iQoo Z9 5G India Launch : భారత్‌కు ఐక్యూ Z9 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. మార్చి 12నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

iQoo Z9 5G India Launch : భారత్‌కు కొత్త ఐక్యూ ఫోన్ వచ్చేస్తోంది. ఐక్యూ z9 5జీ ఫోన్ వచ్చే నెలలో లాంచ్ కానుంది. రాబోయే ఫోన్ ఫీచర్లు, ధర వివరాలు రివీల్ అయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

iQoo Z9 5G India Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఐక్యూ నుంచి సరికొత్త ఫోన్ వచ్చేస్తోంది. భారత మార్కెట్లో వచ్చే నెలలో ఐక్యూ Z9 5జీ ఫోన్ లాంచ్ చేయడానికి రెడీగా ఉంది. వివో సబ్-బ్రాండ్ సోమవారం (ఫిబ్రవరి 26) కొత్త జెడ్-సిరీస్ స్మార్ట్‌ఫోన్ రాకను ధృవీకరించింది. అమెజాన్, ఐక్యూ ఇండియా వెబ్‌సైట్‌లో ప్రత్యేకమైన మైక్రోసైట్ ఐక్యూ జెడ్9 5జీ డిజైన్, కొన్ని స్పెసిఫికేషన్‌లను రిలీజ్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ఎస్ఓసీ ద్వారా అందిస్తుంది.

Read Also : Wet iPhone Rice : మీ ఐఫోన్ నీళ్లలో తడిసిందా? ఆరబెట్టేందుకు బియ్యంలో వేయవద్దు? యూజర్లకు ఆపిల్ హెచ్చరిక? ఎందుకంటే?

డ్యూయల్-రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఐక్యూ జెడ్9 5జీ ఫోన్ గత ఏడాదిలో ఐక్యూ జెడ్7 5జీకి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా వస్తోంది. మార్చి 12న భారత మార్కెట్లో ఐక్యూ జెడ్9 5జీ ఫోన్ లాంచ్ కానుందని ఐక్యూ ఇండియా సీఈఓ నిపున్ మరియా ట్విట్టర్ (X) వేదికగా ప్రకటించారు. అతి త్వరలో కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉండనుంది.

కెమెరా ఫీచర్లు (అంచనా) :
ఇప్పటికే, అమెజాన్ ది ఇ-కామర్స్ వెబ్‌సైట్, ఐక్యూ ఇండియా వెబ్‌సైట్ కొత్త జెడ్-సిరీస్ స్మార్ట్‌ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్‌లను రివీల్ చేసేందుకు వెబ్‌సైట్‌లలో స్పెషల్ ల్యాండింగ్ పేజీని క్రియేట్ చేశాయి. ఈ టీజర్‌లో హ్యాండ్‌సెట్‌లో గ్రీన్ ఫినిషింగ్, డ్యూయల్ రియర్ కెమెరాలు ఉన్నాయి.

ఐక్యూ జెడ్9 5జీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ఎస్ఓసీపై రన్ కానుంది. డైమెన్సిటీ 7200 చిప్‌సెట్‌తో కూడిన సెగ్మెంట్‌లో ఇదే ఫస్ట్ ఫోన్ అని ఐక్యూ పేర్కొంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌కు సపోర్టుతో హ్యాండ్‌సెట్‌లో సోనీ ఐఎంఎక్స్882 సెన్సార్ అమర్చినట్టు కంపెనీ ధృవీకరించింది. గతంలో ఐక్యూ జెడ్9 5జీ మోడల్ నంబర్ I2302తో గీక్‌బెంచ్‌లో కనిపించింది.

ధర ఎంత ఉండొచ్చుంటే? :
దీని ప్రకారం.. రాబోయే హ్యాండ్‌సెట్ సింగిల్-కోర్ పరీక్షలో 1,186 పాయింట్లు, మల్టీ-కోర్ పరీక్షలో 2,683 పాయింట్లు సాధించింది. లిస్టింగ్ హ్యాండ్‌సెట్‌లో 8జీబీ ర్యామ్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌ను సూచించింది. గత లీక్‌ల ప్రకారం.. ఐక్యూ జెడ్9 5జీ 1.5కె ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 6,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. దీని ధర రూ.25వేల లోపు ఉండవచ్చని అంచనా. ఐక్యూ జెడ్9 5జీ మోడల్ గత ఏడాది ఐక్యూ జెడ్7 5జీకి అప్‌గ్రేడ్ వస్తుందని భావిస్తున్నారు. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 18,999 మధ్య ఉండవచ్చు.

Read Also : iQOO Neo 9 Pro Launch : అద్భుతమైన ఫీచర్లతో ఐక్యూ నియో 9 ప్రో ఫోన్ వచ్చేసింది.. లాంచ్ ఆఫర్లు, భారత్‌‌లో ధర ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు