iQOO Neo 10 Series : ఐక్యూ నియో 10 సిరీస్ వచ్చేస్తోంది.. ఈ నెల 29నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

iQOO Neo 10 Series : ఐక్యూ నియో 10ప్రో 144Hz రిఫ్రెష్ రేట్‌తో ఫ్లాట్ 6.78-అంగుళాల 1.5కె 8టీ ఎల్‌టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

iQOO Neo 10 Series : ఐక్యూ నియో 10 సిరీస్ వచ్చేస్తోంది.. ఈ నెల 29నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

iQOO Neo 10 Series launching

Updated On : November 19, 2024 / 8:00 PM IST

iQOO Neo 10 Series : కొత్త స్మార్ట్‌‌ఫోన్ కోసం చూస్తున్నారా? ఐక్యూ మిడ్-రేంజ్ నియో 10 సిరీస్‌ను నవంబర్ 29న చైనాలో లాంచ్ చేస్తుందని కంపెనీ ధృవీకరించింది. ప్రాసెసర్, కలర్ ఆప్షన్‌లు, డిస్‌ప్లే, స్మార్ట్‌ఫోన్ ఇతర వివరాలను కూడా ఐక్యూ ధృవీకరించింది. ఐక్యూ నియో 10ప్రో మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్, పవర్ ఐక్యూ సొంత క్యూ2 చిప్‌సెట్‌తో కూడా వస్తుంది. గతంలో ఐక్యూ 13లో కూడా ఇదే ఫీచర్ కనిపించింది. చిప్‌సెట్ 144ఎఫ్‌పీఎస్ గేమింగ్, 2కె సూపర్-రిజల్యూషన్‌ను అందిస్తుంది.

ఐక్యూ నియో 10ప్రో స్పెసిఫికేషన్‌లు (అంచనా) :
ఇటీవల లీక్ ప్రకారం.. ఐక్యూ నియో 10ప్రో 144Hz రిఫ్రెష్ రేట్‌తో ఫ్లాట్ 6.78-అంగుళాల 1.5కె 8టీ ఎల్‌టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. లేటెస్ట్ వైమీలా డైమెన్సిటీ 9400 ప్రాసెసర్‌తో ఆధారితంగా పనిచేస్తుంది. గరిష్టంగా 16జీబీ ర్యామ్ 512జీబీ వరకు స్టోరేజీకి సపోర్టు అందిస్తుంది. నియో 10ప్రో 50ఎంపీ ప్రైమరీ కెమెరాతో ఎఫ్/1.56 ఎపర్చరు, సెకండరీ 50ఎంపీ కెమెరాతో వస్తుంది. అల్ట్రా-వైడ్ లెన్స్‌తో వస్తుందని టిప్‌స్టర్ పేర్కొంది.

ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఐక్యూ నియో 10 ప్రో 120డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో భారీ 6,000mAh బ్యాటరీని కూడా కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ ఆప్టికల్ సెన్సార్‌తో పోలిస్తే.. గూడిక్స్ అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌కి అప్‌గ్రేడ్ అవుతుంది. గత ఏడాది మోడల్ మాదిరిగానే ప్లాస్టిక్ ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది. ఐక్యూ నియో 10 సిరీస్ ధర వివరాలు ఇంకా లీక్ కానప్పటికీ, ఐక్యూ అప్‌గ్రేడ్‌లు ఉన్నప్పటికీ ఐక్యూ నియో 9 సిరీస్‌కు సమానమైన ధర ఉంటుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది.

Read Also : Vivo S20 Series : వివో S20 సిరీస్ వచ్చేస్తోంది.. ప్రీ-రిజర్వేషన్‌లు ప్రారంభం.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?