Oppo: ఒప్పో నుంచి కళ్లు చెదిరే ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్లు.. ఫుల్ డీటెయిల్స్‌

ఒప్పో ఈ సిరీస్‌లో గతంలో రెండు స్మార్ట్‌ఫోన్‌లను భారత్‌లో విడుదల చేసింది.

Oppo: ఒప్పో నుంచి కళ్లు చెదిరే ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్లు.. ఫుల్ డీటెయిల్స్‌

Updated On : March 31, 2025 / 2:58 PM IST

ఒప్పో నుంచి ఏప్రిల్‌ 10న ఫైండ్ X8 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్‌ కానున్నాయి. ఒప్పో ఫైండ్ X8 అల్ట్రా, ఫైండ్ X8s, ఫైండ్ X8+ మోడళ్లను విడదల చేయనున్నారు. మొదట చైనా మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేస్తున్నారు. ఈ ఫోన్‌లను ఇతర దేశాల మార్కెట్లలో లాంచ్ చేస్తారా? లేదా? అన్న విషయాలను ఆ కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

ఒప్పో ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు స్మార్ట్‌ఫోన్‌లను భారత్‌లో విడుదల చేసింది. ఫైండ్ X8, ఫైండ్ X8 ప్రో ఇప్పటికే భారత్‌లో ఉన్నాయి. ఇదే సిరీస్‌ నుంచి ఇప్పుడు కొత్తగా ఫైండ్ X8 అల్ట్రా, ఫైండ్ X8s, ఫైండ్ X8+ మోడళ్లు లాంచ్‌ కానున్నాయి. ఒప్పో భారత్‌లో ఇప్పటివరకు లాంచ్ చేసిన వాటిలో ఫైండ్ X8 స్మార్ట్‌ఫోన్‌లు యూజర్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.

Also Read: భారతీయ మార్కెట్లోకి గూగుల్‌ పిక్సెల్ 9ఏ.. డిస్కౌంట్‌లో కొనుక్కోండి.. “అబ్బా” అనేలా ఫీచర్లు 

ఫైండ్ X8 అల్ట్రా ఫొటోగ్రఫీ కోసం బాగా ఉపయోగపడుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫైండ్ X7 అల్ట్రా స్థానంలో వచ్చింది. X8 అల్ట్రా భారత్‌లోనూ విడుదల అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

లాంచ్ ఈవెంట్‌కు ముందే ఫైండ్ X8 అల్ట్రా, ఫైండ్ X8s, ఫైండ్ X8+ ఫొటోలు లీక్ అయ్యాయి. వీటి డిజైన్లు ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఫైండ్ X8, X8 PROను పోలి ఉన్నాయి. ఫైండ్ X8 అల్ట్రా, ఫైండ్ X8s, ఫైండ్ X8+ మూడింటికి ఒకే మినిమల్ బ్యాక్ ప్యానెల్ ఉంది.

అలాగే, రౌండ్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఫైండ్ X8 అల్ట్రా ఫైండ్ X8ను పోలి ఉంది. హాసెల్‌బ్లాడ్ బ్రాండింగ్‌తో అదే క్వాడ్-కెమెరా సెటప్ ఇందులో ఉంది. ఫోన్ వెనుక ప్యానెల్ లెఫ్ట్ కార్నర్‌లో ఫ్లాష్ కూడా ఉంది. ఈ కొత్త ఫోన్లు బ్లాక్‌, పింక్, వైట్‌ వేరియంట్లలో వస్తున్నట్లు లీక్‌ అయిన ఫొటోల ద్వారా తెలుస్తోంది.

ఇక Find X8s+ డిజైన్ పరంగా Find X8 Proను పోలి ఉంది. కెమెరా మాడ్యూల్ కూడా రెండు ఫోన్లలో ఒకేలా ఉన్నాయి. ఈ కొత్త ఫోన్ పర్పుల్, బ్లాక్, వైట్ వేరియంట్‌లలో వస్తుంది.

మరిన్ని ఫీచర్లు
ఒప్పో ఫైండ్ X8s ఐదు కాన్ఫిగరేషన్లలో (12GB + 256GB, 16GB + 256GB, 12GB + 512GB, 16GB + 512GB, 16GB + 1TB)లో వస్తుంది. ఇంతలో, ఇక ఒప్పో ఫైండ్ X8s+ 12GB + 256GB, 12GB + 512GB, 16GB + 512GB, 16GB + 1TB వంటి నాలుగు స్టోరేజ్ ఆప్షన్లతో రానుంది. ఒప్పో ఫైండ్ X8 అల్ట్రా క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో వస్తుంది. ఒప్పో ఫైండ్ X8s, ఫైండ్ X8s+ మాత్రం మీడియాటెక్ డైమెన్సిటీ 9400+ ప్రాసెసర్‌తో రావచ్చని తెలుస్తోంది.