iPhone Whatsapp Schedule : ఐఫోన్ యూజర్లకు పండగే.. ఇకపై వాట్సాప్‌లో మెసేజ్ రిమైండర్స్ షెడ్యూల్ చేయవచ్చు.. ఎలాగంటే?
iPhone Whatsapp Schedule : ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ మెసేజ్ రిమైండర్స్ షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇదేలా పనిచేస్తుందంటే? ఫుల్ డిటెయిల్స్..

iPhone Whatsapp Schedule
iPhone Whatsapp Schedule : ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. మెసేజింగ్ యాప్ దిగ్గజం వాట్సాప్ సరికొత్త ఫీచర్ తీసుకొస్తోంది. ఇకపై వాట్సాప్‌లో కూడా నేరుగా మెసేజ్ రిమైండర్లను షెడ్యూల్ చేయొచ్చు. ఏదైనా ముఖ్యమైన చాట్స్ ట్రాక్ చేసేందుకు ఐఫోన్ యూజర్లకు ప్రయోజనకరంగా ఉంటుంది.
వాట్సాప్ ఈ కొత్త ఫీచర్‌ను డెవలప్ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవలి iOS అప్‌డేట్ (వెర్షన్ 25.25.74) ప్రకారం.. పర్సనల్ మెసేజ్‌లపై నోటిఫికేషన్ (iPhone Whatsapp Schedule) రిమైండర్‌లను సెట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ గతంలో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ప్రవేశపెట్టింది.
ప్రస్తుతానికి ఈ కొత్త ఫీచర్ మెసేజ్ యాక్షన్ మెనూలో అందుబాటులో ఉంటుంది. ఐఫోన్ యూజర్లు చాట్ లేదా గ్రూప్‌లోని ఏదైనా మెసేజ్‌కు అలర్ట్ సెట్ చేసేందుకు అనుమతిస్తుంది. 2 గంటలు, 8 గంటలు లేదా ఒక రోజు వంటి ప్రీసెట్ ఇంటర్వల్స్ రిమైండర్‌లను సెట్ చేయవచ్చు.
నిర్దిష్ట తేదీ, టైమ్ మాన్యువల్‌గా ఎంచుకోవచ్చు. మీటింగ్స్, టాస్కులు లేదా డెడ్ లైన్స్ కోసం వినియోగించవచ్చు. సెట్ చేసిన తర్వాత రిమైండర్ యాక్టివ్‌గా ఉంటే మెసేజ్ బబుల్‌లో ఒక చిన్న బెల్ ఐకాన్ కనిపిస్తుంది.
ఇలా మెసేజ్ రిమైండర్ షెడ్యూల్ చేయొచ్చు :
“ఐఫోన్ యూజర్ రిమైండర్ సెట్ చేయడం ద్వారా ఎంచుకున్న సమయంలో నిర్దిష్ట మెసేజ్ రివ్యూ చేసేందుకు అలర్ట్ షెడ్యూల్ చేయవచ్చు. 2 గంటలు, 8 గంటలు లేదా ఒక రోజు ఇలా టైమ్ రిమైండర్ సెట్ చేయొచ్చు. ఐఫోన్ యూజర్లు పూర్తిగా కస్టమైజడ్ ఆప్షన్ ఉపయోగించి రిమైండర్ కోసం కచ్చితమైన సమయం, తేదీని ఎంచుకోవచ్చు. మీటింగ్స్ లేదా డెడ్ లైన్ షెడ్యూల్ చేసేందుకు ప్రత్యేకంగా ఉంటుందని” అని WaBetaInfo రిపోర్టు పేర్కొంది.
రిమైండర్ ట్రిగ్గర్ చేయగానే వాట్సాప్ మీకు ఫుల్ మెసేజ్ టెక్స్ట్ మీడియా ప్రివ్యూ, చాట్ పేరుతో నోటిఫికేషన్‌ను పంపుతుంది. ముఖ్యంగా, అన్ని రిమైండర్‌లు డివైజ్‌లోనే షెడ్యూల్ అవుతాయి.
వాట్సాప్ కంపెనీ మీ రిమైండర్ వివరాలకు యాక్సెస్ చేయలేదు. పూర్తిగా ప్రైవసీ కలిగి ఉంటుంది. చాట్ క్లియర్ అయ్యేందుకు నోటిఫికేషన్ డెలివరీ అయిన కొద్దిసేపటికే రిమైండర్ ఆటోమాటిక్‌గా క్లియర్ అవుతుంది.
ఈ కొత్త అప్‌డేట్ ద్వారా థర్డ్ పార్టీ యాప్‌లు ఫాలో-అప్‌లను ట్రాక్ చేయాల్సిన అవసరం ఉండదు. ఐఫోన్ యూజర్లు వాట్సాప్ నుంచే మెసేజ్‌లను నేరుగా షెడ్యూల్ చేయొచ్చు. ఈ కొత్త రిమైండర్ సిస్టమ్ ప్రస్తుతం ఎంపిక చేసిన iOS యూజర్ల గ్రూపుకు మాత్రమే అందుబాటులో ఉంది. రాబోయే వారాల్లో రెగ్యులర్ యూజర్లకు కూడా అందుబాటులోకి రానుంది.