Jio Airtel Offers : ఎయిర్‌టెల్, జియో చీపెస్ట్ ప్లాన్లు.. అన్‌లిమిటెడ్ కాలింగ్, 28 రోజుల వ్యాలిడిటీ, 2GB హైస్పీడ్ డేటా.. మరెన్నో OTT బెనిఫిట్స్..!
Jio Airtel Offers : జియో, ఎయిర్‌టెల్ యూజర్ల కోసం అద్భుతమైన ప్లాన్లు ఉన్నాయి. ఈ ప్లాన్లలో రూ.189, రూ. 199కే అనేక బెనిఫిట్స్ అందిస్తున్నాయి.

Airtel vs Jio
Jio Airtel Offers : ఎయిర్‌టెల్, జియో యూజర్లకు గుడ్ న్యూస్.. అతి చౌకైన ధరకే అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి. ఈ రీఛార్జ్ ప్లాన్‌లతో (Jio Airtel Offers) వినియోగదారులు అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటాతో సహా అనేక బెనిఫిట్స్ అందిస్తాయి.
రిలయన్స్ జియో ఇటీవలే అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. కేవలం రూ. 189కే ప్రీపెయిడ్ ప్లాన్ అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా వంటి బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. రూ. 200 కన్నా తక్కువ ధరలో ఎయిర్‌టెల్, వొడాఫోన్ ప్లాన్‌లకు పోటీదారుగా నిలిచింది.
జియో రూ.189 ప్లాన్ :
రిలయన్స్ జియో వెబ్‌సైట్ ప్రకారం.. రూ.189 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్, ఫ్రీ నేషనల్ రోమింగ్ ఉన్నాయి. ఆసక్తిగల వినియోగదారులు మొత్తం 2GB హై-స్పీడ్ డేటా, 300 ఫ్రీ SMS బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. జియో ఇతర రీఛార్జ్ ప్లాన్ల మాదిరిగానే ఎంపిక చేసిన OTT యాప్‌లకు యాక్సెస్ అందిస్తుంది. ప్రత్యేకంగా, వినియోగదారులు జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్‌ను పొందవచ్చు.
ఎయిర్‌టెల్ రూ.199 ప్లాన్ :
ఎయిర్‌టెల్ ప్లాన్ ధర రూ.199 ద్వారా 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ కాలింగ్, ఫ్రీ నేషనల్ రోమింగ్, 2GB డేటాను అందిస్తుంది. సెకండరీ సిమ్‌గా వాడేవారికి ఫోన్ కాలింగ్‌తో పాటు డేటాను పొందవచ్చు. 300 ఫ్రీ SMS కూడా ఉన్నాయి. అదనంగా, ఎయిర్‌టెల్ యూజర్లు రూ.17,500 విలువైన పర్‌ప్లెక్సిటీ AIకి సభ్యత్వాన్ని పొందవచ్చు. ఎయిర్‌టెల్ రూ.195 ధరకు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ప్రవేశపెట్టింది.
ఈ రీఛార్జ్ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో 15GB డేటాను అందిస్తుంది. రూ.149 విలువైన జియోహాట్‌స్టార్ మొబైల్‌కు 90 రోజుల సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తుంది. కేవలం 4G డేటా మాత్రమే. భారతీ ఎయిర్‌టెల్ యూజర్ల కోసం డేటా వోచర్‌ను కూడా అందిస్తుంది. రూ. 195 ప్లాన్ ఎయిర్‌టెల్ వెబ్‌సైట్‌లో లేదా ఎయిర్‌టెల్ థాంక్స్, మొబైల్ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.