Microsoft Copilot Pro : గ్లోబల్ మార్కెట్లోకి మైక్రోసాఫ్ట్ ఏఐ కోపిలట్ ప్రో వెర్షన్ రిలీజ్.. అదిరే ఫీచర్లు, భారత్‌లో ఈ మోడల్ ధర ఎంతంటే?

Microsoft Copilot Pro : మైక్రోసాఫ్ట్ నుంచి ఏఐ ప్రీమియం రేంజ్ కోపిలట్ ప్రో ప్రీమియం వెర్షన్ ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈ ప్రో వెర్షన్ మోడల్ భారత్ సహా 222 దేశాల్లో అందుబాటులోకి వచ్చింది.

Microsoft Copilot Pro : ప్రముఖ మైక్రోసాఫ్ట్ కంపెనీ కృత్రిమ మేధస్సు (AI) ప్లాట్‌ఫారమ్ ప్రీమియం రేంజ్ కోపిలట్ ప్రో ఇప్పుడు భారత్ సహా 222 దేశాలలో అందుబాటులో ఉంది. ఈ చాట్‌బాట్ ఆధారిత ఏఐ సూట్ చిన్న, మధ్య తరహా సంస్థలతో పాటు వ్యక్తిత యూజర్లకు కూడా అందుబాటులో ఉందని టెక్ దిగ్గజం ప్రకటించింది.

Read Also : Risk Of Colon Cancer : పెద్దపేగు క్యాన్సర్‌తో జాగ్రత్త.. ఎలాంటి డైట్ తప్పనిసరి.. ఏయే హై-పైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలంటే?

మైక్రోసాఫ్ట్ ఏఐ హైరేంజ్ మోడల్ కోపిలట్ ప్రోను ముందుగా ఎంపిక చేసిన మార్కెట్‌లలో జనవరి 2024లో కంపెనీ ప్రవేశపెట్టింది. మైక్రోసాఫ్ట్ 365 వెబ్ యాప్‌లలో ఏఐ యాక్సెస్‌ను కూడా అందిస్తుంది. ముఖ్యంగా, విండోస్ OS మేకర్ ఇటీవల జీపీటీ-4 టర్బో మోడల్‌తో కోపిలట్ (Copilot) ఫ్రీ వెర్షన్ అప్‌గ్రేడ్ చేసింది.

భారత్‌లో మైక్రోసాఫ్ట్ కోపిలట్ ప్రో ధర ఎంతంటే? :
మైక్రోసాఫ్ట్ కోపిలట్ ప్రో ఏఐ ప్లాట్‌ఫారమ్ ప్రీమియం టైర్ ధర ప్రతి యూజర్‌కు నెలకు రూ. 2వేలు చెల్లించాల్సి ఉంటుంది. వ్యక్తిగత యూజర్లు ప్రాథమిక ధరను చెల్లించవలసి ఉంటుంది. అయితే వ్యాపారాల కోసం ఏఐ టూల్ అవసరమయ్యే  వినియోగదారులందరూ ఈ మొత్తాన్ని చెల్లించాలి. ఈ ప్లాట్‌ఫారమ్.. వెబ్‌తో పాటు ఐఓఎస్, ఆండ్రాయిడ్‌ డివైజ్‌లలో కూడా అందుబాటులో ఉంటుంది. కంపెనీ కోపిలట్ మొబైల్ యాప్‌లపై ఒక నెల ఫ్రీ ట్రయల్‌ను కూడా అందిస్తోంది.

మైక్రోసాఫ్ట్ కోపైలట్ ప్రో ఫీచర్లు ఇవే :
కోపిలట్ ప్రో ప్రధానంగా మైక్రోసాఫ్ట్ 365 వెబ్ యాప్‌లలో కోపైలట్‌కు యాక్సెస్ పొందవచ్చు. ఇందులో వర్డ్, ఔట్‌లుక్, ఎక్స్ఎల్, పవర్ పాయింట్, ఇతర వెబ్ ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి. దీని కోసం విడిగా సబ్‌స్క్రిప్షన్ కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. అయినప్పటికీ, పీసీ, మ్యాక్ కోసం డెడికేటెడ్ డెస్క్‌టాప్ యాప్‌లలో ఏఐ టూల్ చేయొచ్చు. ఇందుకు మైక్రోసాఫ్ట్ 365 వ్యక్తిగత లేదా కుటుంబ సభ్యత్వం అవసరం పడుతుంది. మైక్రోసాఫ్ట్ 365 యాప్, ఐఓఎస్, ఆండ్రాయిడ్ కోసం ఔట్‌లుక్ వంటి ఉచిత బైల్ యాప్‌లకు కూడా ఈ ఫీచర్ రానున్న నెలల్లో విస్తరించనున్నట్టు టెక్ దిగ్గజం తెలిపింది.

మైక్రోసాఫ్ట్ కోపిలట్ ప్రో సబ్‌స్ర్కైబర్లకు లేటెస్ట్ ఏఐ మోడల్‌లకు ప్రాధాన్యత యాక్సెస్‌ను అందిస్తుంది. ప్రస్తుతం, ప్రో యూజర్లు మాత్రమే జీపీటీ-4, జీపీటీ-4 టర్బో మధ్య టోగుల్ చేసే అవకాశం ఉంది. ప్రీమియం ప్లాట్‌ఫారమ్ మెరుగైన ఏఐ ఇమేజ్ క్రియేషన్ సామర్థ్యాలతో వస్తుంది. వినియోగదారులకు రోజుకు 100 వరకు ఇమేజ్ క్రియేషన్ టెక్నిక్స్ అందిస్తుంది. వినియోగదారులు కస్టమైజడ్ కోపిలట్ జీపీటీలను కూడా క్రియేట్ చేయొచ్చు.

అలాగే షేరింగ్ కూడా చేయవచ్చు. పరిమిత డేటా, నిర్దిష్ట ప్రయోజనంతో మినీ చాట్‌బాట్‌ను క్రియేట్ చేయడానికి అనుమతించే చాట్‌జీపీటీ ప్లస్‌లోని జీపీటీలను పోలి ఉంటాయి. అయితే, వీటిని నేచురల్ లాంగ్వేజీ ప్రాంప్ట్‌లను ఉపయోగించి క్రియేట్ చేయొచ్చు.

Read Also : iPhone 16 Pro Leak : కొత్త డిజైన్‌, క్యాప్చర్ బటన్‌‌తో ఆపిల్ ఐఫోన్ 16 ప్రో వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

ట్రెండింగ్ వార్తలు