Microsoft Windows Outage : మైక్రోసాఫ్ట్ విండోస్‌లో బ్లూ స్ర్కీన్ కనిపిస్తుందా? ఈ క్రౌడ్‌స్ట్రైక్ ఇష్యూ ఏంటి? ఇదేలా ఫిక్స్ చేయాలంటే?

Microsoft Windows Outage : క్రౌడ్‌స్ట్రైక్ (CrowdStrike) అనేది ఒక సైబర్‌ సెక్యూరిటీ సంస్థ. అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ కోసం విండోస్‌తో కలిసి పనిచేస్తుంది. బగ్ సమస్యను ఎలా ఫిక్స్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Microsoft Windows Outage : మైక్రోసాఫ్ట్ విండోస్‌లో బ్లూ స్ర్కీన్ కనిపిస్తుందా? ఈ క్రౌడ్‌స్ట్రైక్ ఇష్యూ ఏంటి? ఇదేలా ఫిక్స్ చేయాలంటే?

Microsoft Windows outage_ What is CrowdStrike issue ( Image Source : Google )

Microsoft Windows outage: మీ మైక్రోసాఫ్ట్ విండోస్ 10లో బ్లూ స్ర్కీన్ కనిపిస్తుందా? ఆందోళన చెందకండి.. ప్రస్తుతం, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ప్రపంచవ్యాప్తంగా పనిచేయడం లేదు. అనేక మంది వినియోగదారులు కూడా విండోస్ బ్లూ కలర్ స్ర్కీన్ సమస్యను ఎదుర్కొంటున్నారు. బ్లూ కలర్ కంప్యూటర్ స్క్రీన్‌ల ఫొటోలతో సోషల్ మీడియా నిండిపోయింది.

వాస్తవానికి, బ్యాంకులు, విమానాశ్రయాలు వంటి క్లిష్టమైన ప్రదేశాలు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాయి. నివేదికల ప్రకారం.. ఈ లోపం ఎక్కువగా క్రౌడ్ స్ట్రైక్ (CrowdStrike) జారీ చేసిన అప్‌డేట్ ఫలితంగా ఉండవచ్చు. అయితే ఈ సమస్య ఏమిటి? ఎలా ఫిక్స్ చేయాలి అనే వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Read Also : Windows 11 Free Update : మైక్రోసాఫ్ట్ విండోస్ 11 ఫ్రీ అప్‌డేట్.. ఇకపై అందరికి అందుబాటులోకి.. ఎలా పొందాలంటే?

క్రౌడ్‌స్ట్రైక్ ఇష్యూ ఏమిటి? :
క్రౌడ్‌స్ట్రైక్ (CrowdStrike) అనేది ఒక సైబర్‌ సెక్యూరిటీ సంస్థ. అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ కోసం విండోస్‌తో కలిసి పనిచేస్తుంది. సంస్థ రియల్ టైమ్‌లో ఏదైనా థ్రెట్స్ గుర్తించి నిరోధించడానికి క్లౌడ్-ఆధారిత ఏఐ, మెషిన్ లెర్నింగ్‌ని ఉపయోగిస్తుంది. ఇటీవల, క్రౌడ్‌స్ట్రైక్ అప్‌డేట్ విండోస్ సిస్టమ్‌లలో (BSOD) సమస్యలకు దారితీసింది. వివిధ సెన్సార్ వెర్షన్‌లలో బ్లూ స్క్రీన్ క్రాష్‌లను (BSOD) ఎదుర్కొంటున్న విండోస్ సిస్టమ్‌ల గురించిన అనేక నివేదికలు తమకు అందాయని పేర్కొంది. ఈ మేరకు సంస్థ సపోర్ట్ నోట్‌లో సమస్యను ధృవీకరించింది. అయితే, ఈ సమస్యకు కారణాన్ని లేదా మరిన్ని వివరాలను అందించలేదు.

ఈడీఆర్ (EDR) సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కారణంగానే.. : 
“ఈ సమస్యను పరిష్కరించడానికి మా ఇంజనీరింగ్ బృందాలు చురుకుగా పనిచేస్తున్నాయి. సపోర్టు టిక్కెట్‌ను ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు” అని తెలిపింది. క్రౌడ్‌స్ట్రైక్ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తోంది. అయితే, శాశ్వత పరిష్కారం అమలులోకి వచ్చే వరకు వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ బగ్ సమస్యను ప్రస్తావిస్తూ.. మైక్రోసాఫ్ట్ కూడా ఒక ప్రకటనను విడుదల చేసింది. “థర్డ్-పార్టీ సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫారమ్ నుంచి వచ్చిన అప్‌డేట్ కారణంగా విండోస్ డివైజ్‌లను ప్రభావితం చేసే సమస్య గురించి మాకు తెలుసు. దీనికి పరిష్కారం త్వరలో వస్తుందని భావిస్తున్నాము” అని మైక్రోసాఫ్ట్ ప్రతినిధి పేర్కొన్నారు.

సైబర్‌ఆర్క్‌లోని చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (CIO) ఒమెర్ గ్రాస్‌మాన్ ప్రకారం.. “ప్రస్తుతం ఈ బగ్ సమస్య అధికంగానే కనిపిస్తుంది. 2024లో అత్యంత ముఖ్యమైన సైబర్ సమస్యలలో ఇదొకటి. ప్రపంచ స్థాయిలో వ్యాపార ప్రక్రియలకు నష్టం కలిగించేలా ఉంది. క్రౌడ్‌స్ట్రైక్ ఈడీఆర్ (EDR) ఉత్పత్తి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కారణంగా ఈ లోపం ఏర్పడింది’’ అని తెలిపారు. అంతేకాదు.. ఎజెండాలో రెండు ప్రధాన అంశాలు ఉన్నాయని ఆయన తెలిపారు.

“మొదటిది.. కస్టమర్‌లు ఆన్‌లైన్‌లోకి రావడం, వ్యాపార ప్రక్రియల కొనసాగించడం అనేది ఎండ్ పాయింట్‌లు క్రాష్ అయినందున బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ వాటిని రిమోట్‌గా అప్‌డేట్ చేయడం సాధ్యం కాదు. ఈ సమస్యను మాన్యువల్‌గా ఎండ్‌పాయింట్ ద్వారా పరిష్కరించాలి. దీనికి చాలా రోజుల సమయం పట్టవచ్చునని భావిస్తున్నారు” ఒమెర్ తెలిపారు. తగినంత నాణ్యత నియంత్రణ లేకుండా అప్‌డేట్ డౌన్‌లోడ్ చేసిన డెవలపర్ సైబర్‌టాక్ “డూమ్స్‌డే కమాండ్” లేదా “కిల్ స్విచ్”ని యాక్టివేట్ చేయడం వల్ల రాబోయే రోజుల్లో క్రౌడ్‌స్ట్రైక్ విశ్లేషణ, అప్‌డేట్‌లు సమస్యలను పరిష్కరించవచ్చునని  గ్రాస్‌మాన్ చెప్పారు.

CrowdStrike BSOD ఎలా ఫిక్స్ చేయాలంటే? :
క్రౌడ్ స్ట్రైక్ ఫాల్కన్ సాఫ్ట్‌వేర్‌కి చేసిన అప్‌డేట్ కారణంగా బగ్ ఏర్పడింది. త్వరలో మరో అప్‌డేట్ ఈ బగ్ పరిష్కరించే అవకాశాలు ఉన్నాయి. అయితే, ప్రస్తుతానికి క్రౌడ్ స్ట్రైక్ తన కస్టమర్‌లకు నోట్‌లో మాన్యువల్ సొల్యూషన్‌ను అందిస్తోంది. (CrowdStrike Windows 10 BSOD) సమస్యను పరిష్కరించడానికి ఈ కింది 4 దశలు తప్పనిసరిగా చెబుతోంది.

1. Windows ను సేఫ్ మోడ్ లేదా (WRE)లోకి బూట్ చేయండి.
2. C:\Windows\System32\drivers\CrowdStrikeకి వెళ్లండి
3. “C-00000291*.sys” ఫైల్‌ను గుర్తించి తొలగించండి.
4. సాధారణంగా బూట్ (Normal Boot) చేయండి.

వాస్తవానికి, ఇది తాత్కాలిక పరిష్కారమని చెప్పవచ్చు. ఎందుకంటే (CrowdStrike, Microsoft) కొంతకాలం తర్వాత సరైన పరిష్కారాన్ని జారీ చేసే అవకాశాలు ఉన్నాయి.

Read Also : Microsoft Outage : మైక్రోసాప్ట్ సేవలకు అంతరాయం.. ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకులు, విమానయాన, టెలీకాం రంగాలపై తీవ్ర ప్రభావం