Lost Aadhaar Card : మీ ఆధార్ కార్డు పోయిందా? ఇలా తిరిగి పొందండి..!

ఆధార్ కార్డు అనేక డాక్యుమెంట్లలో ఎంతో ముఖ్యమైనది.. గుర్తింపు కార్డుగా వినియోగంలో ఆధార్ తప్పనిసరిగా మారింది. వివిధ ప్రభుత్వ పథకాలు, ఇతర సర్వీసులు ఏది పొందాలన్నా కచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉండాల్సిందే.

Lost Aadhaar Card : మీ ఆధార్ కార్డు పోయిందా? ఇలా తిరిగి పొందండి..!

Lost Your Aadhaar Card Step By Guide How You Can Retrieve Uid

Updated On : June 21, 2021 / 10:13 PM IST

Lost Your Aadhaar Card : మీ ఆధార్ కోల్పోయారా? ఆధార్ ఎలా తిరిగి పొందాలో తెలియదా?  ఆధార్ కార్డు అనేక డాక్యుమెంట్లలో ఎంతో ముఖ్యమైనది.. గుర్తింపు కార్డుగా వినియోగంలో ఆధార్ తప్పనిసరిగా మారింది. వివిధ ప్రభుత్వ పథకాలు, ఇతర సర్వీసులు ఏది పొందాలన్నా కచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉండాల్సిందే.

12 అంకెల గల ఈ ఆధార్ కార్డును యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) జారీ చేస్తుంది. ఆధార్ కార్డు నెంబర్ మర్చిపోయారా? ఎవరైనా ఆధార్ కార్డు నెంబర్ కార్డు ఎక్కడైనా కోల్పోతే తిరిగి ఎలా పొందడం అని ఆలోచిస్తున్నారా?

రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు లేదా హెల్ప్ లైన్ నెంబరు ద్వారా ఆన్ లైన్‌లో ఎన్‌రోల్ మెంట్ నెంబరు లేదా యుఐడీని తిరిగి పొందవచ్చు. ఆధార్ యుఐడీ/ఈఐడీ నంబర్ తెలుసుకోవడానికి రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు నుంచి హెల్ప్ లైన్ 1947 డయల్ చేసి తెలుసుకోవచ్చు.

ఈ కింది విధంగా ఫాలో అవ్వండి :
– ఈ లింకు ద్వారా https://uidai.gov.in అధికారిక వెబ్ సైట్‌కు వెళ్లండి.
హోంపేజీలో ‘మై ఆధార్’ అనే ఆప్షన్ కింద ‘ఆధార్ సర్వీసెస్’ ఆప్షన్ ఎంచుకోండి.
– ‘Retrieve Lost లేదా Forgotten EID/UID’ ఆప్షన్ మీద Click చేయండి.
– మీ పేరు, ఈమెయిల్ ఐడీ, రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు వివరాలను ఎంటర్ చేయాలి.
– మీ వివరాలన్నీ నమోదు చేయండి. వెరిఫికేషన్ కోసం Captcha ఎంటర్ చేయాలి.
– Send OTP ఆప్షన్ క్లిక్ చేయండి.. రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుకు OTP వస్తుంది.
– మీ మొబైల్లో వచ్చిన 6 అంకెల OTPని నమోదు చేయండి.
– UID/EID నెంబర్ SMS ద్వారా మీ ఫోన్‌కు వస్తుంది.
– ఈ నెంబర్‌తో మీరు E-ఆధార్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.