ అప్‌గ్రేడ్ చూడవచ్చు. 5ఎక్స్ ఆప్టికల్ జూమ్‌ను అందించే కొత్త పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను అందించనున్నట్టు ఆపిల్ యోచిస్తున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈ ఫీచర్ ప్రస్తుతం ఐఫోన్ 15ప్రో మ్యాక్స్ మాత్రమే అందుబాటులో ఉంది.

ఐఫోన్ 16 ప్రో పర్ఫార్మెన్స్ :
హుడ్ కింద ఐఫోన్ 16ప్రో కొత్త A18 ప్రో చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుందని భావిస్తున్నారు. 3-నానోమీటర్ ప్రక్రియపై మెరుగైన పర్ఫార్మెన్స్, సామర్థ్యాన్ని అందిస్తుంది. 8జీబీ ర్యామ్ ఈ చిప్‌సెట్ లేటెస్ట్ ఐఓఎస్ 18 ఫీచర్‌లకు సపోర్టు ఇస్తుంది. ఈ స్మార్ట్ ఫోటో ఎడిటింగ్, అడ్వాన్స్ సిరి ఫంక్షనాలిటీలకు అప్‌గ్రేడ్ ఏఐ సామర్థ్యాలతో రానుంది. స్టోరేజీ ఆప్షన్లలో అప్‌గ్రేడ్‌ను కూడా చూడవచ్చు. గరిష్ట సామర్థ్యం 2టీబీకి చేరుకునే అవకాశం ఉంది.

ప్రస్తుత లిమిట్ కూడా రెట్టింపు చేయవచ్చు. ఈ విస్తరణతో కొత్త, కాంపాక్ట్ తక్కువ ఖర్చుతో కూడుకున్న స్టోరేజీ టెక్నాలజీని అందించనుంది. ఈ ఐఫోన్ లేటెస్ట్ వై-ఫై7కి సపోర్టు ఇస్తుందని, వేగవంతమైన కనెక్టివిటీకి కొత్త 5జీ మోడెమ్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. హీటింగ్ కోసం గ్రాఫేన్-ఆధారిత టెక్నాలజీని ఉపయోగించి కొత్త థర్మల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను చేర్చాలని నివేదికలు సూచిస్తున్నాయి.

ఐఫోన్ 16 రంగు వేరియంట్‌లు (అంచనా) :
ఐఫోన్ 16 ప్రో గత టైటానియం బ్లూ ఆప్షన్ స్థానంలో స్పేస్ బ్లాక్, వైట్, గ్రే అనే కొత్త రోజ్ కలర్‌లో అందుబాటులో ఉంటుందని పుకారు ఉంది. ఆపిల్ టైటానియం బాడీకి మరో కలర్ వేరియంట్ ప్రవేశపెట్టవచ్చు.

Read Also : Apple Back to School Sale 2024 : భారత్‌లో ఆపిల్ బ్యాక్ టు స్కూల్ సేల్.. ఐప్యాడ్, మ్యాక్‌బుక్, ఎయిర్‌పాడ్స్, ఆపిల్ పెన్సిల్‌పై భారీ తగ్గింపు ఆఫర్లు!