Motorola Edge 20 : అద్భుతమైన ఫీచర్లు..ధర ఎంతంటే ?
మోటరోలా ఎడ్జ్ 20 లైట్ మోడల్ కు కొనసాగింపుగా...భారత మార్కెట్ లోకి మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ (motorola edge 20 fusion) ను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఇక దీని ఫ్యూచర్ల విషయానికి వస్తే...రెండు వేరియంట్లు ఉండనున్నాయి.

Motorola
Motorola Edge 20 Fusion : సెల్ ఫోన్ కంపెనీల్లో Motorola ఒకటి. ప్రముఖ స్మార్ట్ తయారీ కంపెనీలు వినియోగదారులను ఆకర్షించేందుకు సరికొత్త ఫీచర్లతో సెల్ ఫోన్లను ముందుకు తీసుకొస్తున్నాయి. మోటరోలా బ్రాండ్ కూడా ప్రధానమైన కంపెనీలకు ధీటుగా ఆకర్షణీయమైన ఫీచర్లలతో సెల్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా..మోటరోలా..ఎడ్జ్ 20 సిరీస్ లో భాగంగా..ఎడ్జ్ 20, ఎడ్జ్ 20 ఫ్యూజన్ మోడల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. రెండు ఫోన్లను భారత మార్కెట్ లో ఆగస్టు 17వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు సదరు కంపెనీ ప్రకటించింది. దీని ధర రూ. 21 వేలుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Read More : India vs England : భారత ఓపెనర్లు అదరగొట్టారు..హిట్ మ్యాన్ మెరుపులు
మోటరోలా ఎడ్జ్ 20 లైట్ మోడల్ కు కొనసాగింపుగా…భారత మార్కెట్ లోకి మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ (motorola edge 20 fusion) ను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఇక దీని ఫ్యూచర్ల విషయానికి వస్తే…రెండు వేరియంట్లు ఉండనున్నాయి. 6GB, 128 GB ఒక వేరియంట్, 8 GB, 128 GB మరో వేరియంట్ తో రానున్నాయి. మోటరోలా ఎడ్జ్ 20లో 108 MP రేర్ కెమెరా, 32 mp ఫ్రంట్ కెమెరా, 4000 mAH బ్యాటరీ, ఆండ్రాయిడ్ OS, 6.70 ఇంచ్ డిస్ ప్లే ఉంది.
Read More : Huzurabad: అక్టోబర్‌లో హుజూరాబాద్ ఉపఎన్నిక..?
మోటరోలా ఎడ్జ్ 20 మోడల్ మాత్రం ఒక వేరియంట్ 8GB, 128 GB స్టోరేజ్ తో లభించనుంది. మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ 10 బిట్ MMO LED స్ ప్లేతో 90 హెడ్జ్ రీ ఫ్రెష్ రానుంది. ఆండ్రాయిడ్ 11 OS, 5000mAH బ్యాటరీ ఫీచర్లు ఉన్నాయి. 108 మెగా పిక్సెల్ రేర్ కెమెరా ఉంది. ఇందులో 30 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.