Iphone Makers Plant To Remain Shut For Three More Days
Foxconn Plant : ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ ఫోన్లు తయారుచేసే భారతీయ కంపెనీ ప్లాంట్ మరో మూడు రోజులు మూతపడనుంది. చెన్నైలోని ఫాక్స్ కాన్ కంపెనీ ఆపిల్ ఫోన్లను తయారుచేస్తోంది. మరో మూడు రోజుల పాటు ప్లాంట్ మూసివేయనున్నట్టు సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. ప్లాంటులో ఫుడ్ పాయిజన్ ఘటన జరిగినప్పటి నుంచి కంపెనీలో ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. ఉద్యోగులు ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో ప్లాంట్‌కు మరో మూడు రోజులు సెలవులు ప్రకటించినట్లు అధికారి వెల్లడించారు. డిసెంబర్ నెలలో ఆపిల్ ప్లాంట్ 1000 మంది వర్కర్లతో ప్రొడక్షన్ మొదలుపెట్టాల్సి ఉంది. కానీ, ఆందోళనల నేపథ్యంలో మూడు రోజులు ఆపిల్ ప్లాంట్ మూసివేయనున్నట్టు తెలిపారు.
డిసెంబర్ 18న ఆపిల్ ఐఫోన్ తయారీ ప్లాంట్ మూతపడగా.. డిసెంబర్ 26 వరకు ప్లాంట్ మూతపడనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సోమవారం (డిసెంబర్ 27) ఫాక్స్ కాన్ కంపెనీ గేట్లు తెరవగా.. కొన్ని వాహనాలు లోపలికి బయటకు రాకపోకలు సాగాయి. కానీ, ఆ ప్రాంతమంతా వర్కర్లు లేకపోవడంతో నిర్మూనుష్యంగా కనిపించింది. ఈ ఆపిల్ ప్లాంట్‌లో ఇప్పటివరకూ ఐఫోన్ 12 ఫోన్లను తయారు చేయగా.. ఇటీవలే ఫ్లాగ్ షిప్ ఐఫోన్ 13 సిరీస్ ట్రయల్స్ ప్రొడక్షన్ కూడా ప్రారంభించినట్టు నివేదికలు వెల్లడించాయి. ఆపిల్ ఐఫోన్లు మాత్రమే కాకుండా Xiaomi India ఫోన్లను కూడా ఫ్యాక్స్ కాన్ కంపెనీ తమ ప్లాంటులో తయారుచేస్తోంది.
ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలో 150 మంది కార్మికులు ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. బాధిత కార్మికులకు మద్దతుగా ఉద్యోగులంతా నిరసనకు దిగి హైవేను దిగ్బంధించారు. ఈ క్రమంలో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫాక్స్ కాన్ కంపెనీ తమ ప్లాంటులో ఐఫోన్ 12 ఫోన్లను ఉత్పత్తి చేస్తోంది. తమిళనాడులోని పరిశ్రమ భద్రతకు సంబంధించిన అధికారి మాట్లాడుతూ ప్లాంట్ మూసివేశామని, ఆదివారం వరకు మూసివేస్తామని వెల్లడించారు. తద్వారా ప్లాంటులో తొమ్మిది రోజుల పాటు కార్యకలాపాలపై ప్రభావం పడుతుందని అన్నారు. 2020 డిసెంబర్‌లో కార్మికులు జీత భత్యాలు డిమాండ్ చేస్తూ ప్లాంట్‌ను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో అప్పట్లో ఫాక్స్ కాన్ కంపెనీకి 60 మిలియన్ డాలర్ల వరకు నష్టం వాటిల్లింది.
Read Also : Apple Supplier Plant : భారత్‌లో ఆపిల్ ఫోన్ ప్లాంట్ మూసివేత..