Reliance Jio : జియో అద్భుతమైన ఆఫర్.. జియోహాట్‌స్టార్ 90 రోజులు ఫ్రీ సబ్‌స్క్రిప్షన్.. వీరికి మాత్రమే.. డోంట్ మిస్!
Reliance Jio : జియో 5G యూజర్ల కోసం 90 రోజుల పాటు జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. ఈ ఆఫర్‌ను ఎలా పొందాలంటే?

Reliance Jio
Reliance Jio : రిలయన్స్ జియో యూజర్లకు గుడ్ న్యూస్.. ఇప్పుడు అన్‌లిమిటెడ్ 5G బెనిఫిట్స్ పొందవచ్చు. జియో 5G యూజర్లందరికి జియోహాట్‌స్టార్ (Reliance Jio) ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ అందిస్తోంది. చాలా మంది వినియోగదారులు తమ ప్రస్తుత రీఛార్జ్ ప్లాన్‌తో ఈ OTT బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ ఆఫర్ ఏంటి? బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి? ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
రిలయన్స్ జియో ఇటీవలే హాట్‌స్టార్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. గతంలో పాపులర్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ డిస్నీ+హాట్‌స్టార్ ఇప్పుడు జియోహాట్‌స్టార్‌గా మారింది. అనేక రీఛార్జ్ ప్లాన్‌లతో సబ్‌స్క్రిప్షన్ ఫ్రీగా అందిస్తోంది. కంపెనీ తమ 5G యూజర్లందరికి 90 రోజుల ఫ్రీ జియోహాట్‌స్టార్ మొబైల్/టీవీ యాక్సెస్ ఇస్తామని ప్రకటించింది.
ఈ యూజర్లకు జియోహాట్‌స్టార్ ఉచితం :
కనీసం 2GB రోజువారీ డేటాతో ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకోవచ్చు. జియో యూజర్లు అన్‌లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు. ఈ 5G యూజర్లు 90 రోజుల పాటు జియోహాట్‌స్టార్‌కు యాక్సెస్ పొందవచ్చు. మీరు ఇప్పటికే ఈ బెనిఫిట్ పొంది ఉంటే OTT యాక్సెస్ పొందలేరు. కానీ, రాబోయే 90 రోజుల పాటు జియోహాట్‌స్టార్ కంటెంట్‌ను ఉచితంగా పొందవచ్చు.
జియోహాట్‌స్టార్ ఫ్రీగా ఇలా పొందండి (Reliance Jio) :
- మీరు JioHotstar యాప్‌ను డౌన్‌లోడ్ చేయాలి. లేదంటే వెబ్‌సైట్‌ను విజిట్ చేయాలి.
- అన్‌లిమిటెడ్ 5G కోసం అదే నంబర్‌తో లాగిన్ అవ్వాలి.
- మీరు నంబర్‌కు వచ్చిన OTP ఎంటర్ చేయాలి.
- జియోహాట్‌స్టార్ ఈజీగా లాగిన్ యాక్సస్ పొందవచ్చు.
- 90 రోజుల పాటు వీడియో కంటెంట్ ఫ్రీగా చూడవచ్చు.
అంతేకాదు.. జియో హాట్‌స్టార్ మొబైల్/టీవీ సబ్‌స్క్రిప్షన్ కూడా పొందవచ్చు. మొబైల్ డివైజ్‌లతో పాటు స్మార్ట్ టీవీ, ల్యాప్‌టాప్ స్క్రీన్‌లలో కూడా ఫ్రీ స్ట్రీమింగ్ యాక్సస్ చేయొచ్చు. ఈ బెనిఫిట్స్ లిమిటెడ్ టైమ్ వరకు మాత్రమేనని గమనించాలి. వీలైనంత త్వరగా మీ నంబర్‌తో లాగిన్ అయి సబ్‌స్క్రిప్షన్‌ను యాక్టివేట్ చేసుకోండి.