iQOO Vs OnePlus: ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో ఏది బెస్ట్? ఈ ఫీచర్లు మాత్రం కేక..

ఈ రెండింటి మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి. అవి తెలుసుకుని ఫోన్ కొంటే మంచి ఎక్స్‌పీరియన్స్ పొందొచ్చు.

iQOO Vs OnePlus: ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో ఏది బెస్ట్? ఈ ఫీచర్లు మాత్రం కేక..

Updated On : May 31, 2025 / 7:52 AM IST

iQOO Vs OnePlus: మొబైల్ గేమ్స్‌ బాగా ఆడేవారికి iQOO Neo 10R, OnePlus 13R స్మార్ట్‌ఫోన్లు బాగా నచ్చుతున్నాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు మంచి పర్ఫార్మన్స్‌ను కూడా అందిస్తున్నాయి. ఈ రెండింటి మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి. అవి తెలుసుకుని ఫోన్ కొంటే మంచి ఎక్స్‌పీరియన్స్ పొందొచ్చు.

iQOO Neo 10R
iQOO నుంచి వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. దీని రిజల్యూషన్ 1,260 x 2,800 పిక్సెల్‌లు. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో 4500 నిట్‌ల పీక్ బ్రైట్‌నెస్‌తో వచ్చింది. ఫొటోగ్రఫీ కోసం ఈ ఫోన్ డ్యూయల్ కెమెరాతో వచ్చింది. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్‌, ఫ్రంట్‌ కెమెరా 32-మెగాపిక్సెల్‌తో ఉంది. ఇందులో 6400mAh బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది.

Also Read: ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు ఇంకా అప్లై చేసుకోలేదా? మీకో గుడ్‌న్యూస్‌

OnePlus 13R
ఈ OnePlus ఫోన్ 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వచ్చింది. రిఫ్రెష్ రేట్ 120 Hz. దీని పీక్ బ్రైట్‌నెస్‌ 4500 నిట్‌లు. ఈ ఫోన్ Qualcomm Snapdragon 8 Gen 3 ప్రాసెసర్‌తో అందుబాటులో ఉంది. ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇది 50MP ప్రైమరీ కెమెరాతో OIS సపోర్టుతో వచ్చింది. సెల్ఫీల కోసం ఫ్రంట్‌ సైడ్‌ 16MP కెమెరాతో ఉంది. ఇందులో 6000mAh బ్యాటరీ ఉంది.

ఏది బెటర్?
గేమింగ్, బ్యాటరీ పనితీరు చూస్తే iQOO Neo 10R బాగుంటుంది. మంచి కెమెరా, సాఫ్ట్‌వేర్‌ ఉండాలని మీరు భావిస్తే OnePlus 13R కొనొచ్చు. వీటిల్లో మీకు ఏది నచ్చుతుందో అది సెలెక్ట్‌ చేసుకుని కొనేయొచ్చు.