అద్భుతమైన ఫీచర్లు : కొత్త మోటో ఫోన్లు వచ్చేస్తున్నాయ్! 

మొబైల్స్ త‌యారీదారు సంస్థ మోటోరోలా నాలుగు కొత్త స్మార్ట్ ఫోన్లతో భారత మార్కెట్లలోకి రానుంది. ఎన్నో లీకులు, రూమర్లతో వార్తల్లో నిలిచిన మోటోరోలా చివరికి మోడ్రాన్ స్మార్ట్ ఫోన్లతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ముందుకొస్తోంది.

  • Published By: sreehari ,Published On : January 23, 2019 / 04:29 PM IST
అద్భుతమైన ఫీచర్లు : కొత్త మోటో ఫోన్లు వచ్చేస్తున్నాయ్! 

మొబైల్స్ త‌యారీదారు సంస్థ మోటోరోలా నాలుగు కొత్త స్మార్ట్ ఫోన్లతో భారత మార్కెట్లలోకి రానుంది. ఎన్నో లీకులు, రూమర్లతో వార్తల్లో నిలిచిన మోటోరోలా చివరికి మోడ్రాన్ స్మార్ట్ ఫోన్లతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ముందుకొస్తోంది.

మొబైల్స్ త‌యారీదారు సంస్థ మోటోరోలా నాలుగు కొత్త స్మార్ట్ ఫోన్లతో భారత మార్కెట్లలోకి రానుంది. ఎన్నో లీకులు, రూమర్లతో వార్తల్లో నిలిచిన మోటోరోలా చివరికి మోడ్రాన్ స్మార్ట్ ఫోన్లతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ముందుకొస్తోంది. ఫిబ్ర‌వ‌రి 7వ తేదీన నాలుగు కొత్త మోటో ఫోన్ల‌ను మోటోరోలా విడుద‌ల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మోటో జీ7, జీ7 ప్ల‌స్‌, జీ7 ప్లే, జీ7 ప‌వ‌ర్ అనే నాలుగు మోటోరోలా స్మార్ట్ ఫోన్లను బ్రెజిల్ లో లాంచింగ్ షెడ్యూల్ ప్లానింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఫోన్ల విడుదలకు సంబంధించి ఇప్పటికే మోటోరోలా నుంచి కొన్ని మెసేజ్ లు దర్శనమిస్తున్నాయి.

ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయంటే.. మోటో జీ7లో నాచ్ డ్ డిస్ ప్లే, ఫింగర్ ఫ్రింట్ సెన్సార్స్ బ్యాట్ లోగో సిగ్నేచర్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు.. మోటో జీ7, మోటో జీ7 ప్లస్ లో మాత్రం రెగ్యులర్ నాచ్ డిసిప్లేలతోనే లాంచ్ చేయనుంది. అలాగే మోటో జీ7 ప్లే, మోటో జీ7 పవర్ ఫీచర్లలో మాత్రం వాటర్ డ్రాప్ నాచ్ డిసిప్లే డిజైన్ తో ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక మోటో జీ7 పవర్ లో మాత్రం బ్యాటరీ సామర్థ్యం 5,000 మెగాహెడ్జ్ ఉందట. యూరోపియన్ లో విడుదలైన వివిధ రంగుల్లో మోటోరోలా జీ సిరీస్ ఫోన్ల ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇందులో తొలి మోడల్ మోటో జీ7 బ్లాక్, వైట్ కలర్ రెండు వెరియంట్స్ లో లభిస్తోంది. 

యూరోపియన్ మార్కెట్లలో హవా
జీ7 ప్లస్ రెడ్, బ్లూ కలర్లలో ఇప్పటికే యూరోపియన్ మార్కెట్లలో విడుదల చేశారు. జీ7 పవర్ మోడల్ బ్లాక్, లిలాక్ పర్పల్ కలర్లతో ఆకట్టుకునేలా ఉంది. మోటో జీ7 ప్లే గోల్డ్, బ్లూ కలర్ తో యూరోపియన్ మార్కెట్లో లభ్యం అవుతున్నాయి. మోటో జీ7, మోటో జీ7 ప్లస్ క్వాల్ కామ్న్ స్నాప్ డ్రాగన్ 660 చిప్ సెట్, మోటీ జీ7 పవర్ స్నాప్ డ్రాగన్ 625 ఎస్ఓసీ, జీ 7 ప్లస్ 14ఎన్ఎం క్వాల్ కమ్న్ స్నాప్ డ్రాగన్ 632 ఎస్ఓసీ. జీ7 పవర్ పై ఫాస్ట్ ఛార్జింగ్ 5,000 మెగాహెడ్జ్ బ్యాటరీతో లభ్యం కానుంది. జీ7 ప్లస్ స్నాప్ డ్రాగన్ 700 సిరీస్ ప్రాసిసెర్, లేటెస్ట్ జనరేషన్ స్నాప్ డ్రాగన్ 710 ప్రాసిసెర్ కూడా ఉంది. జీ7, జీ7 పవర్ మోడల్ ఫోన్లలో ఫింగర్ ఫ్రింట్ స్కానర్లు ఉన్నాయట. మోటోరోలా జీ7 ప్లే, జీ7 పవర్ ధరలు యూఈఐలో ప్రారంభ ధర EUR 149 (యూరోలు) అంటే.. మోటో జీ7 ప్లే, జీ7 ప‌వ‌ర్ ఫోన్లు రూ.12,075 ఉంటుంది అనమాట. అలాగే మోటో జీ7, మోటో జీ7 పవర్ (EUR 209) రూ.16,935 ప్రారంభ ధ‌ర‌ల‌కు ల‌భ్యం అవుతున్నాయి. త్వరలో మోటోరోలా అందించే మోటో జీ7, మోటో జీ7 పవర్ స్మార్ట్ ఫోన్లు కూడా భారత మార్కెట్లలోకి రానున్నాయి. 

మరికొన్ని ఫీచర్లు మీకోసం..
6.24 ఇంచ్ డిస్‌ప్లే, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 632 ప్రాసెస‌ర్‌, 3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 12, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ. 
మోటో జీ7 ప్ల‌స్‌లో 6.24 ఇంచ్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ స్నాప్ డ్రాగ‌న్ 660 ప్రాసెస‌ర్‌, 4/6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, 16, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 12 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 3500 ఎంఏహెచ్ బ్యాట‌రీ
మోటో జీ7 ప్లే ఫోన్‌లో 5.7 ఇంచ్ డిస్‌ప్లే, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 632 ప్రాసెస‌ర్‌, 2/3 జీబీ ర్యామ్‌, 16/32 జీబీ స్టోరేజ్‌, 12, 8 మెగాపిక్స‌ల్ బ్యాక్‌, ఫ్రంట్ కెమెరాలు, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ. 
మోటో జీ7 ప‌వ‌ర్ ఫోన్‌లో 6.2 ఇంచ్ డిస్‌ప్లే, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 632 ప్రాసెస‌ర్‌, 2/3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 12, 8 మెగాపిక్స‌ల్ బ్యాక్‌, ఫ్రంట్ కెమెరాలు, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.