Moto G77 5G Phone : 108MP కెమెరాతో కొత్త మోటో G77 5G ఫోన్ వస్తోందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంత ఉండొచ్చంటే?
Moto G77 5G Phone : కొత్త మోటోరోలా ఫోన్ అతి త్వరలో భారత మార్కెట్లోకి రాబోతుంది. 108MP కెమెరా, 5200mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లతో ఎప్పుడు లాంచ్ కానుందంటే?
Moto G77 5G Phone (Image Credit To Original Source)
- మోటోరోలా నుంచి సరికొత్త మోటో G77 5G ఫోన్
- 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, భారీ 5200mAh బ్యాటరీ
- 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 17,999
Moto G77 5G Phone : మోటోరోలా అభిమానులకు గుడ్ న్యూస్.. భారత మార్కెట్లోకి మోటోరోలా నుంచి సరికొత్త మోటో G77 5జీ ఫోన్ వచ్చేస్తోంది. లీక్ డేటా ప్రకారం.. జూలై 2026లో మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 6400 లేదా క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుందని భావిస్తున్నారు.
30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో భారీ 5200mAh బ్యాటరీతో రానుందని అంచనా. అంతేకాదు.. f/1.8 ఎపర్చర్‌తో 108MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా కూడా ఉండొచ్చు. రాబోయే మోటో G77 ఫోన్ గురించి ఫీచర్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..
ధర, లాంచ్ తేదీ ఎప్పుడంటే? :
ప్రస్తుతానికి, మోటోరోలా మోటో G77 5జీ ఫోన్ లాంచ్ తేదీ, ధరను అధికారికంగా వెల్లడించలేదు. అయితే, భారత మార్కెట్లో 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 17,999కు విడుదల కావచ్చని భావిస్తున్నారు. 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 19,499 నుంచి ఉండొచ్చు. ఈ మోటో ఫోన్ జూలై 2026లో భారత మార్కెట్లో లాంచ్ అవుతుందని అంచనా.

Moto G77 5G Phone (Image Credit To Original Source)
కెమెరా సెటప్, బ్యాటరీ :
మోటో జీ77 5జీ ఫోన్ బ్యాక్ సైడ్ f/1.8 ఎపర్చర్‌తో 108MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరాతో వచ్చే అవకాశం ఉంది. ఫ్రంట్ సైడ్ 32MP సెల్ఫీ కెమెరా ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ 30W టర్బోపవర్ ఛార్జింగ్‌తో 5200mAh బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు. ఎక్కువ సైమ్ ఫోన్ వాడినా కూడా రోజంతా బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. దాంతో పదేపదే రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు.
స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
మోటో జీ77 5జీ ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 6400 లేదా క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందే అవకాశం ఉంది. 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తుందని భావిస్తున్నారు. 2TB వరకు విస్తరించవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హలో యూఐతో రన్ అవుతుందని భావిస్తున్నారు. డాల్బీ అట్మాస్‌తో స్టీరియో స్పీకర్లతో రావొచ్చు.
డిస్‌ప్లే, డిజైన్ :
మోటో G77 5జీ ఫోన్ 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌తో 6.8-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుందని భావిస్తున్నారు. IP64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్, MIL-STD-810H వెరిఫికేషన్‌తో రానుంది. కచ్చితమైన కలర్ ఆప్షన్లు, కాంట్రాస్ట్‌తో అద్భుతమైన వ్యూ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది.
