Mark Zuckerberg : పాకిస్తాన్‌లో నాకు ఆల్మోస్ట్ ఉరిశిక్ష వేసేవాళ్లు.. జుకర్ బర్గ్ సంచలనం!
Mark Zuckerberg : ప్రపంచవ్యాప్తంగా వివిధ చట్టాలను ఎదుర్కొంటున్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు సవాళ్లను చర్చిస్తూ పాడ్‌కాస్టర్ జో రోగన్‌తో ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో మార్క్ జుకర్‌బర్గ్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Mark Zuckerberg
Mark Zuckerberg Death Sentence : సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ‘దైవదూషణ కంటెంట్’కు సంబంధించి తనపై కేసు నమోదైందని, పాకిస్తాన్‌లో తనకు దాదాపు మరణశిక్ష వేసేవాళ్లు అని ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ సంచలన కామెంట్స్ చేశారు.
ప్రపంచవ్యాప్తంగా వివిధ చట్టాలను ఎదుర్కొంటున్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు సవాళ్లను చర్చిస్తూ.. పాడ్‌కాస్టర్ జో రోగన్‌తో ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో జుకర్‌బర్గ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. “వివిధ దేశాలలో మేం విభేదించే చట్టాలు ఉన్నాయి.
పాకిస్తాన్‌లో ఎవరో నాకు మరణశిక్ష విధించాలని ప్రయత్నించారు. ఎందుకంటే ఫేస్‌బుక్‌లో ఎవరో ప్రవక్త ముహమ్మద్ ఫొటోలను పోస్టు చేశారు. ఎవరో ‘అది మన సంస్కృతిలో దైవదూషణ’ అని అంటున్నారు. వారు నాపై కేసు పెట్టి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చూస్తున్నారు. కానీ, నేను పాకిస్తాన్‌కు వెళ్లాలనకోవడం లేదు. నేను దాని గురించి పెద్దగా ఆందోళన చెందడం లేదు” అని జుకర్‌బర్గ్ అని పేర్కొన్నారు.
అమెరికా ప్రభుత్వం సాయం చేయాలి :
ఫేస్‌బుక్ సీఈఓ తన పరిస్థితి కొంచెం ఆందోళనకరంగానే ఉందని అంగీకరించారు. ఈ కేసు ఎంతవరకు వెళ్లినా సరే తాను ధైర్యంగా ఉండటానికి పాక్‌లో తాను లేకపోవడమేనని జుకర్ బర్గ్ చెప్పుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా భావ ప్రకటనా స్వేచ్ఛకు విరుద్ధంగా విభిన్న విలువలను కలిగి ఉన్న ప్రదేశాలు ఇప్పటికీ ఉన్నాయని ఆయన అన్నారు.
Mark Zuckerberg: There was someone trying to have me sentenced to death in Pakistan for blasphemy. They opened criminal proceedings against me. I don’t know when, I’m just not planning to go to Pakistan, so I’m not worried about it. pic.twitter.com/er8Fx9Rp93
— PREM.⚡️ (@TweetsOfPR) February 10, 2025
ఇప్పటీకీ కఠిన చర్యలు లేదా నిషేధాన్ని ఆయా దేశాల ప్రభుత్వాలు కోరుకుంటున్నాయని జుకర్‌బర్గ్ హైలైట్ చేశారు. ఆ ప్రభుత్వాలు ఈ రకమైన అధికారాన్ని ప్రయోగించడం సరికాదన్నారు. విదేశాలలో ఉన్న అమెరికన్ టెక్ కంపెనీలను రక్షించడంలో అమెరికా ప్రభుత్వానికి సాయం అందించాలని కోరుకుంటున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫ్యాక్ట్ చెకింగ్ వ్యవస్థ రద్దుపై ట్రంప్ ఆమోదం :
ఫేస్‌బుక్‌లో కంటెంట్ నియంత్రణ, విధానానికి మార్పులను ప్రకటించిన నెల తర్వాత జుకర్‌బర్గ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ మార్పులలో ప్రధానంగా ఫ్యాక్ట్-చెకర్లను కూడా రద్దు చేశారు. కంటెంట్ నిర్వహణలో మెటా అతిపెద్ద సమగ్ర మార్పునకు సంబంధించి అనూహ్య ప్రకటనకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ వెంటనే ఆమోదం తెలిపారు.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, థ్రెడ్‌లతో సహా అన్ని మెటా ప్లాట్‌ఫామ్‌లలో ఇప్పటికే ఉన్న ఫ్యాక్ట్ చెకింగ్ సిస్టమ్ రద్దు చేసి మస్క్ ‘ఎక్స్’ ఉపయోగించిన మాదిరిగానే కొత్త కమ్యూనిటీ-ఆధారిత విధానాన్ని ప్రవేశపెట్టారు. సోషల్ మీడియా దిగ్గజం ప్రకారం.. ఈ మార్పు చట్టవిరుద్ధ కార్యకలాపాలు, ఉగ్రవాదం, పిల్లల లైంగిక దోపిడీ, మాదకద్రవ్యాల సంబంధిత నేరాలు వంటి అధిక తీవ్రత ఉల్లంఘనలను పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది.