JioFiber : జియోఫైబర్ యూజర్లకు పండగే.. ఈ చీపెస్ట్ ప్లాన్‌తో ఫ్రీ OTT, అన్‌లిమిటెడ్ Wi-Fi సర్వీసులు.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!
JioFiber : ఈ జియో ప్యాకేజీతో ఫ్రీ OTT, అన్‌లిమిటెడ్ వై-ఫై సర్వీసులను పొందవచ్చు. జియో యూజర్లు బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులతో మరెన్నో బెనిఫిట్స్ పొందవచ్చు.

JioFiber
JioFiber : జియోఫైబర్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. దేశీ అతిపెద్ద టెలికం టెలికాం ప్రొవైడర్ రిలయన్స్ జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్‌లో (JioFiber) దూసుకుపోతోంది. జియోఫైబర్ ఇప్పుడు మిలియన్ల మంది వినియోగదారులతో దేశంలోనే అతిపెద్ద ఫిక్స్‌డ్ లైన్ ఇంటర్నెట్ సర్వీస్‌గా అవతరించింది.
మీరు జియోఫైబర్‌ను ఉపయోగిస్తుంటే ఇది మీకోసమే.. OTT యాప్స్ యాక్సెస్ అందించే అద్భుతమైన ప్లాన్ అందుబాటులో ఉంది. జియో రూ. 599 బ్రాడ్‌బ్యాండ్ ప్యాకేజీతో ఓటీటీ కంటెంట్ స్ట్రీమింగ్ చేయొచ్చు.
జియో అందించే మరో బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ కూడా ఉంది. నెలకు ధర రూ.399+ టాక్స్‌తో పొందవచ్చు. ఈ ప్లాన్ ద్వారా ప్రతి నెలా 3.3TB డేటా, 30Mbps స్పీడ్ పొందవచ్చు. ఏదైనా OTT యాప్‌లకు యాక్సెస్ పొందలేరు. బ్రౌజింగ్, వర్క్ ఫ్రమ్ హోం లేదా ఆన్‌లైన్ క్లాసులకు మాత్రమే ఇంటర్నెట్‌ను వాడే యూజర్లకు బెస్ట్ ప్లాన్ అని చెప్పొచ్చు.
జియో రూ.599 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ :
జియో రూ. 599 (+ టాక్స్) ప్యాకేజీతో 3.3TB డేటాను (ఫైబర్ కనెక్షన్), 30Mbps స్పీడ్ అందిస్తుంది. మీ ప్రాంతంలో ఫైబర్ అందుబాటులో లేకపోతే జియో ఎయిర్ ఫైబర్ ద్వారా 5G నెట్‌వర్క్‌లో హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను అందిస్తుంది. ఈ సర్వీసుకు దాదాపు 1TB డేటా వస్తుంది.
ఈ ప్లాన్ ద్వారా బెనిఫిట్స్ ఏమిటంటే.. అదనపు ఖర్చు లేకుండా అనేక OTT సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. SonyLIV, ZEE5, SunNXT, Hoichoi, ALTBalaji, Discovery+, Eros Now, Lionsgate Play, ShemarooMe, ETV Win, JioCinema (JioHotstar) ఈ యాప్‌లతో యాక్సస్ చేయొచ్చు.
ఈ ప్యాకేజీతో వినియోగదారులు ఆన్-డిమాండ్ లైవ్ టీవీ ఛానెల్‌లను యాక్సెస్ చేయొచ్చు. 6 నెలలు లేదా 12 నెలల పాటు ఎంజాయ్ చేయొచ్చు. జియో ఇన్‌స్టాలేషన్ ఫీజులు, డివైజ్ ఖర్చులపై ఎక్స్ టెండెడ్ వ్యాలిడిటీతో డిస్కౌంట్లను కూడా పొందవచ్చు. స్పీడ్ ఇంటర్నెట్ అవసరమయ్యే యూజర్లు మరిన్ని ప్లాన్‌లను కూడా ఎంచుకోవచ్చు.