కమింగ్ సూన్ : 100GBతో.. జియో ట్రిపుల్ ప్లే ప్లాన్!
డేటా నెట్ వర్క్ సంచలనం రిలయన్స్ జియో.. తమ యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడూ కొత్త ప్లాన్లతో ఊరిస్తోంది. జియో మొబైల్ డేటా నెట్ వర్క్, గిగాఫైబర్ డేటా నెట్ వర్క్ సర్వీసులతో యూజర్లను మరో నెట్ వర్క్ కు మారకుండా కట్టిపడేస్తోంది.

డేటా నెట్ వర్క్ సంచలనం రిలయన్స్ జియో.. తమ యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడూ కొత్త ప్లాన్లతో ఊరిస్తోంది. జియో మొబైల్ డేటా నెట్ వర్క్, గిగాఫైబర్ డేటా నెట్ వర్క్ సర్వీసులతో యూజర్లను మరో నెట్ వర్క్ కు మారకుండా కట్టిపడేస్తోంది.
రిలయన్స్ జియో.. తమ యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడూ కొత్త ప్లాన్లతో ఊరిస్తోంది. జియో మొబైల్ డేటా నెట్ వర్క్, గిగాఫైబర్ డేటా నెట్ వర్క్ సర్వీసులతో యూజర్లను మరో నెట్ వర్క్ కు మారకుండా కట్టిపడేస్తోంది. ఇప్పటికే ఎన్నో ఆఫర్లు, డేటా బెనిఫెట్స్ అందిస్తున్న రిలయన్స్ జియో.. గిగాఫైబర్ యూజర్లకు కూడా అదిరిపోయే డేటా ప్లాన్లను తీసుకొస్తోంది. అదే.. ట్రిపుల్ ప్లే ప్లాన్. ఈ ప్లాన్ ను జియో యూజర్లు.. గిగాఫైబర్, జియో హోం టీవీ, జియో యాప్స్ యాక్సస్ చేసుకోవచ్చు. ఒకే నెల ప్యాకేజీపై ప్లాన్ బండెల్ ను యూజర్లు పొందొచ్చు.
ప్లాన్ టెస్టింగ్ రన్.. త్వరలో అందరికి :
ఈ ట్రిపుల్ ప్లే ప్లాన్ టెస్టింగ్ దశలో ఉంది. జియో తమ గిగాఫైబర్ టెస్ట్ రన్ చేయిస్తోంది. త్వరలో ఈ ప్లాన్ ను గిగాఫైబర్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే గిగాఫైబర్ డేటా సర్వీసు కనెక్షన్లను దేశవ్యాప్తంగా ప్రాంతాలవారీగా అందిస్తోంది. అయితే.. జియో కంపెనీ.. ప్రస్తుతం గిగాఫైబర్ యూజర్లకు ప్రివ్యూ ఆఫర్ మాత్రమే అందిస్తుండగా.. అధికారిక ప్లాన్లను ఇంతవరకూ ప్రకటించలేదు.
Read Also : డెడ్‌లైన్.. 4 రోజులే : పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేశారా?
అందిన నివేదిక ప్రకారం.. టెలికం టాక్, రిలయన్స్ జియో.. ట్రిపుల్ ప్లే ప్లాన్ పై తమ ఎంప్లాయిస్ తో టెస్ట్ రన్ చేస్తోంది. ఈ ప్లాన్ ను గిగాఫైబర్ అకౌంట్ డ్యాష్ బోర్డుపై చూడవచ్చు. ప్రస్తుతానికి కంపెనీ.. సింగిల్ ట్రిపుల్ ప్లే ప్లాన్ మాత్రమే ప్రవేశపెట్టనుంది. ఈ ప్లాన్ పై అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 100జీబీ వరకు డేటా పొందొచ్చు. దీని వ్యాలిడెటీ 28 రోజులు. ట్రిపుల్ ప్లే ప్లాన్ ద్వారా జియో హోం టీవీ, జియో యాప్స్ ను యాక్సస్ చేసుకోవచ్చు. టెస్టింగ్ దశలో ఉన్న ట్రిపుల్ ప్లే ప్లాన్ కు ఎలాంటి చార్జెస్ లేవు.
అదనంగా వెయ్యి GB డేటా :
సాధారణ యూజర్లు ఈ ప్లాన్ ను 100జీబీ డేటాను 30రోజుల వ్యాలిడెటీతో 1000 Mbps స్పీడ్ పొందవచ్చు. అంతేకాదు.. అదనంగా 1000GB జీబీ బోనస్ డేటాను (40GB)గా విభజించి అందించనుంది. 2018 ఆగస్టు 15న జియో గిగా ఫైబర్ కనెక్షన్ రిజిస్ట్రేషన్ మొదలైంది. ఈ రిజిస్టేషన్ ప్రక్రియకు యూజర్లు.. ముందుగా రూ.4వేల 500 (జియో గిగాఫైబర్ రూటర్, జియో IPTV రూటర్ ) పొందవచ్చు. ప్రీవ్యూ ఆపర్ కింద.. నెలకు 100జీబీ డేటాను 100ఎంబీపీస్ స్పీడ్ పై మూడునెలలు ఉచితంగా అందిస్తోంది. జియో ట్రిపుల్ ప్లే ప్లాన్ అందుబాటులోకి వస్తే.. ప్లాన్ ప్రారంభ ధరలు రూ.500, రూ.750, రూ.999, రూ.1,299, రూ.1,500 ఉండే అవకాశాలు ఉన్నాయని నివేదిక సూచిస్తోంది. దీనిపై జియో నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
జియో Home TV సర్వీసు ప్రత్యేకం :
ట్రిపుల్ ప్లే ప్లాన్ లో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. జియో హోం టీవీ సర్వీసు. ఈ సర్వీసును.. రిలయన్స్ జియో.. GigaTV సర్వీసును రీబ్రాండ్ చేస్తుందా అనిపించేలా ఉంది. జియో గిగాఫైబర్ సర్వీసు ప్రస్తుతం ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. వీరితోనే ట్రిపుల్ ప్లే ప్లాన్ తో టెస్టింగ్ జరుపుతోంది. ఈ ప్లాన్ ను రిలయన్స్ జియో.. అధికారికంగా యూజర్ల అందరికి అందుబాటులోకి తీసుకొచ్చే వరకు ఎదురుచూడాల్సిందే.
Read Also : Google Mapsలో కొత్త ఆప్షన్: ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే