రూ.2,000 డిస్కౌంట్‌.. మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు షురూ.. ఆలస్యం చేయకండి..

ఈ స్మార్ట్‌ఫోన్‌ 68W వైర్డు ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. 5,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో వచ్చింది.

రూ.2,000 డిస్కౌంట్‌.. మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు షురూ.. ఆలస్యం చేయకండి..

Updated On : April 9, 2025 / 4:04 PM IST

భారత్‌లో మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 2న భారత్‌లో లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్‌కి కొనసాగింపుగా మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ వచ్చింది.

IP68 +IP69- రేటెడ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ బిల్డ్‌తో ఇది రిలీజ్ అయింది. ఇది మీడియాటెక్ మెరిజెన్సిటీ 7400 చిప్‌సెట్ ద్వారా రన్ అవుతుంది. మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది.

మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 8GB + 256GB వేరియంట్ ధర భారత్‌లో రూ.22,999గా, 12GB + 256GB వేరియంట్ ధర రూ. 24,999గా ఉంది. దీనిని బుధవారం నుంచి ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా ఇండియా వెబ్‌సైట్‌లో మధ్యాహ్నం 12 గంటల నుంచి విక్రయానికి అందుబాటులో ఉంచారు. పాంటోన్ అమెజోనైట్, పాంటోన్ స్లిప్‌స్ట్రీమ్, పాంటోన్ జెఫిర్ కలర్ ఆప్షన్లతో దీన్ని తీసుకొచ్చారు.

యాక్సిస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొంటే రూ.2,000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఎక్స్‌చేంజ్‌ ఆఫర్‌ను వాడుకుంటే అదనంగా మరో రూ.2,000 ఆదా చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొంటే 5 శాతం ఇన్‌స్టాంట్‌ తగ్గింపును కూడా అందిస్తున్నారు.

Also Read: అదిరిపోయే ఫీచర్లతో మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది.. రెడీనా?

మరిన్ని ఫీచర్లు
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 6.7-అంగుళాల 1.5 కే (1,220×2,712 పిక్సెల్స్) క్వాడ్ పోల్డ్ స్క్రీన్‌తో వచ్చింది. 120Hz రిఫ్రెష్ రేటు 3,000 NITS పీక్‌ బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంది. ఇది 300Hz టచ్ శాంప్లింగ్‌ రేటు, వాటర్ టచ్ 3.0 టెక్నాలజీ HDR10+ సపోర్టుతో రిలీజైంది. స్క్రీన్‌లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఉంది.

మీడియాటెక్ మెడిన్సెన్సిటీ 7400 SOCతో ఇది పనిచేస్తోంది. 12GB వరకు LPDDR4X RAM, 256GB UFS 2.2 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వచ్చింది. మూడు సంవత్సరాల పాటు OS, నాలుగు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 68W వైర్డు ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. 5,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో వచ్చింది.