Moto E13 is Now available on sale_ Check price, offers and more
Moto E13 Sale Offer : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటోరోలా (Motorola) బడ్జెట్-ఫ్రెండ్లీ Moto E13 హ్యాండ్‌సెట్‌ను ఇటీవలే భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.5-అంగుళాల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 5,000mAh బ్యాటరీని అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆక్టా-కోర్ యూనిసోక్ T606 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇప్పుడు కొనుగోలుకు అందుబాటులో ఉంది.
మోటో E13 ధర, ఆఫర్లు ఇవే :
Moto E13 బేస్ వేరియంట్ (2GB RAM, 64GB స్టోరేజ్) ధర రూ. 6,999గా ఉంటుంది. 4GB RAMతో 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 7,999కు అందుబాటులో ఉంది. ఆసక్తి గల కస్టమర్‌లు తమ స్మార్ట్‌ఫోన్‌లను ఫ్లిప్‌కార్ట్ (Flipkart), జియోమార్ట్ (JioMart) ఇతర అధీకృత రిటైల్ స్టోర్‌ల నుంచి కొనుగోలు చేయవచ్చు.
Moto E13 is Now available on sale_ Check price
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కంపెనీ జియో యూజర్లకు వెల్‌కమ్ ఆఫర్‌గా రూ.700 క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా, ఈ డివైజ్‌లో జియో యూజర్లు రూ. 2,500 వరకు ప్రత్యేక బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. కాస్మిక్ బ్లాక్, అరోరా గ్రీన్, క్రీమీ వైట్ కలర్స్ అనే మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఆసక్తికరంగా, జియో లాక్ ఆఫర్‌ని ఎంచుకోవడం ద్వారా ఇప్పటికే ఉన్న కొత్త జియో కస్టమర్‌లు ఫ్లాట్ రూ. 700 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.
Moto E13 స్పెసిఫికేషన్‌లు ఇవే :
మోటో E13 అనేది డ్యూయల్ సిమ్ (Nano) 4G డివైజ్.. ఆండ్రాయిడ్ 13 (గో ఎడిషన్) పై రన్ అవుతుంది. 20:9 యాస్పెక్ట్ రేషియోతో 6.5-అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ Mali-G57 MP1 GPUతో పాటు ఆక్టా-కోర్ UniSOC T606 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కొత్త డివైజ్ గరిష్టంగా 4GB LPDDR4x RAM, మైక్రో SD కార్డ్ (1TB వరకు) ద్వారా 64GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. Moto E13 సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం వెనుకవైపు13MP ప్రైమరీ కెమెరా సెన్సార్, ముందు భాగంలో 5MP షూటర్‌ను కలిగి ఉంది.
Moto E13 is Now available on sale
రెండు కెమెరా సెన్సార్లు 30 fps వద్ద FHD వీడియోలను రికార్డ్ చేయగలవని కంపెనీ పేర్కొంది. హ్యాండ్‌సెట్ 10W ఛార్జింగ్ కోసం 5,000mAh బ్యాటరీ సపోర్ట్‌ను ప్యాక్ చేస్తుంది. ఈ డివైజ్ గరిష్టంగా 23 గంటల వీడియో ప్లేబ్యాక్‌కు సపోర్టు ఇస్తుందని తెలిపింది. Motorola లేటెస్ట్ ఆఫర్ 164.19×74.95×8.47mm కొలుస్తుంది. దీని బరువు 179.5g అని కంపెనీ వెల్లడించింది.
ఈ హ్యాండ్‌సెట్ IP52-రేటెడ్ డస్ట్‌ని కలిగి ఉంది. వాటర్ రిసెస్టిన్స్ డిజైన్‌ను అందిస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్ల పరంగా స్మార్ట్‌ఫోన్ బ్లూటూత్ 5.0 వైర్‌లెస్ కనెక్టివిటీతో పాటు 2.4GHz 5GHz డ్యూయల్-బ్యాండ్ Wi-Fiకి సపోర్టు ఇస్తుంది. Moto E13 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌తో పాటు USB టైప్-C పోర్ట్‌ను కూడా అందిస్తుంది.