iPhoneలో కొత్త ఫీచర్.. కళ్లు లేనివారికి దారిచూపిస్తుంది.. సామాజిక దూరాన్ని సూచిస్తుంది!

iPhone ARKit feature for blind users: ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ కంపెనీ తమ లేటెస్ట్ బీటా iOS వెర్షన్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ప్రత్యేకించి కళ్లు లేనివారికోసం ఆపిల్ రూపొందించింది. బయటకు వెళ్లినప్పుడు ఐఫోన్ కెమెరా ద్వారా కళ్లు లేనివారికి దారి చూపిస్తుంది.. కరోనా పరిస్థితుల్లో సామాజిక దూరం తప్పనిసరిగా మారింది.
కనీసం 6 అడుగుల దూరం పాటించాలి. బహిరంగ ప్రదేశాల్లో ఇతరులతో సామాజిక దూరాన్ని పాటించేందుకు ఈ ఫీచర్ అద్భుతంగా పనిచేస్తుంది. ఆపిల్ కంపెనీ ARKit అనే ఫీచర్ డెవలప్ చేసింది.
దీని ద్వారా మనుషుల ఆకారంతో పాటు వర్చువల్‌గా డిటెక్ట్ చేస్తుంది. మనిషికి మనిషికి మధ్య దూరాన్ని కచ్చితంగా గుర్తించవచ్చు..
ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ లోని లిడార్ యూనిట్ల ద్వారా మనుషుల మధ్య దూరాన్ని డిటెక్ట్ చేస్తుంది. ఈ టూల్ ద్వారా విజువల్ ఇంపైర్‌మెంట్‌తో ఎవరైనా వినియోగించుకోవచ్చు. నడిచే సమయంలో ఎవరికి ఎవరూ ఎంత దూరంలో ఉన్నారో విజువల్‌గా తెలుసుకోవచ్చు.
రోడ్డు దాటేటప్పుడు లేదా ఏదైనా స్టోర్ కు వెళ్లినప్పుడు అన్ని సందర్భాల్లో ARKit ఫీచర్ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ కొత్త ఫీచర్ Magnifier యాప్ లో భాగంగా ఉంటుంది. ఇందులో లిడార్, వైడ్ యాంగిల్ కెమెరాలతో పనిచేస్తుంది. ఎవరైనా దగ్గరగా వస్తే.. వారికి ఎంతదూరంలో ఉన్నారో అడుగులు లేదా మీటర్ల దూరంలో డిటెక్ట్ చేస్తుంది.
దగ్గరిగా ముందుకు వెళ్తున్న కొద్ది వారి మధ్య దూరాన్ని కూడా డిటెక్ట్ చేస్తుంటుంది. కెమెరా వ్యూ ద్వారా డైరెక్షన్ డెటెక్ట్ చేసి బ్లయిండ్ యూజర్లకు అర్థమయ్యేలా సూచిస్తుంది. రెండో ఫీచర్.. నిర్దిష్టమైన దూరాన్ని గుర్తించేందుకు కొన్ని రకాల శబ్దాలను చేస్తుంది.
ఆరు అడుగుల దూరాన్ని సెట్ చేస్తే… ఒక టోన్ వస్తుంది.. 6 అడుగుల కంటే ఎక్కువ దూరంలో ఉన్నప్పుడు మాత్రమే ఇలా టోన్ వస్తుంటుంది.. సామాజిక దూరాన్ని నిర్దేశించడమే ఈ ఫీచర్ ఉద్దేశంగా చెప్పవచ్చు.
Here’s how people detection works in iOS 14.2 beta – the voiceover support is a tiny bit buggy but still super cool https://t.co/vCyX2wYfx3 pic.twitter.com/e8V4zMeC5C
— Matthew Panzarino (@panzer) October 31, 2020
మూడో ఫీచర్ ద్వారా ఎవరైతే దృష్టిపరంగా లేదా శబ్దాలను గ్రహించలేరో వారికోసం ఈ ఫీచర్ బాగా పనికివస్తుంది. ఎవరైనా దగ్గరగా రాగానే స్పర్శ నాడి వేగంగా మారుతుంది. అలా గుర్తించవచ్చు.
చివరిగా విజువల్ ఫీచర్.. దృష్టిలోపం ఉన్నవారు తమచుట్టూ ఎవరు ఉన్నారో గుర్తించేందుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎవరైనా వ్యక్తి ఉన్నట్టుగా ఫోన్ స్ర్కీన్‌పై యారో పాయింట్లతో సూచిస్తుంది. ఎక్కువగా చీకటిగా ఉన్న ప్రదేశంలో వైడ్ యాంగిల్ కెమెరా ద్వారా పనిచేయదు.