ఆపిల్ ఐఫోన్ కొనాలనుకుంటున్నారా? అమెజాన్‌లో డిస్కౌంట్.. వెంటనే కొనండి..

ఇప్పుడు కొని పెట్టుకుంటే డబ్బును ఆదా చేసుకోవచ్చు.

ఆపిల్ ఐఫోన్ కొనాలనుకుంటున్నారా? అమెజాన్‌లో డిస్కౌంట్.. వెంటనే కొనండి..

iPhone 16e

Updated On : May 1, 2025 / 5:02 PM IST

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, గృహోపకరణాలు వంటి ఎన్నో రకాల వస్తువులపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. పాపులర్ స్మార్ట్‌ఫోన్లపై కూడా డిస్కౌంట్లు ఉన్నాయి.

ఇందులో ఐఫోన్ 16ఈపై కూడా డిస్కౌంట్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.54,000లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ కొనుక్కోవాలని భావిస్తున్న వారికి ఇది మంచి అవకాశం. ఇప్పుడు కొని పెట్టుకుంటే డబ్బును ఆదా చేసుకోవచ్చు.

ఐఫోన్ 16ఈ ధర భారత్‌లో రూ.59,900గా ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ ఫోన్ డిస్కౌంట్‌ కింద రూ.53,999కే లభిస్తోంది. అంటే నేరుగా రూ.5,901 డిస్కౌంట్ అందిస్తోంది. ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్లు వంటివి కూడా ఉన్నాయి.

Also Read: ట్రెండ్‌ మారుతోంది.. కొత్త స్మార్ట్‌ఫోన్లు ఎలా వస్తున్నాయో తెలుసా? ఇకపై వీటినే వాడతామా?

ఐఫోన్ 16ఈ ఫీచర్లు
ఆపిల్ ఐఫోన్ 16ఈలో 60Hz రిఫ్రెష్ రేటుతో 6.1-అంగుళాల OLED డిస్ప్లే ఉంది. ఆపిల్ A18 చిప్‌సెట్‌తో దీన్ని విడుదల చేశారు. 8GB RAMతో అందుబాటులో ఉంది. ఈ ఫోనులో ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్, ఫేస్ ఐడీ, అల్యూమినియం డిజైన్‌ ఉంది.

ఐఫోన్ 16ఈలో 48 ఎంపీ మెయిన్ కెమెరా 2x ఆప్టికల్ జూమ్‌తో ప్యాక్‌తో వచ్చింది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్‌లో 12 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. 26 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ బ్యాటరీ లైఫ్‌తో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఛార్జింగ్, డేటా బదిలీ కోసం USB-C పోర్ట్ ఉంటుంది. iOS 18 సాఫ్ట్‌వేర్‌తో రన్ అవుతుంది.