Moto G67 Power 5G : ఇది కదా ఫోన్ అంటే.. కొత్త మోటో G67 5G వచ్చేస్తోందోచ్.. భారీ బ్యాటరీ, 50MP సోనీ కెమెరాలే హైలెట్..!

Moto G67 Power 5G : మోటోరోలా కొత్త ఫోన్ వచ్చేస్తోంది. వచ్చే నవంబర్ 5న భారత మార్కెట్లో మోటో G67 5జీ ఫోన్ లాంచ్ కానుంది. ఫీచర్లు, ధర వివరాలివే..

Moto G67 Power 5G : ఇది కదా ఫోన్ అంటే.. కొత్త మోటో G67 5G వచ్చేస్తోందోచ్.. భారీ బ్యాటరీ, 50MP సోనీ కెమెరాలే హైలెట్..!

Moto G67 Power 5G

Updated On : October 29, 2025 / 7:07 PM IST

Moto G67 Power 5G : మోటోరోలా అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లలో మోటోరోలా నుంచి సరికొత్త వేరియంట్ రాబోతుంది. మోటో G67 పవర్ 5G అధికారికంగా లాంచ్ కానుంది. నవంబర్ 5 మధ్యాహ్నం 12 గంటలకు భారతీయ స్టోర్లలోకి రానుంది.

రాబోయే ఈ మోటో 5జీ ఫోన్ (Moto G67 Power 5G) టీజర్ ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో రిలీజ్ అయింది. లాంచ్ అయిన వెంటనే ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానుంది. ఈ మోటో 5జీ ఫోన్ ఫీచర్లు, ధర, బ్యాటరీకి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రీమియం డిజైన్, డిస్‌ప్లే :
మోటో జీ67 పవర్ 5జీ ఫోన్ 6.7-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌ (Moto G67 Power 5G) కలిగి ఉంది. గేమర్‌లు, స్ట్రీమర్‌లకు సిల్కీ స్మూత్ విజువల్స్‌ను అందిస్తుంది. స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ ఫోన్ బాడీ MIL-810H మిలిటరీ-గ్రేడ్ డిఫెన్స్, ఐపీ64-రేటెడ్ ఫ్రేమ్‌తో వస్తుంది. ప్రీమియం ఎండ్ అందించే వీగన్ లెదర్ బ్యాక్‌ను కూడా కలిగి ఉంది.

పర్ఫార్మెన్స్, సాఫ్ట్‌వేర్ :
హుడ్ కింద ఈ మోటోరోలా ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. 8GB ర్యామ్, 128GB స్టోరేజీతో వస్తుంది. రిచ్ మల్టీ టాస్కింగ్ కోసం మెమరీతో 24GB ర్యామ్ వరకు విస్తరించవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15-ఆధారిత హాలో యూఎక్స్‌పై రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 16 అప్‌డేట్‌తో వస్తుంది. డోల్బై అట్మోస్‌తో డ్యూయల్ స్టీరియో స్పీకర్లతో కూడా వస్తుంది. మల్టీమీడియా పవర్‌హౌస్ కలిగి ఉంది.

Read Also : PM Kisan 21st Installment : రైతులకు పండగే.. ఈ తేదీనే పీఎం కిసాన్ 21వ విడత.. ఇలా చేస్తేనే రూ. 2వేలు పడతాయట.. చెక్ చేసుకోండి!

కెమెరా, బ్యాటరీ :

మోటో G67 పవర్ 5జీ ఫోన్ 50MP సోనీ LYT-600 మెయిన్ సెన్సార్, ఇతర అల్ట్రావైడ్, డెప్త్ కెమెరాలతో పాటు అందిస్తుంది. ఫ్రంట్ సెల్ఫీలు, వీడియో కాల్స్ 32MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. అన్ని మోడళ్లలోని కెమెరాలు 4K వీడియో రికార్డింగ్, ఏఐ ఫొటో అప్‌గ్రేడ్ వంటి ఫీచర్లు అందిస్తాయి. ఈ డ్రైవ్‌లో సిలికాన్-కార్బన్ టెక్నాలజీతో రన్ అయ్యే భారీ 7,000mAh బ్యాటరీ ఉంది. సింగిల్ ఛార్జ్‌పై 58 గంటల వరకు వినియోగాన్ని అందిస్తుంది.

భారీ బ్యాటరీ, ఏఐ కెమెరా, ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ బిల్డ్‌తో మోటో G67 పవర్ 5జీ భారత మార్కెట్లో మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ కేటగిరీలో వచ్చేందుకు రెడీగా ఉంది. మోటోరోలా మరోసారి క్లీన్ ఆండ్రాయిడ్, అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈసారి స్టైలిష్‌గా ఆకర్షణీయమైన డిజైన్‌తో వస్తుంది. ఈ ఫోన్ బ్లూ, గ్రీన్, పర్పల్ వంటి 3 పాంటోన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ధర వివరాలు ఇంకా రివీల్ చేయలేదు. కానీ, మిడ్ రేంజ్ 5G సెగ్మెంట్‌లో సరసమైన ధరకే వస్తుందని భావిస్తున్నారు.