Apple Supplier Plant : భారత్‌లో ఆపిల్ ఫోన్ ప్లాంట్ మూసివేత..
ఆపిల్ ఫోన్లు తయారుచేసే కంపెనీ ప్లాంట్ మూసివేయనుంది. భారతదేశంలో ఫాక్స్ కాన్ కంపెనీ ఆపిల్ ఫోన్లను తయారుచేస్తోంది. ఐదు రోజుల పాటు ఈ ప్లాంట్ మూసివేయనున్నట్టు అధికారులు తెలిపారు.

Apple Supplier Plant Near Chennai To Stay Shut This Week After Protests Report
Apple iPhone 13 Plant : ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ ఫోన్లు తయారుచేసే కంపెనీ ప్లాంట్ మూసివేయనుంది. భారతదేశంలో ఫాక్స్ కాన్ కంపెనీ ఆపిల్ ఫోన్లను తయారుచేస్తోంది. ఐదు రోజుల పాటు ఈ ప్లాంట్ మూసివేయనున్నట్టు కాంచీపురం
పోలీసులు వెల్లడించారు. ఇటీవల ఈ ప్లాంటులో ఫుడ్ పాయిజన్ ఘటన జరిగింది.
అప్పటినుంచి కంపెనీలో ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. ఉద్యోగులు ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో ప్లాంట్‌కు 5 రోజులు సెలవులు ప్రకటించినట్లు కాంచీపురం పోలీసులు వెల్లడించారు. ఇప్పటివరకు ఈ ఘటనపై ఫాక్స్‌కాన్, యాపిల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలో 150 మంది కార్మికులు ఆసుపత్రి పాలయ్యారు. బాధిత కార్మికులకు మద్దతుగా ఉద్యోగులంతా నిరసనకు దిగి హైవేను దిగ్బంధించారు. ఈ క్రమంలో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఫాక్స్ కాన్ కంపెనీ తమ ప్లాంటులో ఐఫోన్ 12 ఫోన్లను ఉత్పత్తి చేస్తోంది. తమిళనాడులోని పరిశ్రమ భద్రతకు సంబంధించిన అధికారి మాట్లాడుతూ ప్లాంట్ మూసివేశామని, ఆదివారం వరకు మూసివేస్తామని వెల్లడించారు. తద్వారా ప్లాంటులో తొమ్మిది రోజుల పాటు కార్యకలాపాలపై ప్రభావం పడుతుందని అన్నారు. 2020 డిసెంబర్‌లో కార్మికులు జీత భత్యాలు డిమాండ్ చేస్తూ ప్లాంట్‌ను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో అప్పట్లో ఫాక్స్ కాన్ కంపెనీకి 60 మిలియన్ డాలర్ల వరకు నష్టం వాటిల్లింది.
Read Also : Disney+ Hotstar : డిస్నీ+ హాట్‌స్టార్ కొత్త ప్లాన్.. రూ.49కే మెంబర్‌షిప్!