Smartphones July 2025 : కొత్త ఫోన్ కావాలా? ఈ జూలైలో వచ్చిన టాప్ 7 స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఏది కొంటారో మీదే ఛాయిస్..!
Smartphones July 2025 : కొత్త ఫోన్ కావాలా? ఈ జూలైలో ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10, రియల్‌మి నార్జో 80 లైట్, వివో X200 FE, ఐక్యూ Z10R లాంచ్ అయ్యాయి.

Smartphones July 2025
Smartphones July 2025 : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో ఇప్పటికే కొత్త స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రధానంగా జూలై 2025 నెలలో ప్రముఖ బ్రాండ్ల (Smartphones July 2025) నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అయ్యాయి. అందులో ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10, రియల్‌మి నార్జో 80 లైట్ వంటి సరసమైన స్మార్ట్‌ఫోన్లు ఉండగా, వివో X200 FE, ఐక్యూ Z10R ప్రీమియం ఆప్షన్ల ఫోన్లు కూడా లభ్యమవుతున్నాయి.
భారతీయ యూజర్ల కోసం కొత్త రియల్‌మి కొత్త TWS ఇయర్‌బడ్‌లు, టాబ్లెట్‌లను కూడా ప్రవేశపెట్టింది. అయితే, వన్‌ప్లస్ బడ్జెట్-ఫ్రెండ్లీ ప్యాడ్ లైట్‌ను కూడా లాంచ్ చేసింది. ఈ నెలలో లాంచ్ అయిన టాప్ స్మార్ట్‌ఫోన్ల జాబితాను ఓసారి లుక్కేయండి.
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 :
భారత మార్కెట్లో ఈ నెల 25న ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 ఫోన్ లాంచ్ అయింది. అధికారిక ధర ఇంకా రివీల్ చేయనప్పటికీ, బడ్జెట్ యూజర్ల కోసం ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 5వేలు, రూ. 10వేల మధ్య ఉంటుందని అంచనా. ఎంపిక చేసిన ప్రపంచ మార్కెట్లలో ఈ ఇన్ఫినిక్స్ ఫోన్ అందుబాటులో ఉంది.
ఐక్యూ జెడ్ 10R :
ఐక్యూ Z10R ఫోన్ జూలై 24న లాంచ్ కాగా, మీడియాటెక్ డైమన్షిటీ 7400 చిప్‌సెట్, 6.77-అంగుళాల క్వాడ్-కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే, 12GB వరకు ర్యామ్, 256GB స్టోరేజ్‌తో వస్తుంది. ఈ 5G ఫోన్ ధర రూ.19,499 (128GB), రూ.21,499 (256GB) స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది.
రియల్‌మి 15 సిరీస్ :
రియల్‌మి జూలై 24న 15 ప్రో 5G, స్టాండర్డ్ 15 5G ఫోన్లను లాంచ్ చేసింది. ఈ రెండు రియల్‌మి ఫోన్‌లలో 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన భారీ 7,000mAh బ్యాటరీలు ఉన్నాయి. బేస్ మోడల్ ధరలు రూ. 25,999 నుంచి ప్రో వెర్షన్ రూ. 31,999 నుంచి లభ్యమవుతున్నాయి.
రియల్‌మి బడ్స్ T200 :
రియల్‌మి బడ్స్ T200 డివైజ్ TWS ఇయర్‌ఫోన్‌లు కూడా జూలై 24న లాంచ్ అయ్యాయి. రూ. 1,999 ధరకు లభించే ఈ ఇయర్‌బడ్‌లు 32dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, 12.4mm డ్రైవర్లను కలిగి ఉంటాయి. ఆగస్టు 1 నుంచి అమ్మకానికి వస్తాయి.
రియల్‌మి నార్జో 80 లైట్ 4G :
ఈ కొత్త రియల్‌మి నార్జో 80 లైట్ 4G 5G ఫోన్ జూలై 23న లాంచ్ అయింది. ఈ ఫోన్ 90Hz డిస్‌ప్లే, ఆక్టా-కోర్ చిప్‌సెట్, 128GB వరకు స్టోరేజ్‌తో వస్తుంది. 4GB + 64GB మోడల్ ధరలు రూ.7,299, 6GB + 128GB వేరియంట్ ధరలు రూ.8,299కు కొనుగోలు చేయొచ్చు.
వన్‌ప్లస్ ప్యాడ్ లైట్ :
వన్‌ప్లస్ ప్యాడ్ లైట్ (OnePlus Pad Lite) టాబ్లెట్ జూలై 23న లాంచ్ అయింది. భారీ 9,340mAh బ్యాటరీతో పాటు 33W ఛార్జింగ్‌తో వస్తుంది. Wi-Fi మోడల్ ధర రూ.15,999 కాగా, LTE వేరియంట్ ధర రూ.17,999కు పొందవచ్చు.
వివో X200 FE :
ఇటీవలే లాంచ్ అయిన వివో X200 FE ఫోన్ సేల్ జూలై 23న మొదలైంది. డైమెన్సిటీ 9300+ చిప్‌సెట్, 90W ఛార్జింగ్, జీస్ ఆప్టిక్స్‌తో 50MP ట్రిపుల్ రియర్ కెమెరా ఉన్నాయి. బేస్ మోడల్ ధర రూ. 54,999కు కొనుగోలు చేయొచ్చు.