Car Prices Hike : కారు కొంటున్నారా? ధరలు పెరుగుతున్నాయట.. వెంటనే కొనేసుకోండి!
కార్ల ధరలు పెరగబోతున్నాయట.. వెంటనే కొనేసుకోండి.. లేదంటే కొత్త వాహనాలు కొనడం కష్టమే.. కరోనా మహమ్మారి కాలంలో కార్ల తయారీ సంస్థలు ఇన్ పుట్ కాస్ట్ పెరిగిపోవడంతో అమాంతం ధరలు పెంచేశాయి.

More Worries For Semi Conductor Buyers As World’s Largest Chipmaker Plans Price Hike
Car Prices Hike- semi-conductor buyers plans price hike : కార్ల ధరలు పెరగబోతున్నాయట.. వెంటనే కొనేసుకోండి.. లేదంటే కొత్త వాహనాలు కొనడం కష్టమే.. కరోనా మహమ్మారి కాలంలో కార్ల తయారీ సంస్థలు ఇన్ పుట్ కాస్ట్ పెరిగిపోవడంతో అమాంతం ధరలు పెంచేశాయి. ఇప్పటికే కార్లు, బైక్‌ల తయారీ సంస్థలు తమ ధరలు పెంచేశాయి. మరోసారి కార్లు, బైక్‌ల ధరలు పెరిగిపోనున్నాయి. దాదాపు 10శాతం నుంచి 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఇంతకీ సడన్ గా ధరలు పెరుగుతాయనడానికి అసలు కారణం ఏంటో తెలుసా? సెమీ కండక్టర్ల ధరలు పెరగనున్నాయట.. ఎలక్ట్రానిక్ గూడ్స్, కార్లు, బైకులు, స్కూటర్లలో చిప్స్, సెమీ కండక్టర్ల వినియోగం భారీగా పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో సెమీ కండక్టర్ల ధరలు పెరిగే పరిస్థితి నెలకొంది. అదేగానీ జరిగితే.. ఆటోమొబైల్ రంగం కోలుకోవడం కష్టమేనని అంటున్నారు. భారీ పన్నులతో ఇబ్బందులకు తోడు ఎలక్ట్రానిక్ గూడ్స్ ధరలు పెరిగే అవకాశం ఉందని సమాచారం.
సెమీ కండక్టర్ల కొరతతోనే డిమాండ్ :
కరోనా పుణ్యామనీ వర్క్ ఫ్రమ్ హోం సంస్కృతి పెరిగిపోయింది. లాక్ డౌన్లతో చాలావరకు తయారీరంగాలు మూతపడాల్సి వచ్చింది. ప్రత్యేకించి పలు చిప్స్ తయారీ సంస్థలు మూతపడ్డాయి. ప్రజారవాణపై ఆధారపడే పరిస్థితి లేకపోవడంతో సొంత వాహనాలను నమ్ముకున్నారంతా.. దాంతో వాహనాల డిమాండ్ పెరిగిపోయింది. చిప్స్ తయారీకి అవసరమైన సెమీ కండక్టర్ల కొరత కూడా పెరిగిపోయింది. గ్లోబల్ ఆటో కంపెనీలు సైతం తమ ఉత్పత్తుల్లో కోత విధించినట్టు తెలుస్తోంది.
తైవాన్ సెమీ కండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కో (TSMC) సంస్థ.. ప్రపంచంలోనే అతిపెద్ద సెమీ కండక్టర్ల తయారీ కంపెనీ. ఈ సంస్థ తమ ఉత్పత్తుల ధరలు 20 శాతం వరకూ పెంచేందుకు రెడీ అవుతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగంలో సెమీ కండక్టర్ల ధరలు పెంచేందుకు TSMC సన్నద్ధమవుతోంది. ఒకవేళ ధరలు పెరిగితే.. అడ్వాన్స్డ్ చిప్స్ ధరలు 10 శాతం పెరగనున్నాయి. అలాగే ఆటో కంపెనీల్లో తక్కువ అడ్వాన్స్డ్ చిప్స్ ధరలు 15శాతం నుంచి 20 శాతం మేర పెరిగే అవకాశం ఉందని సమాచారం.
వినియోగదారుల డిమాండ్‌కు తగినట్టుగా సెమీ కండక్టర్ల ఉత్పత్తిని పెంచాలని టీఎస్ఎంసీ భావిస్తోంది. వచ్చే మూడేళ్లలో 100 బిలియన్ డాలర్లకు పైగా నిధులు సమీకరించాలని ప్లాన్ చేస్తోంది. కొత్త ఫ్యాక్టరీలపై ఈ నిధులను ఇన్వెస్ట్ చేయాలని చూస్తోంది. వచ్చే నెలాఖరులో సెమీ కండక్టర్ల సరఫరాలో కొరత సమస్యకు చెక్ పెడనున్నట్టు జాగ్వార్ లాండ్ రోవర్ అంచనా వేస్తోంది. ఇప్పటికే దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీలు మహీంద్రా అండ్ మహీంద్రా, ఎచిర్ మోటార్స్, మారుతి సుజుకి సంస్థల యాజమాన్యాలు తమ ఉత్పత్తిపై చిప్ సంక్షోభం ప్రభావం పడుతుందని భావిస్తున్నాయి.