Motorola Edge : 50MP ప్రైమరీ సెన్సార్‌తో రానున్న మోటోరోలా ఎడ్జ్ 40 5G ఫోన్.. ఫీచర్లు ఇవేనా? ధర ఎంత ఉండొచ్చుంటే?
Motorola Edge : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ఈ నెలలో మోటోరోలా నుంచి ఎడ్జ్ 40 5G ఫోన్ వచ్చేస్తోంది. 50MP ప్రైమరీ సెన్సార్‌తో కొనుగోలుదారులను ఆకట్టుకునేలా ఉండనుంది.

Motorola Edge 40 5G With 50-Megapixel Primary Sensor Tipped to Launch in India in May
Motorola Edge 40 5G Launch : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ మోటోరోలా (Motorola) నుంచి కొత్త ఎడ్జ్ మోడల్ 5G ఫోన్ రాబోతోంది. ఇప్పటికే ఈ 5G ఫోన్ యూరప్, మిడిల్ ఈస్ట్, లాటిన్ అమెరికా, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో లాంచ్ అయింది. ఈ మోటో ఎడ్జ్ 40 5G ఫోన్ సింగిల్ స్టోరేజ్ వేరియంట్‌తో వచ్చింది. ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8020 SoC ద్వారా పవర్ అందిస్తుంది. మోటోరోలా Edge 30కి సక్సెసర్‌గా గ్లోబల్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ హ్యాండ్‌సెట్‌లో 3D కర్వ్డ్ pOLED డిస్‌ప్లే ప్యానెల్ ఉంటుంది. మోటోరోలా ఎడ్జ్ 40 త్వరలో భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. భారతీయ వేరియంట్ ముఖ్య స్పెసిఫికేషన్‌లను కూడా సూచించినట్లు టిప్‌స్టర్ తెలిపింది.
మోటోరోలా ఎడ్జ్ 40 ఫోన్ ఈ నెలాఖరు నాటికి లాంచ్ అవకాశం ఉందని టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ (@yabhishekhd) ట్వీట్ చేశారు. ఈ ఫోన్ భారతీయ వేరియంట్ 144Hz 3D కర్వ్డ్ పోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని, IP68 రేటింగ్‌తో వస్తుందని తెలిపారు. గ్లోబల్ వేరియంట్‌కు పవర్ అందించే MediaTek డైమెన్సిటీ 8020 SoC ద్వారా పనిచేస్తుందని భావిస్తున్నారు. టిప్‌స్టర్ ప్రకారం.. మోటోరోలా ఎడ్జ్ 40 భారతీయ వేరియంట్‌లోని ప్రైమరీ 50-MP సెన్సార్ f/1.4 ఎపర్చరును కలిగి ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)ని అందిస్తుంది.
Read Also : Apple iPhone 15 Price : ఆపిల్ ఐఫోన్ 15 ధర ఎంతో తెలిసిందోచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చు? లాంచ్ టైమ్ అప్పుడేనట..!
భారత వేరియంట్ 68W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు అందిస్తుందని భావిస్తున్నారు. మోటోరోలా ఎడ్జ్ 40 గ్లోబల్ వేరియంట్ సింగిల్ (8GB + 256GB) స్టోరేజ్ వేరియంట్ ధర EUR 599.99 (దాదాపు రూ. 54వేలు) ఉండొచ్చు. ఈ ఫోన్ ఎక్లిప్స్ బ్లాక్, లూనార్ బ్లూ, నెబ్యులా గ్రీన్ అనే కలర్ ఆప్షన్‌లలో రానుంది. భారతీయ వేరియంట్ ధర వివరాలు ఇంకా వెల్లడించలేదు.

Motorola Edge 40 5G With 50-Megapixel Primary Sensor Tipped to Launch in India in May
మోటోరోలా ఎడ్జ్ 40 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
6.55-అంగుళాల ఫుల్-HD+ (2,400 x 1,080 పిక్సెల్‌లు) 3D కర్వ్డ్ పోలెడ్ డిస్‌ప్లే ప్యానెల్‌ను కలిగి ఉంది. మోటోరోలా Edge 40 రిఫ్రెష్ రేట్ 144Hz, టచ్ శాంప్లింగ్ రేట్ 360Hz, గరిష్టంగా 1,200 లోకల్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ ఫోన్ 8GB LPDDR4X RAM, 256GB UFS 3.1 ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌తో ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 8020 SoC ద్వారా అందిస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌తో వస్తుంది.
మోటోరోలా Edge 40 డ్యూయల్ వెనుక కెమెరా యూనిట్ OIS సపోర్టుతో 50-MP ప్రైమరీ సెన్సార్, మాక్రో లెన్స్‌తో కూడిన 13-MP అల్ట్రావైడ్ సెన్సార్‌ను కలిగి ఉంది. 32-MP ఫ్రంట్ సెన్సార్ డిస్‌ప్లే పైభాగంలో సెంటర్-అలైన్డ్ హోల్-పంచ్ ఉంటుంది. మోటోరోలా Edge 40 మోడల్ 68W TurboPower వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500mAh బ్యాటరీతో సపోర్టు అందిస్తుంది. డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.2, GPS, NFC కనెక్టివిటీ ఆప్షన్లతో పాటు USB టైప్-C పోర్ట్‌ను కూడా కలిగి ఉంది. ఈ డివైజ్ 167 గ్రాముల బరువు, హ్యాండ్‌సెట్ సైజు (158.43mm x 71.99mm x 7.49mm) ఉంటుందని నివేదిక తెలిపింది.