బీటా టెస్ట్ సక్సెస్ : 16 వందల సిటీల్లో జియో గిగాఫైబర్ సర్వీసు

ప్రముఖ డేటా నెట్ వర్క్ సంచలనం రిలయన్స్ జియో ‘గిగాఫైబర్’ బ్రాడ్ బ్యాండ్ (FTTH) సర్వీసును ప్రవేశపెడుతోంది. దేశవ్యాప్తంగా 16 వందల నగరాల్లో త్వరలో జియోఫైబర్ సర్వీసును లాంచ్ చేయనుంది.

  • Published By: sreehari ,Published On : April 20, 2019 / 12:22 PM IST
బీటా టెస్ట్ సక్సెస్ : 16 వందల సిటీల్లో జియో గిగాఫైబర్ సర్వీసు

Updated On : April 20, 2019 / 12:22 PM IST

ప్రముఖ డేటా నెట్ వర్క్ సంచలనం రిలయన్స్ జియో ‘గిగాఫైబర్’ బ్రాడ్ బ్యాండ్ (FTTH) సర్వీసును ప్రవేశపెడుతోంది. దేశవ్యాప్తంగా 16 వందల నగరాల్లో త్వరలో జియోఫైబర్ సర్వీసును లాంచ్ చేయనుంది.

ప్రముఖ డేటా నెట్ వర్క్ సంచలనం రిలయన్స్ జియో ‘గిగాఫైబర్’ బ్రాడ్ బ్యాండ్ (FTTH) సర్వీసును ప్రవేశపెడుతోంది. దేశవ్యాప్తంగా 16 వందల నగరాల్లో త్వరలో జియో GigaFiber సర్వీసును లాంచ్ చేయనుంది. రిలయన్స్ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రస్తుతం గిగాఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసుకు సంబంధించి ఎంపిక చేసిన నగరాల్లో బీటా టెస్టింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తి అయింది.

త్వరలో జియో GigaFiber సర్వీసు, డేటా రీఛార్జ్ ప్లాన్లను ధరలను కంపెనీ అధికారికంగా లాంచ్ చేయనుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా రిలయన్స్ జియో డేటా సర్వీసుతో మొబైల్ డేటా నెట్ వర్క్ లో విజయవంతంగా దూసుకెళ్తోంది. ఇప్పుడు జియో.. ఇండియాలో గిగాఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసును అందుబాటులోకి తీసుకొస్తోంది. గిగాఫైబర్ సర్వీసుల్లో హోం బ్రాడ్ బ్యాండ్, ఎంటర్ టైన్ మెంట్, స్మార్ట్ హోం సొల్యుషన్స్, వైర్ లైన్ అండ్ ఎంటర్ ప్రైస్ అందించనుంది. 
Also Read : కంప్లయింట్ ఫైల్ : మూవీ టికెట్లపై Paytm అదనపు ఛార్జీలు

ఇండియాలోని హోం అండ్ ఎంటర్ ప్రైజ్ కనెక్టవిటీ మార్కెట్లో రాబోయే తరానికి FTTX సర్వీసులను అంతర్జాతీయ ప్రమాణాలతో తీసుకురానున్నట్టు అంబానీ తెలిపారు. జియో మొబిలిటీ సర్వీసులతో పాటు GigaFiber ఫిక్స్ డ్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసులను సంబంధిత టెక్నాలజీ ప్లాట్ ఫాంల సాయంతో వినియోగదారులందరికి అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందకెళ్తున్నట్టు అంబానీ చెప్పారు.  

ట్రిపుల్ ప్లే ప్లాన్ టెస్టింగ్ :
గిగా ఫైబర్ FTTH సర్వీసు కోసం రిలయన్స్ జియో కొత్త ట్రిపుల్ ప్లే ప్లాన్ ను టెస్టు చేస్తోంది. ఈ సింగిల్ ట్రిపుల్ ప్లే ప్లాన్ పై 28 రోజుల వ్యాలిడెటీతో 100GB డేటాను 100Mbps స్పీడ్ తో పొందవచ్చు. అదనంగా ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, Jio హోం టీవీ, జియో యాప్ ష్యూట్ కు సబ్ స్ర్కిప్షన్ చేసుకోవచ్చు. ఈ ట్రిపుల్ ప్లే ప్లాన్ ధర ఎంతో జియో అధికారికంగా ప్రకటించనప్పటికీ.. రూ. 500 వరకు ఉండే అవకాశం ఉంటుందని అంచనా. జియో.. గిగా ఫైబర్ సర్వీసుతో పాటు హై స్పీడ్ డ్యుయల్ బ్యాండ్ వై-ఫై రూటర్ ఆఫర్ చేస్తోంది. ఈ రూటర్.. అన్ని డివైజ్ లకు సపోర్ట్ చేస్తుంది. 5GHz బ్యాండ్ విడ్త్ తో మోడ్రాన్ డివైజ్ లకు ఫాస్ట్ డేటాను కనెక్ట్ చేసుకోవచ్చు.  

గిగాఫైబర్ సర్వీసును 2018 ఏడాది ఆగస్టులోనే Reliance Jio లాంచ్ చేసింది. అప్పటి నుంచి టెస్టింగ్ ప్రాసెస్ కొనసాగుతూనే ఉంది. గిగాఫైబర్ సర్వీసును ప్రివ్యూ ఆఫర్ కింద పబ్లిక్ కు ఆఫర్ చేసింది. ఈ ఆఫర్ కింద వినియోగదారులు రూ.4వేల 500 సెక్యూరిటీ డిపాజిట్ చేస్తే.. 100Mbps డేటా స్పీడ్ తో 100GB డేటా పొందవచ్చు. ఈ ఆఫర్ వినియోగదారుల కోసం ఇంకా అందుబాటులోనే ఉంది.. గిగాఫైబర్ అధికారికంగా ఇండియాలో లాంచ్ అయ్యేవరకు ఈ ఆఫర్ ఉచితంగా వినియోగించుకోవచ్చు.