ట్రెండ్‌ మారుతోంది.. కొత్త స్మార్ట్‌ఫోన్లు ఎలా వస్తున్నాయో తెలుసా? ఇకపై వీటినే వాడతామా?

వన్‌ప్లస్, షియోమి వంటి స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు 2025లో కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ల (చిన్న సైజు, పవర్‌ఫుల్ ఫీచర్లతో ఉండే స్మార్ట్‌ఫోన్లు)పై దృష్టి సారించాయి.

ట్రెండ్‌ మారుతోంది.. కొత్త స్మార్ట్‌ఫోన్లు ఎలా వస్తున్నాయో తెలుసా? ఇకపై వీటినే వాడతామా?

Updated On : May 1, 2025 / 3:05 PM IST

స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్లు నిన్న, మొన్నటి వరకు భారీ స్క్రీన్‌లతో తమ ఫోన్లను విడుదల చేయడానికి పోటీ పడ్డాయి. మళ్లీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. ఇప్పుడు సైజులో చిన్నగా పెర్ఫార్మన్స్‌లో పవర్‌ఫుల్‌గా ఉండేలా స్మార్ట్‌ఫోన్లను తీసుకురావడానికి పోటీ పడుతున్నాయి. వన్‌ప్లస్ నుంచి షియోమి వరకు అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు ఇదే పంథాలో వెళ్తున్నాయి.

ఫోన్ సైజుల గురించి ప్రజల అభిప్రాయాలు కూడా మారుతున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ యూజర్ల వ్యక్తిగత ప్రాధాన్యాలు సాధారణంగానే మారుతూ ఉంటాయి. కొందరు భారీ సైజులో ఉండే స్మార్ట్‌ఫోన్లంటే ఇష్టపడతారు.. మరికొందరికి తక్కువ సైజులో, జేబులో ఈజీగా పట్టే ఫోన్లంటే ఇష్టపడతారు.

గతంలో, స్టాండర్డ్‌ ఫోన్ సైజు 3.5 నుంచి 4 అంగుళాల వరకు ఉండేది. కొంతకాలం నుంచి 6 అంగుళాలు లేదా అంతకంటే ఎక్కువ సైజులో ఉండే ఫోన్‌లు అధికంగా వస్తున్నాయి. మొన్నటివరకు చాలా పెద్ద స్క్రీన్‌లతో ఫోన్‌లను తయారు చేయడంపై దృష్టి సారించిన వన్‌ప్లస్, షియోమి వంటి స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు ఇప్పుడు మళ్లీ చిన్న సైజులో ఫోన్‌లను తయారు చేయడానికి పోటీపడుతున్నాయి.

Also Read: కూటమిలోనే ఉంటున్నా.. వీరి మధ్య విభేదాలేంటి?

చిన్న సైజు స్మార్ట్‌ఫోన్లలోనే భారీ సామర్థ్యం ఉండే బ్యాటరీ, పవర్‌ఫుల్‌ ఫీచర్లు ఉండేలా చూసుకుంటున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ బరువు, తిక్‌నెస్‌ (మందం) వంటి ఇతర అంశాలు కూడా చాలా ముఖ్యమైనవి. అయితే సమస్య ఏమిటంటే, స్మార్ట్‌ఫోన్లు పెద్ద సైజులో ఉంటే భారీ బ్యాటరీ వంటి మంచి ఫీచర్లను వాటిల్లో తీసుకురావడం సులువు అవుతుంది.

స్మార్ట్‌ఫోన్లు చిన్న సైజులో ఉంటే ఆయా పవర్‌ఫుల్‌ ఫీచర్లను తీసుకురావడం చాలా కష్టం. చిన్న సైజులో ఉండే ఫోన్లలో బ్యాటరీ లైఫ్, ఇతర ఫీచర్లు అంత పవర్‌ఫుల్‌గా ఉండవు. దీంతో ఇప్పుడు స్మార్ట్‌పోన్‌ కంపెనీలు చిన్న సైజు ఫోన్లలో పవర్‌ఫుల్ ఫీచర్లను తీసుకురావడంపై దృష్టి పెడుతున్నాయి.

వన్‌ప్లస్, షియోమి వంటి స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు 2025లో కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ల (చిన్న సైజు, పవర్‌ఫుల్ ఫీచర్లతో ఉండే స్మార్ట్‌ఫోన్లు)పై దృష్టి సారించాయి. వన్‌ప్లస్ 13ఎస్‌ చిన్న డిజైన్‌లో పెద్ద బ్యాటరీతో వస్తూ ఇతర స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలకు పోటీ ఇస్తోంది. వన్‌ప్లస్ ఎఫెక్ట్‌తో షియోమి కంపెనీ తన షియోమి 16ను కాంపాక్ట్ ఫామ్‌ను కొనసాగిస్తూ పెద్ద బ్యాటరీతో రావాలని యోచిస్తోంది.