Jio OTT Plans : పండగ చేస్కోండి.. జియో చీపెస్ట్ 5 డేటా ప్లాన్స్.. జియోహాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జీ5 ఆల్ ఫ్రీ..!

Jio OTT Plans : జియో తమ యూజర్ల కోసం OTT సబ్‌స్క్రిప్షన్‌ల (జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జీ5)ను ఉచితంగా అందిస్తోంది.

Jio OTT Plans : పండగ చేస్కోండి.. జియో చీపెస్ట్ 5 డేటా ప్లాన్స్.. జియోహాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జీ5 ఆల్ ఫ్రీ..!

Jio OTT Plans

Updated On : August 2, 2025 / 11:10 AM IST

Jio OTT Plans : జియో యూజర్లకు అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.. ఇంటర్నెట్ డేటాతో పాటు అనేక OTT బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. ప్రస్తుత రోజుల్లో కేవలం (Jio OTT Plans) వాయిస్ కాల్స్ మాత్రమే కాకుండా డేటా ప్లాన్లు, ఓటీటీ ప్లాన్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది.

మొబైల్ యాప్స్ వినియోగం పెరుగుతున్న కొద్దీ బెస్ట్ డేటా ప్లాన్‌ల అవసరం పెరిగిపోయింది. వినియోగదారులను ఆకర్షించేందుకు టెలికం కంపెనీలు ఇదే తరహా రీఛార్జ్ ప్లాన్లను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నాయి. డేటా ప్లాన్లను అందించడంలో అన్నింటి కన్నా జియో ముందంజలో ఉంటుంది.

హై-స్పీడ్ ఇంటర్నెట్‌‌తో పాటు జియో ఫ్రీ OTT సబ్‌స్క్రిప్షన్‌లను కూడా ఉచితంగా అందిస్తోంది. జియో అందించే OTT ప్లాట్‌ఫామ్‌లలో జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, సోనీ లివ్ వంటి మరెన్నో ఉన్నాయి. ఈ డేటా ప్లాన్‌లు రూ. 100 నుంచి ఉన్నాయి. ఫ్రీ OTT సబ్‌స్క్రిప్షన్‌లతో డేటా ప్లాన్ల కోసం చూసే యూజర్ల కోసం జియో కొన్ని అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. అవేంటో ఓసారి లుక్కేయండి..

రూ.100 ప్లాన్ :
జియో అందించే అత్యంత సరసమైన డేటా ప్లాన్. ఉచిత OTT సబ్‌స్క్రిప్షన్ కూడా పొందవచ్చు. వినియోగదారునికి 90 రోజుల పాటు మొత్తం 5GB డేటాను అందిస్తుంది. 5G డేటా కూడా పొందవచ్చు. ఈ రీఛార్జ్ ప్లాన్ జియోహాట్‌స్టార్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ కూడా అందిస్తుంది.

రూ. 445 ప్లాన్ :
ఈ జియో రీఛార్జ్ ప్లాన్ యూజర్లకు అత్యధిక సంఖ్యలో OTT ప్లాట్‌ఫామ్‌లను అందిస్తుంది. రూ. 445 ధరతో 28 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2GB డేటాను పొందవచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMS బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.

Read Also : Airtel Plans : ఎయిర్‌టెల్ సూపర్ ప్లాన్.. జస్ట్ రూ. 1 ఎక్స్‌ట్రా చెల్లిస్తే 14GB డేటా.. 28 రోజుల వ్యాలిడిటీ, జియోహాట్‌‌స్టార్ కూడా..!

అదనంగా, ఈ ప్లాన్ 9 కన్నా ఎక్కువ OTT సబ్‌స్క్రిప్షన్‌లను కూడా అందిస్తుంది. సోనీ లివ్, G5, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ+, ఫ్యాన్ కోడ్, సన్ NXT, ప్లానెట్ మరాఠీ, కాంచా లంక, హోయిచోయ్, చౌపాల్ ఉన్నాయి. ఇందులో జియో టీవీ, జియో ఏఐక్లౌడ్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్లు కూడా పొందవచ్చు.

రూ.1029 ప్లాన్ :
ఈ ప్లాన్ ఫ్రీ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ రోజుకు 2GB డేటాతో వస్తుంది. 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMS బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. జియో అందించే ఆఫర్లలో ఉచితంగా జియో టీవీ, AI క్లౌడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ కూడా అందిస్తోంది.

రూ. 1049 ప్లాన్ :
ఈ జియో ప్లాన్ ద్వారా సోనీ లివ్, జీ5 రెండు OTT సబ్‌స్క్రిప్షన్లు ఫ్రీగా పొందవచ్చు. రోజుకు 2 GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్‌తో 84 రోజుల పాటు వ్యాలిడిటీ అందిస్తుంది. ఇదో అద్భుతమైన డీల్‌ అని చెప్పొచ్చు. ఇందులో ఫ్రీ జియో టీవీ, AI క్లౌడ్ కూడా ఫ్రీగా పొందవచ్చు.

రూ.1299 ప్లాన్ :
ఈ ప్లాన్ ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ కూడా అందిస్తుంది. ఈ ప్లాన్‌లో రోజుకు 2GB డేటా, 84 రోజుల వరకు వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ పూర్తయ్యే వరకు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMS పొందవచ్చు. ఫ్రీ జియో టీవీ, AI క్లౌడ్ యాక్సస్ కూడా అందిస్తుంది.