×
Ad

iQOO 15 Launch : కొత్త ఐక్యూ 15 వచ్చేసిందోచ్.. ఫీచర్లు భలే ఉన్నాయి భయ్యా.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు.. ఫుల్ డిటెయిల్స్..!

iQOO 15 Launch : ఐక్యూ 15 సరికొత్త ఫోన్ లాంచ్ అయింది. భారతీయ మార్కెట్లో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్ సెట్, 7000mAH భారీ బ్యాటరీతో వచ్చింది.. పూర్తి వివరాలివే

iQOO 15 Launch

iQOO 15 Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి అద్భుతమైన ఆఫర్.. అద్భుతమైన ఫీచర్లతో లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఐక్యూ 15 స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ చైనాలో ఆవిష్కరించిన దాదాపు నెల తర్వాత అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ క్వాల్‌కామ్ ఫ్లాగ్‌షిప్ 3nm ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 100W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000mAh బ్యాటరీని అందిస్తుంది.

అంతేకాదు.. 2K రిజల్యూషన్ 144Hz వరకు (iQOO 15 Launch) రిఫ్రెష్ రేట్‌తో 6.85-అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంది. భారత మార్కెట్లో ఈ ఫోన్ అమెజాన్ ద్వారా 2 కలర్ ఆప్షన్లలో పొందవచ్చు. సెక్యూరిటీ విషయానికి వస్తే.. 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కూడా అందిస్తుంది.

భారత్‌లో ఐక్యూ 15 ధర, లభ్యత :

భారత మార్కెట్లో ఐక్యూ 15 మోడల్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ. 72,999 నుంచి ప్రారంభమవుతుంది. టాప్-ఆఫ్-ది-లైన్ ఆప్షన్ ధర రూ. 79,999, 16GB ర్యామ్ + 512GB స్టోరేజ్‌ను అందిస్తోంది. అయితే, టెక్ సంస్థ రూ. 7వేలు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. రెండు వేరియంట్‌ల ధరలు వరుసగా రూ. 64,999, రూ. 71,999కి లభ్యం కానున్నాయి.

ఈ కొత్త హ్యాండ్‌సెట్ డిసెంబర్ 1 మధ్యాహ్నం 12 గంటల నుంచి వినియోగదారులందరికి అమెజాన్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ప్రియారిటీ పాస్ యూజర్లు నవంబర్ 27 మధ్యాహ్నం నుంచి ఐక్యూ ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు. ఐక్యూ 15 ఫోన్ లెజెండ్, ఆల్ఫా బ్లాక్ కలర్ ఆప్షన్లలో పొందవచ్చు.

ఐక్యూ 15 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :

ఐక్యూ 15 ఫోన్ ఆండ్రాయిడ్ 16-ఆధారిత OriginOS 6తో వస్తుంది. కంపెనీ ఈ ఫోన్‌కు 5 ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లు, 7 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తుంది. 144Hz వరకు రిఫ్రెష్ రేట్, 2K రిజల్యూషన్, 508ppi పిక్సెల్ డెన్సిటీ 6,000 నిట్స్ లోకల్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.85-అంగుళాల శాంసంగ్ M14 8T ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది.

1Hz ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండే డిస్‌ప్లే ఫీచర్‌ కూడా కలిగి ఉంది. స్క్రీన్ యాంటీ-రిఫ్లెక్టివ్ ఫిల్మ్ వెట్ ఫింగర్ కంట్రోల్‌తో కూడా వస్తుంది. వినియోగదారులు తడి లేదా చెమటతో ఉన్న చేతులతో కాల్ చేయొచ్చు. ఫోటోలు, వీడియోలను షూట్ చేయొచ్చు. ట్రిపుల్ యాంబియంట్ లైట్ సెన్సార్‌ కూడా కలిగి ఉంటుంది.

ఐక్యూ 15 ఫోన్ క్వాల్కమ్ ఆక్టా కోర్ 3nm స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్ కలిగి ఉంది. అడ్రినో జీపీయూతో వస్తుంది. 16GB వరకు LPDDR5x ర్యామ్, 512GB వరకు UFS4.1 ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంటుంది. AnTuTu బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫామ్‌లో ఫోన్ 4.18 మిలియన్ పాయింట్లకు పైగా స్కోర్ చేసిందని కంపెనీ పేర్కొంది. ఈ హ్యాండ్‌సెట్ 23 శాతం మెరుగైన జీపీయూ పర్ఫార్మెన్స్, 25 శాతం మెరుగైన రే-ట్రేసింగ్‌, మెరుగైన 20 శాతం సింగిల్ కోర్ పర్ఫార్మెన్స్, 17 శాతం మెరుగైన మల్టీ కోర్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది.

Read Also : Money Saving Tips : మీకు నెలకు రూ. 25వేలు జీతం వచ్చినా రూ. 72వేలు సేవ్ చేయొచ్చు.. ఈ సీక్రెట్ ఫార్ములా తెలిస్తే అందరూ కోటీశ్వరులే..!

ఈ ఫోన్ 37 శాతం వరకు మెరుగైన NPU పర్ఫార్మెన్స్ కూడా అందిస్తుంది. థర్మల్‌ కోసం ఐక్యూ 15 ఫోన్ 8,000 చదరపు మిమీ హీట్ వెదజల్లే ప్రాంతంతో 8K VC కూలింగ్ సిస్టమ్‌ కలిగి ఉంది. బ్యాక్ కెమెరా మాడ్యూల్ కింద కొత్త మాన్స్టర్ హాలో యాంబియంట్ లైటింగ్‌ను కూడా కలిగి ఉంది.

ఆప్టిక్స్ విషయానికొస్తే..

ఐక్యూ 15 ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ కలిగి ఉంది. 50MP సోనీ IMX921 ప్రైమరీ షూటర్ 1/1.56-అంగుళాల సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) ఉంది. ఈ ఫోన్‌లో 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP సోనీ IMX882 1/1.95-అంగుళాల టెలిఫోటో పెరిస్కోప్ కెమెరా, 3.7x లాస్‌లెస్ జూమ్ 10x జూమ్ సామర్థ్యాలు ఉన్నాయి. 1/2.76-అంగుళాల సెన్సార్‌తో 50MP అల్ట్రావైడ్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ సైడ్ ఐక్యూ 15లో 90-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 32MP సెల్ఫీ కెమెరా ఉంది. 60fps వరకు 4K రిజల్యూషన్ వీడియో రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

ఈ హ్యాండ్‌సెట్ స్టాండర్డ్, పోర్ట్రెయిట్ ల్యాండ్‌స్కేప్ కెమెరా మోడ్‌లలో లభించే ఏఐ విజువల్ రిఫ్లెక్షన్ ఎరేస్ ఫీచర్‌లతో కూడా వస్తుంది. ఐక్యూ 15 ఫోన్ దుమ్ము, నీటి నిరోధకతకు IP68 + IP69 రేటింగ్‌ అందిస్తుంది. 100W వైర్డు, 40W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీతో వస్తుంది. 8.17mm మందం కలిగి ఉంది. ఫైబర్‌గ్లాస్ బ్యాక్ ప్యానెల్‌ను కలిగిన ఆల్ఫా బ్లాక్ కలర్‌వే బరువు 216.2 గ్రాములు, లెజెండ్ షేడ్ బ్యాక్ గ్లాస్‌ కలిగి ఉంటుంది. బరువు 220 గ్రాములు ఉంటుంది.