Jabra Elite 4 earbuds : బ్లూటూత్ మల్టీపాయింట్‌తో జాబ్రా ఎలైట్ 4 TWS ఇయర్‌బడ్స్.. భారత్‌లో ధర ఎంతంటే?

Jabra Elite 4 earbuds : కొత్త ఇయర్‌బడ్స్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో జాబ్రా కంపెనీ నుంచి కొత్త జాబ్రా లైట్ 4 TWS ఇయర్‌బడ్స్ వచ్చేసింది. ఎంట్రీ లెవల్ ఎలైట్ ఇయర్ బడ్స్ ధర ఎంత ఉందంటే?

Jabra Elite 4 earbuds : బ్లూటూత్ మల్టీపాయింట్‌తో జాబ్రా ఎలైట్ 4 TWS ఇయర్‌బడ్స్.. భారత్‌లో ధర ఎంతంటే?

Jabra Elite 4 TWS earbuds launched in India, price set at Rs 9,999

Updated On : April 15, 2023 / 8:12 PM IST

Jabra Elite 4 earbuds : ప్రముఖ ఆడియో బ్రాండ్ జాబ్రా (Jabra) నుంచి మరో TWS ఇయర్‌బడ్‌లను లాంచ్ చేసింది. కంపెనీ ఎలైట్ లైనప్‌లో సరికొత్తగా ఎలైట్ 4 TWS మోడల్ తీసుకొచ్చింది. జాబ్రా ఎలైట్ 4 రియల్ వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లతో ఎంట్రీ-లెవల్ ఎలైట్ 3 నుంచి వస్తుంది. సరసమైన ధరలో సరైన ధ్వని, సౌకర్యాన్ని అందించేలా రూపొందించారు. ధర విషయానికి వస్తే.. ఎలైట్ (Elite 4) ధర రూ. 9999లకు అందుబాటులో ఉంది. ఈ-కామర్స్ దిగ్గజాలైన (Amazon, Flipkart, Croma, Reliance, Jabra)తో సహా రిటైల్ స్టోర్లలలోనూ జాబ్రా ఎలైట్ 4 ఇయర్‌బడ్స్ అందుబాటులో ఉంది.

జాబ్రా ఎలైట్ 4 ఇయర్‌బడ్‌లు బ్లూటూత్ మల్టీపాయింట్‌తో వస్తాయి. ఎలాంటి అంతరాయం లేకుండా ఏకకాలంలో రెండు వేర్వేరు డివైజ్‌లను కనెక్ట్ చేసేందుకు అనుమతిస్తుంది. ఇయర్‌బడ్‌లు ఫాస్ట్ పెయిర్, స్విఫ్ట్ పెయిర్ టెక్నాలజీని కూడా కలిగి ఉంటాయి. మొబైల్ డివైజ్‌లు, ల్యాప్‌టాప్‌లు లేదా కంప్యూటర్‌లతో ఇయర్‌బడ్‌లను సులభంగా పెయిర్ చేయొచ్చు. అదనంగా, (Elite 4)లో ఫీడ్‌ఫార్వర్డ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC)తో వచ్చింది. అవాంఛిత సౌండ్ ఫిల్టర్ చేస్తుంది. ప్రత్యేకించి ప్రయాణాల్లో ఇయర్‌బడ్స్ ద్వారా ఎలాంటి అంతరాయం లేకుండా ఆడియో వినవచ్చు.

Jabra Elite 4 TWS earbuds launched in India, price set at Rs 9,999

Jabra Elite 4 earbuds launched in India, price set at Rs 9,999

Read Also : iPhone 13 Flipkart Offer : బ్యాంకు ఆఫర్లతో పనిలేదు.. ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకే ఐఫోన్ 13 సొంతం చేసుకోండి!

ఇయర్‌బడ్‌లు 4-మైక్రోఫోన్ కాల్ టెక్నాలజీతో పాటు 6mm స్పీకర్‌లతో క్రిస్టల్-క్లియర్ సౌండ్‌ను అందించాయి. ఇయర్‌బడ్స్ యూజర్లు బిగ్గరగా, స్పష్టంగా వినబడుతున్నాయని నిర్ధారిస్తుంది. జాబ్రా మ్యూజిక్ ఈక్వలైజర్, సౌండ్+ యాప్ యూజర్లకు వారి వ్యక్తిగత ఇష్టాలకు తగినట్టుగా సౌండ్‌ని కస్టమైజ్ చేసుకునేందుకు అనుమతిస్తాయి. Elite 4 ఇయర్‌బడ్‌లు డానిష్ ఎర్గోనామిక్ అకౌస్టిక్ ఇంజనీరింగ్‌తో రోజంతా ధరించేలా సౌకర్యవంతంగా ఉంటాయి. అంతేకాదు.. డెస్ట్, వాటర్‌కు IP55 రేటింగ్‌ను అందించే ప్రీమియం మన్నికైన పదార్థాలతో రూపొందించింది.

డార్క్ గ్రే, నేవీ, లిలక్, లేత గోధుమరంగు వంటి నాలుగు క్లాసిక్ రంగులలో వస్తుంది. లేటెస్ట్ జాబ్రా ఎలైట్ 4 మోడల్ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఉంటుంది. అంతరాయాలు లేకుండా కాల్‌లు కనెక్ట్ చేసేందుకు వీలు కల్పిస్తుంది. Elite 4 ఇయర్‌బడ్‌లు ఒకే ఛార్జ్‌పై 5.5 గంటల ప్లేటైమ్‌ను అందిస్తాయి. పవర్‌ఫుల్ కేస్‌తో 22 గంటల వరకు (ANC ఆఫ్‌తో 28 గంటలు) వస్తాయి. మోడ్రాన్ ఇయర్‌బడ్స్ యూజర్లకు అనువైనవిగా ఉండేలా ఫీచర్లు, డిజైన్‌తో సరసమైన ధరల్లో అందుబాటులో ఉన్నాయి.

Read Also : Mi Band 8 Launch : ఏప్రిల్ 18న షావోమీ MI బ్యాండ్ 8, షావోమీ 13 Ultra ఫోన్ వచ్చేస్తోంది.. ధర ఎంతంటే?