జియో బంపర్ ఆఫర్ : 100 నిమిషాల కాల్స్, 100 ఉచిత SMSలు

  • Published By: Mahesh ,Published On : April 28, 2020 / 10:11 AM IST
జియో బంపర్ ఆఫర్ : 100 నిమిషాల కాల్స్, 100 ఉచిత SMSలు

Updated On : April 28, 2020 / 10:11 AM IST

జియోఫోన్ యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో రిటైల్ స్టోర్లన్నీ మూతపడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో జియో యూజర్లు తమ నెంబర్లపై రీఛార్జ్ చేసుకోలేని పరిస్థితి. అందుకే యూజర్ల కోసం రిలయన్స్ జియో కొత్త ఆఫర్ ప్రవేశపెట్టింది.

ఏప్రిల్ 17, 2020 వరకు జియోఫోన్ యూజర్లు 100 నిమిషాల ఔట్ గోయింగ్ వాయిస్ కాల్స్, 100 ఉచిత SMSలు పొందవచ్చు. అంతేకాదు.. జియో ఫోన్ యూజర్ల వ్యాలిడిటీ కూడా పొడిగించడంతో ఇన్ కమింగ్ కాల్స్ పొందవచ్చు. జియో ఫోన్లకు రీఛార్జ్ చేయలేని యూజర్ల కోసం కంపెనీ ఈ ఆఫర్ తీసుకొచ్చింది.

అంతేకాదు.. ఈ రీఛార్జ్ ఆఫర్ పొందాలంటే రిటైల్ స్టోర్ కు వెళ్లాల్సిన పనిలేదు. డిజిటల్ పేమెంట్స్ UPI, ATM, SMS, Call ప్రత్యామ్నాయ ఛానళ్ల ద్వారా సులభంగా రీఛార్జ్ చేసుకోవచ్చు. అంతేకాదు.. జియో యూజర్ల కోసం ఎంపిక చేసిన బ్యాంకుల్లో నంచి రీఛార్జ్ చేసుకునే సౌకర్యాన్ని కూడా ప్రకటించింది.

 

అందులో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, యాక్సస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకు, సిటీ బ్యాంకు, డీసీబీ బ్యాంకు, ఎయూఎఫ్ బ్యాంకు, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకులు ఉన్నాయి.