Mozilla Firefox: ఇకపై మొజిల్లా ఫైర్ ఫాక్స్‌లో ఆ ఫీచర్ ఉండదట

ప్రముఖ వెబ్ బ్రౌజర్ ఫైర్‌ఫాక్స్ డిసెంబరులో ఫైర్‌ఫాక్స్ లాక్‌వైజ్ పాస్‌వర్డ్ మేనేజర్‌కు మద్దతును నిలిపేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. Mozilla నుండి వచ్చిన బ్లాగ్ పోస్ట్ ప్రకారం...

Mozilla Firefox: ఇకపై మొజిల్లా ఫైర్ ఫాక్స్‌లో ఆ ఫీచర్ ఉండదట

Mozilla Firefox

Updated On : November 25, 2021 / 8:36 AM IST

Mozilla Firefox: ప్రముఖ వెబ్ బ్రౌజర్ ఫైర్‌ఫాక్స్ డిసెంబరులో ఫైర్‌ఫాక్స్ లాక్‌వైజ్ పాస్‌వర్డ్ మేనేజర్‌కు మద్దతును నిలిపేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. Mozilla నుండి వచ్చిన బ్లాగ్ పోస్ట్ ప్రకారం, డిసెంబర్ 13, 2021 తర్వాత App Store లేదా Google Play Store నుండి Firefox లాక్‌వైస్‌ని ఇన్‌స్టాల్ చేయడం లేదా మళ్లీ ఇన్‌స్టాల్ చేయడం సాధ్యం కాదు.

లాక్‌వైజ్ ఫీచర్ వాడుకునేందుకు చివరిగా వచ్చిన iOS వెర్షన్ 1.8.1, Android వెర్షన్ 4.0.3 Firefox వెర్షన్లే చివరి రిలీజ్‌లు. తాజా అప్‌డేట్‌ గురించి తెలియజేయడానికి మొజిల్లా వినియోగదారులకు ఇమెయిల్ ద్వారా విషయాన్ని వెల్లడించింది.

“ఫైర్‌ఫాక్స్ లాక్‌వైస్ యాప్ ఇకపై అప్‌డేట్ దొరకదు. దీనికి ఎటువంటి సపోర్ట్ కూడా దొరకదు. Apple యాప్, Google Play స్టోర్‌లలోనూ అందుబాటులో ఉండదని స్పష్టం చేస్తున్నాం. ఆ తేదీ తర్వాత, ప్రస్తుత వినియోగదారులు Firefox డెస్క్‌టాప్, మొబైల్ బ్రౌజర్‌లలో సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లతో యాక్సెస్ చేయడాన్ని కొనసాగించవచ్చు” అని Mozilla తన ఇమెయిల్‌లో తెలిపింది.

………………………………….: పెంపుడు కుక్కకు బర్త్‌డే విషెస్‌.. నెటిజన్ల ఆగ్రహం!

Firefox Lockwise 2019లో ప్రారంభమైంది. అప్‌డేట్ యూజర్‌లకు Firefoxని ఉపయోగించి Android యాప్‌ల కోసం పాస్‌వర్డ్‌లను సేవ్ చేసే, ఆటోఫిల్ చేయగల సామర్థ్యాన్ని అందిస్తుంది. ట్రెండ్ కు అనుగుణంగా ఫేస్ లేదా ఫింగర్ ప్రింట్ ఉపయోగించి అన్‌లాక్ చేస్తుంది.