Internet Explorer : ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కు వీడ్కోలు.. గుర్తుగా సమాధి.. కొరియన్ ఇంజినీర్ నివాళి..!
మైక్రోసాఫ్ట్ దిగ్గజం ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్‌కు దాదాపు 27 ఏళ్ల తర్వాత ఇంటర్నెట్ ప్రపంచానికి కన్నీటి వీడ్కోలు పలికింది. మైక్రోసాఫ్ట్ ఇప్పుడు స్పీడ్ అండ్ సేఫ్ ఇంటర్నెట్ కోసం ప్రయత్నిస్తోంది.

Korean Engineer Builds Gravestone Worth Rs 25,000 In Memory Of Internet Explorer
Internet Explorer : మైక్రోసాఫ్ట్ దిగ్గజం ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్‌కు దాదాపు 27 ఏళ్ల తర్వాత ఇంటర్నెట్ ప్రపంచానికి కన్నీటి వీడ్కోలు పలికింది. మైక్రోసాఫ్ట్ ఇప్పుడు స్పీడ్ అండ్ సేఫ్ ఇంటర్నెట్ కోసం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ (Microsoft Edge) బ్రౌజర్ తీసుకొచ్చింది. ఈ మేరకు ఇంటర్నెట్ యూజర్లను కోరింది. క్రోమ్, మొజిల్లా ఫైర్‌ఫాక్స్, ఒపెరాతో సహా పోటీదారులచే ఎక్స్‌ప్లోరర్ పోటీపడలేకపోయింది. 90ల నుంచి 2000ల ప్రారంభంలో ఇంటర్నెట్ యూజర్లకు జ్ఞాపకాలలో ఎప్పటికీ నిలిచిపోతుంది. 27ఏళ్ల తర్వాత ఎక్స్‌ప్లోరర్ రిటైర్మెమెంట్ తీసుకుంటుంది. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ మెమెరీని గుర్తుచేసుకోవడానికి ఓ కొరియన్ ఇంజినీర్ ఏకంగా సమాధిని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు.
ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కు తగిన నివాళిగా భావించాడు. దక్షిణ కొరియాకు చెందిన ఇంజనీర్, జంగ్ కి-యంగ్ సమాధి కోసం సుమారు $300 (సుమారు రూ. 25,000) ఖర్చు పెట్టాడు. శ్మశానవాటికలో సమాధిపై ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ గురించి కొన్ని విషయాలను రాశాడు. ఇతర బ్రౌజర్‌లను డౌన్‌లోడ్ చేయడానికి ఇది ఒక గుడ్ టూల్ అని రాసిన ఒక శిలాఫలకాన్ని ఉంచాడు. ఏళ్ల తరబడి ఎక్స్‌ప్లోరర్ ప్రధానంగా క్రోమ్ లేదా ఫైర్‌ఫాక్స్ వంటి మెరుగైన వేగవంతమైన బ్రౌజర్‌లను డౌన్‌లోడ్ చేయడానికి ఉపయోగించేవారు.

Korean Engineer Builds Gravestone Worth Rs 25,000 In Memory Of Internet Explorer
ఎక్స్‌ప్లోరర్ అన్ని విండోస్ డివైజ్‌ల్లో ముందే లోడ్ అయి ఉంటుంది. కాబట్టి యూజర్లు తమ సిస్టమ్‌లో ఇతర బ్రౌజర్‌లను పొందడంలో సాయపడే ఏకైక టూల్‍గా భావించారు. కొరియన్ ఇంజినీర్ నిర్మించిన ఈ IE సమాధి రాయిని దక్షిణ కొరియాలోని జియోంగ్జులోని దక్షిణ నగరంలో తన సోదరుడు నడిపే కేఫ్‌లో ప్రదర్శించారు. సమాధిని ఫొటో తీసి వెంటనే పోస్టు చేయడంతో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
ఎక్స్‌ప్లోరర్ ఒకప్పుడు ఇంటర్నెట్లో ఆధిపత్యం చెలాయించిందని అతడు చెప్పాడు. జూన్ 15న, మైక్రోసాఫ్ట్, బ్లాగ్ పోస్ట్‌లో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ రిటైర్మెంట్‌ను ప్రకటించింది. IE కంటే మెరుగైన ఎడ్జ్ బ్రౌజర్‌కి మారమని తమ యూజర్లను ప్రోత్సహించింది. Microsoft Edge ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ కంటే వేగవంతమైనది. అంతేకాదు చాలా సేఫ్ కూడా. ఆధునిక బ్రౌజింగ్ అనుభవమే కాదు.. పాత, లెగసీ వెబ్‌సైట్‌లు అప్లికేషన్‌లకు కూడా బాగా సపోర్టు చేస్తుంది.
Read Also : Internet Explorer : 27ఏళ్ల తర్వాత ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ రిటైర్మెంట్.. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఉందిగా..!