Moto G86 Power 5G Review: తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లతో 5G ఫోన్… మోటో G86 పవర్ 5G ఎలా ఉందంటే?

ఇవన్నీ ఇబ్బంది లేకుండా సాగుతాయి.

Moto G86 Power 5G Review: తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లతో 5G ఫోన్… మోటో G86 పవర్ 5G ఎలా ఉందంటే?

Updated On : June 5, 2025 / 6:17 PM IST

తక్కువ ఖర్చుతో మంచి ఫీచర్లున్న 5G స్మార్ట్‌ఫోన్ కోసం మీరు చూస్తున్నారా? మీకు మోటో G86 పవర్ 5G ఒక మంచి ఆప్షన్. ఈ ఫోన్ యూజర్లు ఊహించిన దానికన్నా అద్భుతంగా పనిచేస్తుందని విశ్లేషకులు అంటున్నారు. మంచి పనితీరు, పెద్ద బ్యాటరీ, 5G సపోర్ట్, ఆకర్షణీయమైన డిజైన్.. ఇవన్నీ ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నాయి.

పెద్ద డిస్‌ప్లే 

ఈ ఫోన్ 6.7 అంగుళాల పెద్ద స్క్రీన్ తో వచ్చింది. అది కూడా 120Hz రిఫ్రెష్ రేట్‌తో అందుబాటులో ఉంది. యూట్యూబ్ చూడటం, ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేయడం, ఆన్‌లైన్ షాపింగ్, టెక్స్ట్ టైపింగ్.. ఇలా అన్ని పనులూ చాలా బాగా చేసుకోవచ్చు. పెద్ద స్క్రీన్ వల్ల వీడియోలు, చదవడం, గేమింగ్ ఎక్స్పీరియన్స్ అన్నీ స్పష్టంగా, ఆకట్టుకునేలా ఉంటాయి.

పనితీరు: రోజువారీ అవసరాలకు సరిపోతుంది!

ఈ ఫోన్‌లో Snapdragon 6 సిరీస్ ప్రాసెసర్ తో రన్ అవుతుంది. ఇది రోజువారీ సాధారణ వినియోగానికి చక్కగా సరిపోతుంది. యాప్స్ మార్చడం, వీడియో కాల్స్, స్ట్రీమింగ్, సోషల్ మీడియా వాడకం.. ఇవన్నీ ఇబ్బంది లేకుండా సాగుతాయి. 5G సౌకర్యం వల్ల ఇంటర్నెట్ వేగం కూడా బాగా ఉంటుంది. 

Also Read: హైదరాబాద్‌లోనూ వందలాది మంది రోడ్లపైకి వచ్చారు.. ఎవరికైనా ప్రాణనష్టం జరిగితే..?: సీపీ ఆనంద్

బ్యాటరీ 

ఈ ఫోన్‌లో 6000mAh బ్యాటరీ ఉంది. దీనివల్ల మీరు ఉదయం మొదలు రాత్రి వరకూ ఛార్జర్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. స్క్రోలింగ్, చాటింగ్, వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటం.. అన్నింటికీ బ్యాటరీ సహకరిస్తుంది. అదనంగా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో తక్కువ సమయంలోనే బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అవుతుంది.

కెమెరా, సాఫ్ట్‌వేర్

ఈ ఫోన్‌లో 50MP మెయిన్‌ కెమెరా ఉంది. సెల్ఫీలు, ఆహార పదార్థాల చిత్రాలు, సూర్యాస్తమయ దృశ్యాలు అన్నీ ఆకర్షణీయంగా వస్తాయి. మోటోరోలా ఫోన్‌లలో బ్లోట్‌వేర్ రహిత క్లీన్ UI ఉంటుంది. అంటే, ఫోన్‌లో అనవసరమైన యాప్స్ దాదాపుగా ఉండవు. 

చివరగా చెప్పాలంటే…

ధర రూ.16,145 – రూ.18,897 మధ్య ఉంది. మంచి డిజైన్, బడ్జెట్‌ ధర, ఆధునిక ఫీచర్లతో కూడిన ఫోన్ మీకు కావాలంటే మోటో G86 పవర్ 5G ఒక మంచి ఆప్షన్. పెద్ద స్క్రీన్, 5G సపోర్ట్, ఎక్కువకాలం పనిచేసే బ్యాటరీ.. ఇవన్నీ కలిసి ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నాయి.