Motorola G96 5G : మతిపోగొట్టే ఫీచర్లతో మోటోరోలా G96 5G ఫోన్ వచ్చేసింది.. ఈ నెల 16 నుంచే సేల్.. అతి తక్కువ ధరకే కొనేసుకోండి..!
Motorola G96 5G : అదిరిపోయే ఫీచర్లతో మోటోరోలా G96 5G ఫోన్ వచ్చేసింది.. ధర, స్పెషిఫికేషన్ల వివరాలివే..

Motorola G96 5G
Motorola G96 5G : మోటోరోలా ఫ్యాన్స్ కోసం సరికొత్త 5G ఫోన్ వచ్చేసింది. భారత మార్కెట్లో మోటోరోలా అధికారికంగా మోటో G96 5G ఫోన్ లాంచ్ చేసింది. రూ. 20వేల లోపు (Motorola G96 5G) ధరలో ఈ మోటోరోలా ఫోన్ సెగ్మెంట్-ఫస్ట్ 144Hz 3D కర్వ్డ్ pOLED డిస్‌ప్లే , స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 చిప్‌సెట్, OISతో 50MP సోనీ LYTIA 700C సెన్సార్‌తో వస్తుంది.
అల్ట్రా స్లిమ్ వీగన్ లెదర్ డిజైన్, IP68 సర్టిఫికేషన్‌తో వస్తుంది. జూలై 16 నుంచి ఫ్లిప్‌కార్ట్, ఇతర రిటైలర్ల ద్వారా అందుబాటులో ఉంటుంది. ఈ మోటోరోలా ఫోన్ 7.93mm మందం, 178 గ్రాముల బరువు కలిగి ఉంది. మోటోరోలా G96 5G భారత్ ధర, స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
మోటోరోలా G96 5G స్పెసిఫికేషన్లు :
మోటోరోలా G96 5G ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల FHD+ 3D కర్వడ్ pOLED డిస్‌ప్లే, 1600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ మోటోరోలా ఫోన్ గొరిల్లా గ్లాస్ 5తో ప్రొటెక్షన్ అందిస్తుంది.
హుడ్ కింద ఈ ఫోన్ 8GB LPDDR4X ర్యామ్, 256GB వరకు UFS 2.2 స్టోరేజీతో స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2తో వస్తుంది. ఈ మోటోరోలా ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5500mAh బ్యాటరీ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15-ఆధారిత హలో యూఐపై రన్ అవుతుంది. ఏడాది OS అప్‌డేట్స్, 3 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ కూడా పొందవచ్చు.
ఇతర ఫీచర్లలో డాల్బీ అట్మోస్, హై-రెస్ ఆడియో, మోటో స్పేషియల్ సౌండ్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, మోటో సెక్యూర్ 3.0, ఫ్యామిలీ స్పేసెస్ 3.0, స్మార్ట్ కనెక్ట్ 2.0 వంటి ఫీచర్లు ఉన్నాయి.
కెమెరాల విషయానికొస్తే.. ఈ మోటోరోలా ఫోన్ 50MP సోనీ LYTIA 700C మెయిన్ కెమెరా OISతో పాటు 8MP అల్ట్రా-వైడ్+ మాక్రో+ డెప్త్ (3-in-1 సెన్సార్)తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ 4K రికార్డింగ్ సపోర్ట్‌తో 32MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది.
భారత్‌లో మోటో G96 5G ధర :
మోటోరోలా G96 5G ఫోన్ రెండు వేరియంట్లలో వస్తుంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ధర రూ. 17,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ ధర రూ. 19,999కు కొనుగోలు చేయొచ్చు. 4 పాంటోన్-క్యూరేటెడ్ కలర్ ఆప్షన్లలో (ఆష్లీ బ్లూ, గ్రీనర్ పాశ్చర్స్, కాట్లేయా ఆర్చిడ్, డ్రెస్డెన్ బ్లూ) లభ్యమవుతుంది.