Kia India: ఇండియాలో అత్యంత వేగంగా 3లక్షల కియా కార్ల సేల్స్

కియా ఇండియా మరో మైలురాయిని చేరుకుంది. అత్యంత వేగంగా అంటే రెండేళ్ల కాలంలోనే 3లక్షల యూనిట్లు అమ్మకాలు జరపగలిగింది. ఇండియాలో అతి తక్కువ కాలంలో ఇన్ని ఎక్కువ ప్రొడక్ట్‌లు అమ్మిన బ్రాండ్ ఇదే.

Kia India: ఇండియాలో అత్యంత వేగంగా 3లక్షల కియా కార్ల సేల్స్

Kia Sales

Updated On : August 7, 2021 / 5:13 PM IST

Kia India: కియా ఇండియా మరో మైలురాయిని చేరుకుంది. అత్యంత వేగంగా అంటే రెండేళ్ల కాలంలోనే 3లక్షల యూనిట్లు అమ్మకాలు జరపగలిగింది. ఇండియాలో అతి తక్కువ కాలంలో ఇన్ని ఎక్కువ ప్రొడక్ట్‌లు అమ్మిన బ్రాండ్ ఇదే.

జులై 2020 నాటికే మొదటి లక్ష యూనిట్లు అమ్మగలిగింది కియా. జనవరి 2021 కల్లా రెండు లక్ష యూనిట్లు అమ్మేసి ఆగష్టులోనే మూడో లక్ష కార్లను అమ్మగలిగింది. సంవత్సరంలో లక్ష కార్లను అమ్మిన కియా.. రెండో సంవత్సరంలో రెండు లక్షల కార్లను సేల్ చేసింది. 3లక్షల్లో చివరి కారు అనంతపురంలో కొనుగోలు చేసిన సెల్టోస్ (Seltos).

ఇండియన్ మార్కెట్ లో సెల్టోస్ మోడల్ తో బోలెడు అమ్మకాలు జరిపింది కియా. మొత్తం బ్రాండ్ అమ్మకాల్లో దీనివే 66శాతం ఉన్నాయి. స్మాలర్ సోనెట్ Sonet 32శాతం అమ్ముడుపోయింది. ఈ మ్యాన్యుఫ్యాక్చర్ల నుంచి వచ్చిన కార్నివాల్ ఎంపీవీ Carnival MPV ఇండిచాలె 7వేల 310 యూనిట్లను అమ్మగలిగింది.

ప్రస్తుతం ఉన్న వ్యాపారాన్ని విస్తరిస్తూ.. 300 నుంచి 360 టచ్ పాయింట్లకు పెంచాలని కియా ప్లాన్ చేస్తుంది. ఫలితంగా ఇండియాలోని 90శాతం మార్కెట్ ను కవర్ చేసినట్లవుతుంది.