iQOO Z7 Pro 5G : కర్వడ్ డిస్‌ప్లేతో ఐక్యూ Z7 ప్రో 5G ఫోన్ వస్తోంది.. ఫీచర్లు ఇవేనా? ధర ఎంత ఉండొచ్చుంటే?
iQOO Z7 Pro 5G : అధికారిక లాంచ్‌కు ముందే ఐక్యూ Z7 ప్రో 5G ఫోన్ కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని కంపెనీ iQOO ధృవీకరించింది.

iQOO Z7 Pro 5G with curved display to launch in India soon, company reveals
iQOO Z7 Pro 5G : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ ఐక్యూ నుంచి సరికొత్త ఫోన్ రాబోతోంది. ఈ జూలైలో iQOO నుంచి నియో 7 ప్రో, ఐక్యూ Z7 5G ఫోన్ లాంచ్ చేసిన తర్వాత iQOO ఇండియాలో మరో కొత్త iQOO Z7 Pro 5G లాంచ్ చేయనున్నట్టు వెల్లడించింది. అధికారిక లాంచ్‌కు ముందు iQOO ఇండియా చీఫ్ నిపున్ మరియా రాబోయే ఫోన్ కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని ధృవీకరించారు. డిస్ప్లే సెంట్రల్‌గా సెల్ఫీ కెమెరా షార్ట్ హోల్-పంచ్‌ను కూడా కలిగి ఉంటుంది. iQOO ఇంకా అధికారిక లాంచ్ తేదీని రివీల్ చేయలేదు.
రాబోయే స్మార్ట్‌ఫోన్ గురించి ఇతర వివరాలు తెలియవు. కానీ, iQOO Z7s, iQOO Neo 7 మధ్య ఫోన్ ఉంటుందని భావించవచ్చు. iQOO హై ప్రీమియం నంబర్ల సిరీస్ ఇప్పటికే దేశంలో అందుబాటులో ఉన్నందున ఫోన్ ధర సుమారు రూ. 25వేలు కావచ్చు. iQOO Z7 Pro మోడల్ iQOO Z7s కన్నా కొన్ని అప్‌గ్రేడ్‌లతో రావచ్చు.
Read Also : WhatsApp iPhone Users : ఐఫోన్ యూజర్లకు వాట్సాప్ అదిరే అప్‌డేట్.. 5 సరికొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్లు ఇవే..!
ఐక్యూ Z7s ఫోన్ 6.38-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేతో 90Hz రిఫ్రెష్ రేట్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్, HDR10+, 1300నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. డిస్ప్లే Schott Xensation Glass ద్వారా ప్రొటెక్ట్ చేస్తుంది. సాధారణ iQOO Z7s ఫోన్ స్క్రీన్ పంచ్-హోల్ కటౌట్‌ను కూడా కలిగి ఉంటుంది. బ్యాక్ కెమెరాలు ప్రామాణిక దీర్ఘచతురస్రాకార మాడ్యూల్‌లో ఉంటాయి.
iQOO Z7 Pro సాధారణంగా హైఎండ్ ప్రీమియంగా కనిపించే కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. iQOO Z7s ఫోన్ కెమెరా సిస్టమ్‌లో f/1.79 ఎపర్చరుతో 64MP ప్రైమరీ ISOCELL GW3 సెన్సార్, f/2.4 ఎపర్చర్‌తో 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలకు 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. iQOO Z7 Pro వెనుకవైపు అల్ట్రా-వైడ్ కెమెరాను అందించనుంది.

iQOO Z7 Pro 5G with curved display to launch in India soon, company reveals
iQOO Z7s ఫోన్ హుడ్ కింద 4,500mAh బ్యాటరీని కూడా అందిస్తుంది. కంపెనీ 44W ఛార్జింగ్‌కు సపోర్ట్‌ను అందించింది. ప్యాకేజింగ్ ఫాస్ట్ ఛార్జర్‌ను కూడా అందించనుంది. స్పీడ్ ఛార్జింగ్ సపోర్ట్‌కి అవకాశం ఉన్నప్పటికీ.. iQOO Z7 Proతో హ్యాండ్‌సెట్ కూడా IP54 రేట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ప్రో మోడల్‌లో కూడా రావచ్చు.అయితే, సాధారణ మోడల్‌లో 3.5mm ఆడియో జాక్ అందుబాటులో ఉండకపోవచ్చు.
ముఖ్యంగా, రాబోయే ఐక్యూ కొత్త మోడల్ ఫోన్ కొత్త చిప్‌సెట్‌తో రావొచ్చు. iQOO Z7 5G క్వాల్‌కామ్ ద్వారా స్నాప్‌డ్రాగన్ 695 SoCతో వస్తుంది. మరోవైపు, iQOO Neo 7, MediaTek డైమెన్సిటీ 8200 SoCని కలిగి ఉంది. iQOO Z7 Pro ధర దాదాపు రూ. 25వేలు ఉండవచ్చు. అయితే, టాప్ వేరియంట్ ఖరీదైనది కావచ్చు. ఐక్యూ నియో 7 ప్రో ఈ నెలలో భారత మార్కెట్లో లాంచ్ కాగా.. Z7 ప్రో ఫోన్ వచ్చే ఆగస్టు ప్రారంభంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.