Moto G64 5G Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? మోటో G64 5జీ ఫోన్ సేల్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతంటే?

ఈ మోటో G64 ఫోన్ ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా వెబ్‌సైట్ (Motorola.in)లో రూ. 15,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఇతర రిటైల్ స్టోర్‌లలో అదనపు డిస్కౌంట్లు, ఆఫర్‌లతో ధర రూ.14,999కి కొనుగోలు చేయొచ్చు.

Moto G64 5G Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? మోటో G64 5జీ ఫోన్ సేల్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతంటే?

Moto G64 5G now available for sale

Moto G64 5G Sale : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటోరోలా కొత్త మోటో G64 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఇటీవల భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ మోటో 5జీ ఫోన్ 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజీ, 50ఎంపీ ప్రధాన రియర్ కెమెరా, 6000ఎంఎహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లతో వచ్చింది.

Read Also : WhatsApp Users : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఫొటోలు, ఫైల్స్ పంపేందుకు ఇంటర్నెట్‌తో పనిలేదు..!

ఈ మోటో G64 ఫోన్ ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా వెబ్‌సైట్ (Motorola.in)లో రూ. 15,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఇతర రిటైల్ స్టోర్‌లలో అదనపు డిస్కౌంట్లు, ఆఫర్‌లతో ధర రూ.14,999కి కొనుగోలు చేయొచ్చు. ఈ కొత్త మోటో జీ64 5జీ ఫోన్ ధర, వేరియంట్లు, స్పెసిఫికేషన్‌లను వివరంగా పరిశీలిద్దాం.

మోటో G64 5జీ ధర, వేరియంట్లు :
మోటో కొత్త G64 5జీ ఫోన్ 2 వేరియంట్‌లలో రిలీజ్ చేసింది. 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీ, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీని కలిగి ఉంది. ఈ ఫోన్ మొత్తం మింట్ గ్రీన్, పెరల్ బ్లూ ఐస్ లిలక్ అనే 3 కలర్ ఆప్షన్లలో వస్తుంది. మోటో జీ64 5జీ ఫోన్ ఫ్లిప్‌కార్ట్, మోటరోలా వెబ్‌సైట్, ప్రముఖ రిటైల్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ లాంచ్ ధర రూ. 16,999కి అందిస్తోంది. బ్యాంక్ లేదా ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లతో సహా ఫోన్ ధర రూ. 15,999 అందిస్తుండగా, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,999, రూ. 13,999కు పొందవచ్చు.

ఆసక్తిగల కొనుగోలుదారులు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్‌లపై రూ. 1,100 వరకు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ సహా వివిధ ఆఫర్‌లను పొందవచ్చు. పూర్తి పేమెంట్ కోసం హెచ్‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించే కస్టమర్‌లు రూ. 1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. 8జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.13,999, 12జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.15,999 నుంచి ప్రారంభమవుతుంది.

ఫ్లిప్‌కార్ట్‌లో కస్టమర్‌లు ఎక్స్‌ఛేంజ్ వాల్యుపై రూ. 1,000 అదనపు తగ్గింపు పొందవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై నో-కాస్ట్ ఈఎంఐపై 6 నెలల వరకు ఒక ఆప్షన్ కూడా ఉంది. నెలకు సుమారు రూ. 2,317 నుంచి ప్రారంభమవుతుంది. 12జీబీ+256జీబీ వేరియంట్ కోసం ఆఫర్‌లతో ధర రూ. 15,999, 8జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ. 13,999కు అందిస్తోంది.

మోటో G64 స్పెసిఫికేషన్స్ :
డిస్‌ప్లే : మోటో G64 ఫోన్ 2400 x 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. మృదువైన 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది.కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది.

కొలతలు-బరువు : ఈ ఫోన్ కొలతలు 161.56 x 73.82 x 8.89ఎమ్ఎమ్, బరువు సుమారు 192 గ్రాములు ఉంటుంది.

పర్ఫార్మెన్స్ : మీడియాటెక్ డైమన్షిటీ 7025 చిప్‌సెట్‌తో ఆధారితం, మోటో జీ64 2.5జీహెచ్‌జెడ్ ఆక్టా-కోర్ సీపీయూను కలిగి ఉంది.

బ్యాటరీ : 6000ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది. 1టీబీ వరకు మైక్రో ఎస్‌డీ కార్డ్ విస్తరణ స్టోరేజీ సపోర్టు ఇస్తుంది.

ర్యామ్, స్టోరేజ్ వేరియంట్‌లు : మోటో జీ64 రెండు వేరియంట్‌లలో వస్తుంది. అందులో ఒకటి 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్, మరొకటి 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్‌తో వస్తుంది.

సాఫ్ట్‌వేర్ : ఆండ్రాయిడ్ 14లో మోటోరోలా 3 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్, ఆండ్రాయిడ్ 15కి అప్‌గ్రేడ్

కెమెరా సెటప్ : మోటో G64 డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 50ఎంపీ సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), 8ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా, సెకండరీ సెన్సార్ మాక్రో, డెప్త్ ఫోటోగ్రఫీకి సపోర్టు ఇస్తుంది. ఫ్రంట్ సైడ్ డివైజ్ 16ఎంపీ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

ఆడియో – కనెక్టివిటీ : ఈ 5జీ ఫోన్ స్పోర్ట్స్ స్టీరియో స్పీకర్లు, 2 మైక్రోఫోన్‌లు, 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ పోర్ట్. కనెక్టివిటీ ఆప్షన్లలో 14 5జీ బ్యాండ్‌లు, బ్లూటూత్ 5.3, హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ సామర్థ్యం ఉన్నాయి.

డిజైన్ కలర్ ఆప్షన్లు : ఈ డివైజ్ ఐపీ52 వాటర్-రిపెల్లెంట్ డిజైన్‌ను కలిగి ఉంది. మింట్ గ్రీన్, పెర్ల్ బ్లూ, ఐస్ లిలక్ 3 కలర్ ఆప్షన్లలో వస్తుంది.

Read Also : JioCinema Subscription Plan : ఈ నెల 25న జియోసినిమా కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ వచ్చేస్తోంది.. ఐపీఎల్‌కు చెల్లించాల్సిందేనా!