Motorola Edge 40 Neo Launch : మోటోరోలా ఎడ్జ్ 40 నియో ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర ఎంతో తెలిసిందోచ్..!
Motorola Edge 40 Neo : కొత్త మోటోరోలా ఎడ్జ్ 40 నియో ఫోన్ వచ్చేస్తోంది. ఈ నెల (సెప్టెంబర్) 21 లాంచ్ కానుంది. అంతకంటే ముందే మోటరోలా ఎడ్జ్ 40 నియో ధర లీక్ అయింది.

Motorola Edge 40 Neo India launch set for September 21, price tipped
Motorola Edge 40 Neo : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ మోటోరోలా (Motorola) నుంచి కొత్త (Motorola Edge 40 Neo) వచ్చేస్తోంది. ఇటీవలే ఐరోపాలో మోటోరోలా ఎడ్జ్ 40 నియో ఫోన్ అరంగేట్రం చేసింది. ఆ తర్వాత భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి సెప్టెంబర్ 21న ప్రవేశించడానికి రెడీగా ఉంది.
విదేశీ లభ్యత కారణంగా ఈ కొత్త ఫోన్ అనేక స్పెసిఫికేషన్‌లు ఇప్పటికే లీక్ అయ్యాయి. కానీ, ధర మాత్రం రివీల్ చేయలేదు. అయితే, ఈ 5G స్మార్ట్‌ఫోన్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇదే సరైన సమయం.. అధికారిక లాంచ్ ముందే రాబోయే ఈ ఫోన్ ధర లీక్ అయింది. స్పెషిఫికేషన్లు, ధర వివరాలు లీక్ అయ్యాయి.
మోటోరోలా ఎడ్జ్ 40 నియో : లీకైన ధర :
టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ కొత్త మోటరోలా ఎడ్జ్ 40 నియో భారత మార్కెట్లో రూ. 24,999 ధరతో వస్తుందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ ధర 128GB స్టోరేజ్ మోడల్‌కు ఉంటుందని అంచనా. 5G ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే దీనికి సంబంధించిన టీజర్‌లు ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లో కనిపించాయి.

Motorola Edge 40 Neo India launch set for September 21, price tipped
మోటోరోలా ఎడ్జ్ 40 నియో స్పెసిఫికేషన్‌లు :
మోటో ఎడ్జ్ 40 నియో ఫోన్ ద్వారా MediaTek Dimensity 7030 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్, 409ppi పిక్సెల్ సాంద్రతతో 6.55-అంగుళాల pOLED 10-బిట్ pOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. ఎగువ సెంటర్ పంచ్-హోల్ కటౌట్‌తో కర్వ్డ్ డిస్‌ప్లే డిజైన్‌ను అందిస్తుంది. బ్యాక్ ప్యానెల్‌కు లెదర్ ఎండ్ కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ Android 13తో ముందే లోడ్ అయింది. మోటోరోలా రెండు భవిష్యత్ Android వెర్షన్ Android 14, Android 15 వంటి అప్‌గ్రేడ్‌లను అందిస్తుంది.
ఇతర మోటరోలా స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగానే హ్యాండ్‌సెట్ స్టాక్ ఆండ్రాయిడ్ ఇంటర్‌ఫేస్‌తో రానుంది. ఆప్టిక్స్ పరంగా, మోటో ఎడ్జ్ 40 నియో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP ప్రైమరీ రియర్ కెమెరాను కలిగి ఉంది. డెప్త్, మాక్రో మోడ్‌లకు సపోర్టు ఇచ్చే 13MP అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్‌తో సపోర్టు ఇస్తుంది.
సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం, డివైజ్ 32MP ఫ్రంట్ కెమెరాతో రానుంది. హుడ్ కింద, 68W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్‌కు సపోర్టు అందించనుంది. సాధారణ 5,000mAh బ్యాటరీ ఉంది. సెక్యూరిటీ పరంగా వినియోగదారులు డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను పొందవచ్చు. మోటోరోలా ఎడ్జ్ 40 నియో స్మార్ట్‌ఫోన్ మాదిరిగానే వాటర్, డెస్ట్ రెసిస్టెన్స్ డివైజ్ IP68 రేటింగ్‌ను కలిగి ఉంది. కొత్త మోటో ఫోన్‌లో డాల్బీ అట్మోస్ ఆడియో, మోటో స్పేషియల్ సౌండ్‌తో కూడిన స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి. కొత్త మోటరోలా ఎడ్జ్ 40 లాంచ్‌కు కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది.
Read Also : Elon Musk : మస్క్ మళ్లీ ఫిట్టింగ్ పెట్టాడుగా.. ఇకపై ట్విట్టర్ (X) యూజర్లందరూ డబ్బులు చెల్లించాల్సిందేనా..!