భారతీయ మార్కెట్లోకి గూగుల్‌ పిక్సెల్ 9ఏ.. డిస్కౌంట్‌లో కొనుక్కోండి.. “అబ్బా” అనేలా ఫీచర్లు 

భారత్‌లో ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయిస్తున్నారు.

భారతీయ మార్కెట్లోకి గూగుల్‌ పిక్సెల్ 9ఏ.. డిస్కౌంట్‌లో కొనుక్కోండి.. “అబ్బా” అనేలా ఫీచర్లు 

Updated On : March 30, 2025 / 7:19 PM IST

భారతీయ మార్కెట్లోకి గూగుల్‌ పిక్సెల్ 9ఏ వచ్చేస్తోంది. ఇండియాలో ఏప్రిల్ 16 నుంచి దీన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు గూగుల్ అధికారికంగా ప్రకటించింది. రూ.3,000 బ్యాంక్ డిస్కౌంట్‌తో పాటు మరికొన్ని ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉండనున్నాయి.

పిక్సెల్ 9ఏ ధర
ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ నుంచి పిక్సెల్ 9ఏ కొనుక్కోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.49,999. లాంచ్ ఆఫర్ వేళ పలు బ్యాంక్ కార్డులపై రూ.3,000 వరకు తగ్గింపు ఉంటుంది. గూగుల్ పిక్సెల్ 9ఏని ఒకే వేరియంట్‌లో విడుదల చేశారు. ఇందులో 8GB RAM, 256GB స్టోరేజ్ ఉంటాయి. ఈ ఫోన్ అనేక దేశాల్లో అందుబాటులో ఉండనుంది. భారత్‌లో ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయిస్తున్నారు.

Also Read: దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ మృతి వెనుక “ఆ ఇండియన్ డ్రగ్”?: పోలీసు అధికారి సంచలనం

గూగుల్ పిక్సెల్ 9ఏ ఫీచర్లు
పిక్సెల్ 9ఏని ప్రీమియం ఫీచర్లతో గూగుల్ విడుదల చేసింది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.3-అంగుళాల FHD+ OLED డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో రానుంది. ఇది Google Tensor G4 చిప్‌సెట్‌తో వస్తుంది. టైటాన్ M2 సెక్యూరిటీ చిప్‌ ఇందులో ఉంది. ఆండ్రాయిడ్ 15 అవుట్ ఆఫ్ ది బాక్స్‌లో రన్ అవుతుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ ఏడేళ్ల OS అప్‌డేట్‌లతో వస్తుంది. 48MP ప్రైమరీ షూటర్, 13MP అల్ట్రావైడ్ షూటర్‌తో పాటు AI ఫొటోగ్రఫీతో దీన్ని తీసుకొచ్చారు. నైట్ మోడ్, రియల్ టోన్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5100mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. 23W ఫాస్ట్ ఛార్జింగ్‌ ఉంటుంది.

పిక్సెల్ 9ఏ లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడుస్తుంది. జెమిని ఏఐ, గూగుల్ అసిస్టెంట్‌ సహా గూగుల్ యొక్క ఏఐ బేస్డ్‌ ఫీచర్లతో ఇది వస్తుంది.